Wednesday, February 26, 2025

మహాశివరాత్రి

అంశం: *మహాశివరాత్రి*

శీర్షిక: *భోళా శంకరుడు*

హిందూ పురాణాల ప్రకారం
ప్రతియేటా మాఘమాసం కృష్ణ పక్షం
చతుర్దశి రోజు వచ్చే పవిత్రమైన రోజున
శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగు
అందుకే అంటారు జన్మకో శివరాత్రి!

మధ్య రాత్రి లింగాకారంలో ఉద్భవించిన 
త్రిశూలాధారి త్రిగుణాత్ముడు
విభూతి ధారణుడు విశ్వలయకారకుడు
సర్పమును కంఠాభరణముగ ధరించినవాడు
శిరస్సుపై గంగా పార్వతిని నిలిపిన వాడు!

విషాన్ని కంఠంలో బిగపట్టిన గరళకంఠుడు
పులి చర్మాన్ని వస్త్రంగా ధరించిన వాడు
అర్ధ నారీశ్వరురుడు నంది వాహనుడు!

త్రికోణ పత్రాలైన బిల్వ పత్రాలతో పూజిస్తే
సంతోషంతో ఆనందతాండవం చేయు
అల్ప సంతోషి భోళా శంకరుడు!

సప్త చక్రాలలో ఏడవది సహస్రార చక్రం
తలపైన నుండు ఎవరికైన
సహస్రార చక్రం బీజాక్షరంమే "ఓం"!

ఓం అననుది భోళా శంకరుడికి పంచప్రాణం
ప్రతి నిత్యం "ఓం" అను బీజాక్షరం
108 మార్లు జపించిన జీవితం ధన్యం

*మహా శివరాత్రి* రోజున భక్తితో నిష్టతో
ఇష్టంగా ఉపవాస దీక్ష చేసిన
నిశి అంతా జాగారం చేస్తూ
*ఓం నమఃశివాయ* అను బీజాక్షరములను
జపించిన చాలు జీవితం ధన్యమౌ!

బ్రహ్మ విష్ణు మహేశ్వరుడులో
మూడవ వాడు మహేశ్వరుడు 
సృష్టి స్థితి లయకారులలో
లయ కారకుడు!

No comments: