Wednesday, February 19, 2025

ప్రేమికుల రోజు

అంశం: ప్రేమికుల రోజు


శీర్షిక: *ప్రేమ గుడ్డిది*

*ప్రేమ* అనేది రెండక్షరాల పదం
*ప్రేమ* అర్ధం అనంత పదాల సమూహం

ప్రేమకు లేదు కులం
ప్రేమకు లేదు మతం
ప్రేమకు లేదు ప్రాంతం
ప్రేమకు లేదు భాష
ప్రేమకు లేదు వయసు
ప్రేమకు తెలియదు పేద ధనిక
ప్రేమకు తెలియదు అందం సందం

ఒక్క మాటలో చెప్పాలంటే
ప్రేమకు రంగు రుచి వాసన లేదు
ప్రేమ గుడ్డిది !

ఊహించని క్షణాలలో
అనుకోని పరిస్థితులలో
అనుకోని బలహీనతలలో
ప్రేమ దోమ మొదలవుతుంది
అది మోహమా కామమా తెలియదు!

ప్రేమికుల రోజు పార్కుల్లో కనబడగానే
మరికొందరు తాళి బొట్లను పట్టుకుని
రెడీగా ఉంటారు పెండ్లి చేసుకోవాలని
అప్పుడు తెలుస్తుంది నిజమైన స్వరూపం!

చట్టాలు స్వేచ్ఛ ఇచ్చాయని
వేరొకరికి లొంగిపోయినపుడు
చెట్టాపట్టాలేసుకుని తిరిగేటప్పుడు
తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు
మీరు ఈ స్థితికి రావడానికి పడిన కష్టాలు
గుర్తుకు తెచ్చుకోవాలి!

పాశ్చాత్య కల్చర్ తో పెళ్ళిళ్ళు చేసుకుంటే
మోజు తీరాక సమస్యలు ఎదురైతే
ఆదుకునే దిక్కు లేక అవనిలో
కలిసిన వారు ఎందరో

చదువుకునే వయసులో
సమయం వృధా చేయకుండా
పార్కుల వెంట తిరుగకుండా
ఒకరినొకరు అర్థం చేసుకునే వయసు వచ్చాక
తల్లిదండ్రుల ఒప్పించి మెప్పించి
వివాహ మాడటం ఉభయులకూ శ్రేయస్కరం
సమాజానికి శ్రేయస్కరం
రేపటి తరానికి ఆదర్శం!

No comments: