Wednesday, February 19, 2025

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం

అంశం: ఆ పాట - నా పదాలు



సినిమా పేరు: తాతా మనవడు (1973)
రచయిత పేరు: సినారె
సంగీత దర్శకత్వం: రమేష్ నాయుడు
పాట పాడిన వారు: రామకృష్ణ
నటీ నటులు: ఎస్వీ రంగారావు , అంజలి
శీర్షిక:  *అనుబంధం ఆత్మీయత ఒక బూటకం*
సందర్భం:
తల్లితండ్రుల వదిలి స్వార్థంతో ఉన్నత స్థాయిలోఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి వెళ్తాడు అక్కడ పెళ్లి జరుగుతుంటుంది. ఇంటి వద్ద తల్లి అనారోగ్యంతో కన్నుమూస్తుంది. కొడుకు రాడు.ఆ సందర్భంగా చనిపోయిన భార్యను ఉద్దేశించి పాడిన పాట.హృదయవిదారకం;


అనుబంధం ఆత్మీయత అనేది ఒక బూటకం
ఆత్మ ప్రక్షాళనకు మనుషులు ఆడేవింతనాటకం
తల్లెవరూ తండ్రెవరూ కొడుకెవరూ
ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు!

ఎందుకో ఆ ఎడతెగని బంధం
కొన ఊపిరిలో ఉన్నపుడు
ఎందుకు ఆ అణగారిన అనుబంధం
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వడికి ఉంటుంది
ఆ కాలుతున్న వెలుగే కావాలి అందరికీ!

కొడుకు అనేవాడు నీకు ఒకడు ఉన్నాడు
కానీ, వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను చివరిసారి కూడా చూడడానికి రాలేదు
వల్లకాటికైనా వస్తాడన్న ఆశ నాకు లేదు
ఎవరు తల్లీ నీ ఆత్మ ఘోషను వినేది
ఏ తల్లి కూడా కనకూడదు ఇలాంటి కొడుకును!

పరాయుల గురించి పట్టించుకునే మూర్ఖునికి
కన్నవారి కడుపు కోత ఎలా తెలుస్తుంది
తారా జువ్వల కాంతిలో లీనమైన ఉన్మాధికి
చితి మంటల చిటపటలు వినిపిస్తాయా
ఆ చితి మంటల సెగలు కనిపిస్తాయా!

     

No comments: