ప్ర . బస్సులలో చిల్లర సమస్యకు పరిష్కార మేమిటి ?
జ . చిల్లర డబ్బుల గురించి కండక్టర్ కు , ప్రయాణికులకు మద్య ప్రతి బస్సులో , ప్రతి రొజూ గొడవే . ఒక్కో సారి అది ఎంతకు దారి తీస్తుందంటే , బస్సుల నిలిపి వేసే వరకు , కొట్టుకునే వరకు , కత్తి పొట్ల వరకు వెలుతున్నది , దీని వలన అర్జంటుగా ఆఫీసులకు వెల్ల వలసిన ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది . కండక్టర్లు భయం భయం గా డ్యూటీ చేయాల్సి వస్తుంది . మరికొందరు ప్రయాణికులు , మా చిల్లర డబ్బులను కావాలని కండక్టర్లు ఇవ్వడం లేదని వాపోతున్నారు . ప్రయాణికులకు మతి మరుపు ఎక్కువ అని , గమ్యం చేరడమే ముఖ్యంగా భావిస్తారని , కొందరు కండక్టర్లు కూడా కావాలనే చేతి వాటాన్ని ప్రయోగిస్తున్నారు .
బస్సులలో అన్ని రకాల చిల్లర సమస్యలకు చక్కటి పరిష్కారం , అన్ని రకాల బస్సు టికట్లను రూ .లు . 5/- , 10/- , 15/- , 20/- , మరియు 25/- కి దగ్గరగా సరి చేయాలి . ఉదా : రూ . లు . 6/- , 7/- ఉన్న వాటిని రూ . లు 5/- గాను , రూ . లు . 8/- , 9/- ఉన్న వాటిని రూ . లు 10/- గాను , సరి చేయాలి . అలానే మిగిలిన వన్నీ సరి చేయాలి . దానికి తోడు , అవసరాన్ని బట్టి రూ . లు . 5/- టోకెన్లను , అన్ని బస్సులలో , మీ సేవలలో చెల్లే విధంగా అందుబాటులో ఉంచాలి . ప్రయాణికులు కూడా సహకరించాలి . అప్పుడే బస్సులలో చిల్లర సమస్యకు ఈ పరిష్కారం విజయ వంత మవుతుంది .
No comments:
Post a Comment