Friday, February 28, 2025

మోసం శ్వాస లాంటిది

అంశం: చిత్ర కవిత


శీర్శిక: *మోసం శ్వాస లాంటిది*

మోసం శ్వాస లాంటిది
శ్వాస ఉన్నంత కాలం మోసం ఉంటుంది
ఇదేదో నిన్ననే పుట్టిందనుకుంటే
పప్పులో కాలేసినట్టే!

కృత యుగంలో
మోసాలు ఒక పాదం ఉంటే
త్రేతాయుగంలో రెండు పాదాలు
ద్వాపరయుగంలో మూడు పాదాలు
నేటి కలియుగంలో మోసాలు
నాలుగు పాదాలు నడుస్తున్నాయి!

మునిగే వాండ్లున్నంత కాలం
ముంచే వాండ్లు ఉంటారు
మోసపోయే వాళ్ళున్నంత కాలం
మోసం చేసే వారు ఉంటారు
ఆశలు కోరికలు పెంచుకునేవారున్నంత కాలం
స్కాములు చేసేవారు పెరుగుతూనే ఉంటారు!

ఎవరో కొందరు ఒక వర్గానికి చెందిన వారే
మోసగాళ్ళు అనుకోవడం పొరపాటు
అడుగడుగునా ఉంటారు అవకాశవాదులు
గుంట నక్కలా ఎదురు చూస్తుంటారు!

ఓటుకు నోటంటూ , ఉచితాలని హామీలిస్తూ
భూకబ్జాలు చేసే రాజకీయ నాయకులు
ఉచిత ఆరోగ్య సేవలంటూ
కిడ్నీ లివర్లు మాయం చేసే హాస్పిటల్స్
ఉచిత అంగవైకల్య పరికరాలంటూ
కాళ్ళనే ఎత్తుకెళ్ళే చండాలులు
ఉచిత లోన్ అంటూ, ఉచిత గేమ్స్ అంటూ
రమ్మీ అంటూ, బిట్ కాయిన్స్ అంటూ
బ్యాంకు అకౌంట్లను ఖాలీ చేసేవారెందరో
ఎవరికి వారే జాగ్రత్తలు పాటిస్తూ
స్థిత ప్రజ్ఞతతో జీవించడం అలవర్చుకోవాలి
కోరికలు అత్యాశలు తగ్గించుకోవాలి
బావి తరాలకు ఆదర్శంగా నిలువాలి!

No comments: