అంశం: జీవన వేదం
శీర్షిక: *జీవన విధానం*
*సాగరాన్నైనా ఈదవచ్చు గానీ సంసారాన్నిఈదడం* *కష్టం*
అనే నానుడి వాడుకలో ఉండనే ఉంది
సంసారమనేది ఒక మహా సముద్రం
సాగించడంలో కనబరుచాలి భద్రం
చూపాలి తప్పని పరిస్థితిలో రౌద్రం
లేదంటే అవుతుంది జీవితం ఛిద్రం!
సంద్రంలో ఉన్నట్లే సుడిగుండాలు
రాళ్ళు రప్పలు, జలచరాలు, అగ్నిపర్వతాలు
ఆటుపోట్లు, ప్రకృతి వైపరీత్యాలు
జీవితంలోనూ ఉంటాయి కష్టాలు నష్టాలు!
బాధలు దుఃఖాలు రోగాలు భోగాలు
చావులు పుట్టుకలు బంధాలు రక్తసంబంధాలు
నిందలు అపనిందలు ఓటమి గెలుపులు
నమ్మకాలు అపనమ్మకాలు మూఢనమ్మకాలు!
కులాలు మతాలు ప్రాంతాలు దేశాలు
స్వదేశీ సంఘర్షణలు విదేశీ యుద్దాలు
రాజకీయాలు ప్రభుత్వ విధానాలు
ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో మరెన్నో!
అన్ని సమస్యలతో ప్రతి నిత్యం పోరాడుతూ
పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ
సజావుగా ఔన్నత్యంతో జీవనం సాగించడం
ప్రతి మనిషి విద్యుక్త ధర్మం
అదే మనిషి జీవన విధానం
పంచభూతాల నడుమ సప్త సముద్రాల మధ్య
జననం నుండి మరణం వరకు
మనిషి గడుపు *జీవన విధానమే*
జీవన వేదం జీవన సారం జీవన యానం!
No comments:
Post a Comment