అంశం: పదాల కవిత
శీర్షిక: *స్వర్గ ధామం*
మనసులు కలిసిన రోజున
రెండు నిండు హృదయాలు
విరిసిన సిరి మల్లెలులా
గుభాలించు పరిమళాలు!
గలగల జారే జలపాతంలా
మమతల జడీవాన కురియ
కలయో నిజమో నన్నట్లు
ఊహల పల్లకిలో తేలియాడు!
మనసులోని మధుర భావాలు
పంచుకునను సరిపోతుందా
నిండు జీవితమైనను ననియు
ఆశ్చర్యం కలుగక మానదు!
నలుగురికి మేలు చేకూరుస్తూ
ఆనందంగా కాలం గడుపుతూ
మానవత్వ విలువలు పెంచుకుంటే
ఆ జీవితమే స్వర్గ ధామం!
పండిన పసిడి హృదయాలకు
మెండుగ మమతలు తోడైతే
అండగ నిండుగ జీవిత కాలాన
దండిగ కురియు మానవత్వ కుసుమాలు!
No comments:
Post a Comment