" పరవస్తు చిన్నయ సూరి"
*చాత్తాద శ్రీవైష్ణవ కుల భూషణుడు , గద్య రచనా ఘనుడు శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి*.
*శ్రీమాన్ పరవస్తు చిన్నయ్య సూరి* , చాత్తాద శ్రీవైష్ణవ కులమున జన్మించడం మనకెంతో గర్వ కారణం.
19 , 20 శతాబ్దాలు ప్రధానంగా , ఆంధ్ర సాహిత్యానికి గుర్తింప దగినవి. తెలుగు సాహిత్యం తన తొలినాటి పద్య గద్య స్వరూపాలతో విలక్షణమైన , విచక్షణ మైన మార్పులను చోటు చేసుకుని మలుపు తిరిగిన కాలమది .
***********
*శ్రీమాన్ రంగ రామానుజా చార్యులు* మహా పండితులు. వీరు శ్రీ పెరంబదూరున ద్రవిడ వేదాధ్యయనం చేయించు ఆచార్యులు . వీరికి చాలా కాలం వరకు మగ సంతానం కలుగలేదు . అందుకు వీరి దంపతులు చేయని పూజలు , చేయని వ్రతాలు లేవు. చివరగా శ్రీ శ్రీనివాసా చార్యుల ఆధ్వర్యమున , *పుత్ర కామేష్టి* యాగం చేయుటచే , ఆ దంపతులకు మగ శిశువు జన్మించాడు. పేరు శ్రీనివాసుడు అని పెట్టారు. అతడే శీనయ్య , *చిన్నయ్య* గా నిలిచి పోయాడు.
లేక లేక పుట్టిన గారాల బిడ్డ , పెరిగి పెద్ద వాడయ్యాడు . *పండిత పుత్ర పరమ శుంఠ* కాకూడదని , కీర్తి నార్జించాలని *శ్రీమాన్ రంగ రామానుజా చార్యులు* , తన స్నేహితుడైన శ్రీ కంచి రామానుజా చార్యుల వద్ద , విద్యనార్జింప చేశాడు.
బాల సూరికి జ్ఞ్యానోదయం అయ్యింది. శ్రీ కంచి రామానుజా చార్యుల వద్దనే విద్యాభ్యాసం , ఏక సంధాగ్రహి, సర్వ శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. తండ్రి నుండి వ్యాకరణాదుల అభ్యాసనం చేశాడు. సకల విద్యలకు ప్రాణ బీజమైన *హయ గ్రీవో పాసనా* మంత్రోపదేశమును , శ్రీ రామ శాస్త్రుల వద్ద పొంది సంపూర్ణ శాస్త్ర విజ్ఞ్యాన సంపన్నుడయ్యాడు.

విక్టోరియా మహారాణి పట్టాభిషేక మహోత్సవం , 1837 లో లండన్ నగరంలో జరిగింది . మద్రాస్ పట్టాభిషేక మహోత్సవ సభలో పద్య రత్నములను చదివారు శ్రీ చిన్నయ్య గారు . శ్రీ చిన్నయ్య ప్రతిభను గుర్తించిన , నాటి పచ్చయ్యప్ప కళాశాల వారు , ప్రెసిడెన్సీ కళాశాల పండిత పోటీ పరీక్షలను నిర్వహించిరి. ఆ పండిత పోటీ పరీక్షల్లో , శ్రీ చిన్నయ్య గారు ప్రథముడిగా నెగ్గడం వలన , వీరిని ఆ కళాశాల వారు ప్రథమాంధ్ర పండితునిగా నియమించారు . అది శ్రీ చిన్నయ్య గారికి , గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది . పండిత మండలిలో అగ్ర గణ్యుడైనాడు . వారి బోధనా పటిమకు గౌరవాదరములు లభించినవి. "అర్బత్ నాట్" దొరగారు , "శాస్త్రి" , "శర్మ" అను బిరుదముల వలె , శ్రీ చిన్నయ్య గారికి *చిన్నయ్య సూరి* అను బిరుదు చెక్కింప బడిన బంగారు కంకణమును , లండన్ నుండి తెప్పించి , ఒక సభలో శ్రీ చిన్నయ్య గారి చేతికి తొడిగిరి . ఆనాటి నుండి చిన్నయ్య కాస్తా * చిన్నయ్య సూరి* గా ఖ్యాతి నొందిరి. పరవస్తు మఠ , పరంపర నుండి వచ్చాడు కాబట్టి , వారి ఇంటి పేరు *పరవస్తు* గా నిలిచిపోయినది.
ధర్మార్ధ కామ మోక్ష సాధనకై , భాష నీతి కౌశలాదులు విద్యార్థులకు అబ్బుటకై , *నీతి చంద్రిక* ను రచించి "అర్బత్ నాట్" దొర గారికి అంకిత మిచ్చారు. *పద్యానికి నన్నయ , గద్యానికి చిన్నయ* అను నానుడి ప్రజల నోట నిలిచి పోయింది . వీరి హిందూ ధర్మ శాస్త్ర సంగ్రహం లండన్ గ్రంధాలయం నందు మాత్రమే లభించును . వీరి రచనలందు *బాల వ్యాకరణం* మకుటాయ మాయం.
చాత్తాద శ్రీ వైష్ణవ జాతికి గౌరవాదరములు కల్పించిన *శ్రీమాన్ పరవస్తు చిన్నయ్య సూరి* గారు చిరస్మరణీయులు .

No comments:
Post a Comment