Sunday, February 16, 2025

చెప్పుడు మాటలు

అంశం: చిత్ర కవిత


శీర్శిక: *చెప్పుడు మాటలు*

*పెదవి దాటితే పెన్న దాటినట్లు*
అంటారు పెద్దలు

గోడలకు చెవులు ఉంటాయంటారు
ముక్కు నోరు, కళ్ళు ఉంటాయంటారు
మంచినే బయటకు మాట్లాడాలి
చెడును మనసులోనే దాచుకోవాలి
లేదంటే అది నదినే కాదు, సముద్రమే దాటి
ప్రపంచమంతా చేరి, అనుమానం పెనుభూతంగా మారి నరకాన్ని చూపిస్తాయి!

చెప్పుడు మాటలు. వినడం వలన
ప్రభుత్వాలే కూలి పోయాయి

ఎవరు వినకుండా చేతిని అడ్డం పెట్టుకొని
చెవిలో గుసగుసలుగా చెప్పే మాటలు
ఇవి ఏవో కలియుగంలోనే ఉన్నాయని
నేటి సమాజాన్ని తప్పుబట్టనవసరం లేదు!

యుగయుగాల నుండి, కృతయుగం,
త్రేతాయుగం ద్వాపరయుగంలో
కూడా చాడీలు ఉన్నట్లు చెబుతున్నాయి
మహా భారతం, ఇతిహాసాలు, పురాణాలు !

వియ్యంకుడి చెప్పుడు మాటలు విని
మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించాడు
శ్రీకృష్ణ దేవరాయలు
టోపీలు కుట్టుకునే ఔరంగజేబు
చెప్పుడు మాటలు విని , అధికారం కోసం
తల్లిదండ్రులనే బంధించాడు

ఎదుటి వారి బలహీనతలు
కొందరికి ఆయుధాలవుతాయి
*చెప్పుడు మాటలు* కొందరికి
వెన్నతో పెట్టిన విద్య
చేతిని అడ్డం పెట్టుకొని
వారి వద్ద లబ్ది పొందాలనో
గుర్తింపు పొందాలనో
అభిమానం సంపాదించాలనో
ఏవేవో మాటలు చెబుతూ
ఎదుటి వారి కుటుంబాలలో కావచ్చు
వ్యాపారాలలో కావచ్చు, ఉద్యోగాలో కావచ్చు
చిక్కులు పెడుతారు

ఇందుకు ఉదాహరణగా మందరను
శకునుని చెప్పుకోవచ్చు

ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకోవడం క్షేమం
లేదంటే ఎదుర్కొంటారు క్షామం
ఇతరుల విషయాలు మనవద్ద చెప్పిన వారు
సమయం వచ్చినప్పుడు మన విషయాలు కూడా
ఇతరుల వద్ద చెబుతారనేది నగ్న సత్యం

ఎవరైతే  *స్థితప్రజ్ఞత* కలిగి ఉండు
విచక్షణా జ్ఞానంతో ఆలోచించు

No comments: