Saturday, January 9, 2016

' టెండర్ ఓటు ' అనగా నేమి ?

ప్ర . ' టెండర్  ఓటు ' అనగా నేమి ?
జ. సాదారణంగా , ఎలెక్షన్లలో  ఎవరి ఓట్లను వారే  వేయాలి  . ఒక్కో  సారి  , ఓటు వేద్దామని  పోలింగుకు వెల్తే , అంతకు ముందే , వీరి  ఓట్లను  వేరే వారు  బోగస్  ఓట్లు  వేసి ఉంటారు .  ఓటు  ఇంతకు ముందే  వేశారు  అని పోలింగ్ ఆఫీసర్ , అసలు ఓటరును  నిలిపేస్తాడు  . అప్పుడు  కొందరు  గునుక్కుంటూ  ఇంటి దారి పడుతారు . మరికొందరు  ఓటర్లు  గట్టిగా వాదిస్తారు .  చట్టం  ప్రకారం  , ప్రజా స్వామ్యంలో  ఓటు  వేయడం  అనేది  ప్రతి ఓటరు  హక్కు . అలానే ప్రతి ఓటరు  బాధ్యత కూడాను .  అందుకని  మన ఓట్లను వేరే వారు వేసినా  నిరుత్సాహ  పడకుండా  ,  అధైర్య  పడకుండా  ఓటు హక్కును  వినియోగించు  కోవాలి .  ఇంతకు ముందే  వేయబడిన  ఓట్లను   , అసలు ఓటర్లు  వేయలేదని   నిరూపిస్తే  , అక్కడి పోలింగ్ ఆఫీసర్  , వీరికి ఓటు హక్కు  కల్పిస్తాడు . అందుకు ఒక   నిర్ణీత   ఫామ్  నింపి ఇస్తే  యదా విధిగా   ఓటు  వేయ  వచ్చు  .  ఇలా వేసిన  ఓటునే  ' టెండర్ ఓటు ' అంటారు .  ఒక పోలింగ్ బూతులో   0. 1%  కంటే ఎక్కువ  టెండర్  ఓటింగ్ జరిగినట్లవుతే , ఆ సమాచారాన్ని  ఎన్నికల కమీషన్ కు  పంపించాలి . ఇలా  టెండర్  ఓటింగ్ అధికంగా  ఉంటే   , ఎన్నికలను రద్దు  చేసి , తిరిగి ఎన్నికలను  జరిపించే    అధికారం   ఎన్నికల  అధికారికి  ఉంటుంది .  

No comments: