అంశం: ఒక స్వప్నం కోసం
శీర్షిక: *నా స్వప్నం నెరవేరేనా!*
మనసు కలవరపెడుతుంది
నిద్ర లోనూ స్వప్నం లోనూ
మదిని నిత్యం తొలుస్తుంది
అదే అదే పదే పదే , ఇప్పటికీ ఎప్పటికీ
ఎన్నో ఆశలతో మరెన్నో ఊసులతో
స్వాతంత్ర్య సమరయోధులు
గాంధీ, నెహ్రూ, సర్ధార్, సుభాష్ చంద్రబోస్
లాలా లజ్పత్, తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి
ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి,భగత్ సింగ్ లాంటి
ఎందరో స్వాతంత్ర సమరయోధులు
పోరాడి పోరాడి, వెంటాడి వేటాడి
త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి
స్వాతంత్ర్యం సాధించిన ఫలితమేమి లేకపోయే
*ఒక స్త్రీ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఒంటరిగా*
తిరిగిన రోజునే స్వాతంత్ర్యం వచ్చినట్లని*
*స్వాతంత్ర్యం ఫలాలు అందరికీ సమానంగా*
*అందిన రోజునే, స్వాతంత్ర్యం వచ్చినట్లనీ*
*దేశానికి వెన్నెముకైన గ్రామాలు అభివృద్ధి*
*చెందినపుడే స్వాతంత్ర్యం వచ్చినట్లనీ*
ప్రతిపాదించిరి
యేండ్లు దాటినా
దశాబ్దాలు గడిచినా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన
సాగుతుండే జనుల బ్రతుకులు
చెత్త కుండీల వద్ద శునకాల పోట్లాటలా
ప్రతి యేటా ప్రభుత్వాలు
లక్షల కోట్ల ఉచిత పధకాలను ప్రకటిస్తూ
పేదలకు అమలు చేస్తున్నామంటారు
యేడు గడిచే సరికి అదే బడుగు జీవులు
బొచ్చెలు పట్టుకుని చకోరపక్షుల్లా
నగదు పధకాల కొరకు ఎదురు చూస్తున్నారు
హక్కుల సాధన విషయం మరిచి పోయారు
ఎక్కడ పోతుండే లక్షల కోట్ల నిధులు
ఎవరి బొజ్జలు నిండుతుండేనో, తెలియకుండే
దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయే
బీదలు ఓటు బ్యాంకు గానే మిగిలి పోతుండే
నా స్వప్నం
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో*
*రాష్ట్రపతి పాలన విధించాలని*
అప్పుడు ప్రభుత్వ నేతలలో,
బ్యూరో క్రాట్లలో వణుకు పుడుతుంది
సత్వరం చట్టాలన్నీ అమలులోకి వస్తాయి
అవినీతి తగ్గుముఖం పడుతుంది
నాయకులు ఉచిత హామీలను ఆపేస్తారు
ఎన్నికల సంస్కరణలు మొదలవుతాయి
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు
వినియోగించుకుంటారు
ఉచితాలపై ఆధారపడకుండా ప్రజలు
స్వయం ఉపాధితో అభివృద్ధి సాధిస్తారు
ఓటర్లు ప్రశ్నించే శక్తిని పెంచుకుంటారు
ఆత్మాభిమానంతో జనులు జీవిస్తారు
No comments:
Post a Comment