Saturday, February 22, 2025

కాలానికి అందని జీవాక్షరాలు

అంశం: కలానికి అందని జీవాక్షరాలు

శీర్షిక: *కలానికి అందని జీవాక్షరాలు ఎన్నో ఎన్నెన్నో*

*రవి కాంచని చోటును కవి గాంచు* అంటారు

కానీ అవి ఉత్తుత్తి మాటలే
అనుభవం లేనట్టి మాటలు
కలానికి అందని జీవాక్షరాలు
ఈ జగతిన ఎన్నో మరెన్నో!

భయం తోనో బెదిరింపు తోనో
చట్టాల నియంత్రణ తోనో
సౌఖ్యం కోసం లౌక్యం తోనో
కాలానికి అందకుడా పోతున్న
జీవాక్షరాలు ఎన్నో మరెన్నో!

దక్షణభారతంలో పన్నులు గుంజుతారు
ఉత్తర భారతంలో కుమ్మరిస్తారు
పెద్దలకు *వేల కోట్ల* అప్పులు మాఫీ చేస్తరు
పేదల *వేల*  అప్పులకు పీక్కుతింటరు!

చట్టాల లొసుగులు పెద్దలను
తప్పించ ముసుగులవుతాయి
చట్టాల ముసుగులు పేదలను
ఇరికించ విసుగులవుతాయి!

నాయకులు హామీలిస్తారు
ఇచ్చిన హామీలను ప్రశ్నించ లేకపోవడం
తెచ్చిన అప్పులను ప్రశ్నించ లేకపోవడం
కలానికి అందని జీవాక్షరాలు!

కుటుంబ నియంత్రణ
కొన్ని వర్గాలకే పరిమితం
మరికొన్ని వర్గాలకు
కుటుంబ నియంత్రణ ఉండదు

ఇండియన్ పీనల్ కోడ్
భారతీయులందరికీ సమానంగా
ఉండాలని ప్రశ్నించ లేకపోవడం
కలానికి అందని జీవాక్షరాలు!

కొన్ని వర్గాల తీర్థ యాత్రలకు
డబ్బు చెల్లిస్తుంది
మరికొన్ని వర్గాల తీర్థ యాత్రలకు
డబ్బు చెల్లించదు
కలానికి అందని జీవాక్షరాలు!

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
రిజర్వేషన్లు పది సంవత్సరాలని చెబితే
రాజ్యాంగం ఏర్పడి ఏడు దశాబ్దాలు గడిచినా
ధనికులైన కొన్ని వర్గాలకు ఇంకనూ రిజర్వేషన్లు
పేదలైన కొందరికి రిజర్వేషన్లు ఉండవు
ఇప్పటికీ అవి కలానికి అందని జీవాక్షరాలే!
ఇలా ఎన్నో ఎన్నెన్నో

       

No comments: