Thursday, February 20, 2025

మాతృ భాషా దినోత్సవం

అంశం: మాతృ భాషా దినోత్సవం


శీర్షిక: *తెలుగు భాష వైభవం*

గలగల పారే గోదావరి సిరులు
మిలమిల మెరిసే నింగిన తారలు
ఘుమ ఘుమ లాడే విరిసిన సిరి మల్లెలు
మృదు మధురమైన జుంటి తేనే నా తెలుగు!

పరభాష ద్రావిడ భాషలో పుట్టింది బీజం
భరత పుడమి లోన విరిసిన రాజము
సమస్త ప్రపంచానికి విస్తరించిన తేజం
తేనె లొలుకు భాష నా తెలుగు భాష!

తెలుగు భాష తీయదనం
తెలుగు జాతి గొప్పతనం
ఏ భాష వారికైననూ సహితం
నచ్చుతుంది అందులోని కమ్మదనం
నవరసాలను పండించు దివ్యమైన భాష
కీర్తించిరి శ్రీ కృష్ణ దేవరాయలు ఎంతో గొప్పగాను
*దేశ భాషలందు తెలుగు లెస్స*  అని

నిండు పౌర్ణమి నాటి చల్లని చందమామ
పంట చేనుపై రంకెలేస్తున్న గొల్ల భామ
చంటి బిడ్డకు కడుపు నింపిన తల్లి ప్రేమ
ఎల్లలు దాటిన ఎనలేనిభాష నామాతృభాష
*ది ఇటలీయన్ ఆఫ్ ది ఈస్ట్* అని
విదేశీకవులు కీర్తించిన గొప్ప భాష తెలుగు!

తెలుగు భాషను గుర్తించిరి ప్రాచీన భాషగా
హిందీ బెంగాలీ తరువాత అధిక ప్రజలు
దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు
ప్రతియేటా ఆగష్టు ఇరువై తొమ్మిదిన
తెలుగు భాషా దినోత్సవముగ జరుపుకుంటాం
అది గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం
         
           

No comments: