అంశం: మేఘాన్నై కురుస్తూనే ఉన్నా
శీర్షిక: *నీ రాక కోసం*
నా మది నిండా యెద నిండా
పదిలంగా దాచుకుని సుందర వదనంతో
ప్రకృతిలో నిను ఆస్వాదిస్తూ , నీ రాక కోసం
మధుర మేఘాన్నై అమృతాన్ని కురుస్తూనే ఉన్నా!
కలవర పడకుండా కలత చెందకుండా
కనకాంబరాలతో దారులు వేస్తూ
సుగంధ మకరందాలు వెదజల్లుతూ
ఆకాశ మేఘాన్నై పరిమళాలు కురుస్తూనే ఉన్నా!
నీ అంద చందాలను వర్ణిస్తూ
నిదుర కూడా పోకుండా నిన్నే తలుస్తూ
కలలోనూ కమ్మని నీ పాటలు వింటూ
నీలి మేఘాన్నై జుంటి తేనెను కురుస్తూనే ఉన్నా!
రతీదేవి కోసం నవ మన్మధుడిలా
జాబిలి కొరకు చకోర పక్షిలా
వసంతం కోసం కోకిలలా మధురానుభూతితో
చెదరని మేఘాన్నై ప్రేమను కురుస్తూనే ఉంటా!
No comments:
Post a Comment