అంశం: ఊపిరి ఆశల వేకువనై
శీర్షిక: *ఊపిరి బిగబట్టి ఆశతో!*
*చెప్పేటివి నీతులు చేసేటివి గోతులు*
కాకూడదని
వేచి చూస్తున్నా కొన ఊపిరి ఆశల వేకువనై!
జంక్ ఫుడ్స్ పీజా బర్గర్ల వలన
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసాక
బేకరీలకు లైసెన్సులు రద్దు చేస్తారని
ఎదురు చూస్తున్నా ఊపిరి బిగబట్టి ఆశతో!
కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ వలన
బిపి లు షుగర్లు పెరుగుతున్నాయని ఎరిగాక
వాటి అమ్మకాలను నిషేదిస్తారని
అంచనా వేస్తున్నా ఊపిరి బిగబట్టి ఆశతో!
సిగరెట్లు, గుట్కా పొగాకు వలన
లంగ్స్ చెడి క్యాన్సర్ వస్తుందని తెలిసాక
దానికి మందులు లేవని గమనించాకనైనా
వాటికి లైసెన్సులు ఇవ్వకుండా ఉంటారని
వేచి చూస్తున్నా ఊపిరి బిగబట్టి ఆశతో!
మధ్యం మత్తు పదార్థాల వలన
కడ్నీస్ లంగ్స్ ,ఫ్రాంకసిస్ దెబ్బ తింటాయని తెలిసాక
వాటి ఉత్పత్తులను నిలిపి వేస్తారని
ఎదిరి చూస్తున్నా ఊపిరి బిగబట్టి ఆశతో!
డిజిల్ పెట్రోల్ వలన కాలుష్యం
ప్లాస్టిక్ కవర్లు టీ కప్పుల వలన ఎలర్జీ
క్యాన్సర్ వస్తుందని ఎరిగాక నైనా
వాటికి ప్రత్యమ్నాయ చూస్తారని
వేచి చూస్తున్నా ఊపిరి బిగబట్టి ఆశతో!
No comments:
Post a Comment