Saturday, February 22, 2025

లాటానుప్రాసాలంకారాలు

అంశం: లాటానుపాసాలంకారాలు

ఉదా: 

శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ 

మానవత్వం కలుగు మనిషి మనిషి

తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు 


శీర్షిక: మాటా మజాకా

అయోధ్యనేలు రాముడు రాముడు
హరినామం వీడని ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు
విష్ణువు సేవించు భక్తుడు భక్తుడు
మాటతప్పని శిష్యుడు ఏకలవ్యుడు ఏకలవ్యుడు
కోరిన వరారలనిచ్చు దేవుడు దేవుడు
పంటల పండించు రైతు రైతు
నిర్మల్ జిల్లా కళాకారుల బొమ్మలు బొమ్మలు
అన్నమయ్య కీర్తనలు కీర్తనలు
బాలసుబ్రహ్మణ్యం పాటలు పాటలు
ఘంటసాల గొంతుక గొంతుక
సర్దార్ పటేల్ ధైర్యం ధైర్యం
దేశం కోసం ప్రాణాలర్పించ సిద్ధపడిన సైనికుడు సైనికుడు
మహాత్మా గాంధీజీ సత్యాగ్రహం సత్యాగ్రహం
శ్రీనాధుడి పద్యాలు పద్యాలు
ఉషోదయాన వెంకటేశ్వరుని సుప్రభాతం సుప్రభాతం
తల్లిదండ్రుల సేవించు శ్రావణుడు కొడుకు కొడుకు
శివుడుని పూజించిన భక్తుడు కన్నప్ప కన్నప్ప
బ్రహ్మముహూర్తంలో కోడి పుంజు కూత కూత
తండ్రి కోరిక మేరకు బ్రహ్మచారి యైన భీష్ముడు భీష్ముడు
ధర్మాన్ని పాటించు మనిషి మనిషి

దేవుని మ్రోక్కిన కరము కరము

భక్తి గానం  చేసిన స్వరము స్వరము

దేవుని మెడలో వేసిన సరము సరము 

దైవం ఒసగిన వరము వరము

కవనం వ్రాసే కలము కలము

మానవత చాటే కులము కులము

దేవుని అభిషేకించే జలము జలము

మాగాణి దున్నే హలము హలము

దైవాన్ని స్మరియించు మనసు మనసు

దైవ కృప తోడైన బ్రతుకు ఘనమ ఘనము

అక్కరకువచ్చే ధనము ధనము

వన్యప్రాణులకు రక్షణనిచ్చే వనము వనము

మానవత్వమున్న మనిషి మనిషి 

తల్లిదండ్రులను సేవించు బిడ్డలు బిడ్డలు 

భగవానుని దర్శించు నేత్రాలు నేత్రాలు 

దేవదేవుని కీర్తించు నోరు నోరు 

పరమాత్మ కృపతో పొందు జ్ఞానం జ్ఞానం 

పదుగురికి ఉపయోగపడు జన్మ జన్మ 

ఆడి తప్పని మాట మాట 

దేనినైనా తట్టుకునే గుండె గుండె

వాల్మీకి సహజత్వానికి మునులు

 వ్యక్తపరిచే సూచనలు సూచనలు 

పరివర్తనతో చలించిన వాల్మీకి కరుణ కరుణ 

ప్రేమ తత్వం నిండిన పాత్రలు తో

రామాయణ గ్రంథం గ్రంథం 

కుచేలుని కోసం సింహాసనం దిగివచ్చిన

 శ్రీ కృష్ణుని స్నేహం స్నేహం 

మిత్రుని ఏమి కోరకుండా వెనుతిరిగిన కుచేలుని 

గౌరవం గౌరవం 

దేవుని ఉనికి వ్యక్తీకరణ చేసే

 ప్రకృతి అందం అందం 

ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి

పరవశించే కనులు కనులు 

సోదర సోదరీమణులార అంటూ 

 అమెరికన్లును ఉత్తేజ పరచిన 

 వివేకానందుని ప్రసంగము ప్రసంగము 

గాలి నీరు అందరికి సమానం

అష్టాక్షరీ మంత్రం నాకే ఎందుకు సొంతం 

నారాయణ మంత్రం గోపురం ఎక్కి 

అందరికి అందజేసిన భగవత్ రామానుజాచార్యుల ఔదార్యం ఔదార్యం

పరహితము పరమాత్మ చింతన

నమ్మిన మన హిందూ ధర్మము ధర్మము


           

No comments: