అంశం:- భారత మాతకు జేజేలు
శీర్షిక:- నా దేశం పుణ్య పునీత
సృష్టిలో నాదేశం పుణ్య పునీత, నాదేశం పవిత్ర గంగా మాత...
నాదేశం అఖండ భగవద్గీత, నాదేశం ననుగన్న మాతృ దేవత...
చతుర్వేదాలు,భారతం, రామాయణం ఇతిహాసాలు, పురాణాలకు పుట్టినిల్లు...
వ్యాస వశిష్ట వాల్మీకి మహాఋషులు నన్నయ తిక్కన ఎర్రన పోతనలు...
జన్మించిన పుణ్యభూమి మరెచటా ప్రపంచంలో లేనిది కానరానిది...
ప్రేమానురాగాలు, ఐక్యతకు నెలవు సంస్కృతి సాంప్రదాయాలకు కల్పతరువు...
సాహిత్యం కళలు కళాకారులకు ఆదెరువు తపోఋషులకు,తపోధనులకు అచ్చెరువు...
భారతదేశం పవిత్ర సుమగంధం అది అనంతం, విశ్వవ్యాప్తం దేదీప్యమానం...
ఆపన్నుల అక్కున చేర్చుకును సుగుణం నిత్యం శాంతిని కోరుకునే స్వభావం...
భారతదేశ వైభవం విశ్వజనీయం! గంగా గోదావరి కృష్ణలు అద్వితీయం..!
తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పడమర అరేబియా సముద్రం...
పండిత పామర విజ్ఞాన మానవ వనరులు పుష్కల జలవనరులు...
అడవులు భూములు పంటలు ఔషధ వృక్షసంపదలు
శాస్త్రసాంకేతిక రంగాలలో అద్భుతం...
వ్యవసాయం ఆర్ధిక రంగాలలో పరిపుష్టం
భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం...
సుపరిపాలన నందించే నేతలు
అన్నిరంగాల్లో దూసుకు పోతున్న వనితలు...
ప్రపంచంలోనే అగ్రగణ్యులు మనసాఫ్ట్వేర్ ఇంజినీర్లు
నిరంతర కృషీవలులు రైతన్నలు...
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే జవానులు
డాక్టర్లు టీచర్లు శాస్త్రవేత్తలు!..
నా దేశం శాంతికాముకం, నా దేశం ఔన్నత్యము అనంతం , అజరామరం ఉన్నతం మహోన్నతం...
చేయిచేయి కలుపుదాం భారతమాతను పూజిద్దాం
భవ్యభారత్ ను నిరంతరం అగ్రభాగాన నిలుపుదాం!..
మముగన్న భరతమాతకు అందరం నిత్యం నిరంతరం జేజేలు పలుకుదాం...
No comments:
Post a Comment