అంశం: ఉపమాలంకారాలు
శీర్షిక: *శ్రీ కృష్ణ దేవరాయలు వైశిష్ట్యం*జయహో! శ్రీ కృష్ణ దేవరాయా! వ్యాపించే నీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం!
ఇరువై సంవత్సరాల అతి పిన్న వయసులోనే
రాయలవారు, విజయనగర *సింహాసనాన్ని* అధిష్టించాడనటం అతిశయోక్తి కాదు!
విజయనగర సామ్రాజ్యంలో రాయల కాలంలో
అంగట్లో , రత్నాలు రాశులు పోసి అమ్మేవారట!
కళా పోషకుడు కవి పండితుడు ఆంధ్రభోజుడు!
శ్రీకృష్ణ దేవరాయలు రచించిన తెలుగు గ్రంధాలలో అతి ప్రాచుర్యం పొందిన పద్య కావ్యం *ఆముక్తమాల్యద*!
ఆంధ్ర సంస్కృతి గొప్పదనాన్ని చంపక మాలలో ముప్పది పాదాలలో రచించిన,
అల్లసాని పెద్దన కు , *గండ పెండేరం* తొడిగిన
మాన్యుడు!
రాయల ఆస్థానమైన *భువన విజయం* లో
అష్ట దిగ్గజ కవులను పెంచి పోషించారు!
అల్లసాని పెద్దన రచించిన *మనుచరిత్ర*
ప్రధమ ప్రబంధంగా ప్రసిద్ది కెక్కినది.
కవి నంది తిమ్మన ప్రధాన మంత్రి రాయలకు!
కవి తెనాలి రామకృష్ణుడు గొప్ప హాస్యకవి!
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల
యశస్సు, వైశిష్ట్యం , పాలన నాటికి నేటికి ఆచంద్రతారార్కం!
No comments:
Post a Comment