ప్రశ్న : కోతుల బెడదను తప్పించు కోవాలంటే ఏమి చేయాలి ?
జవాబు : గ్రామాలలో , రైల్వే స్టేషన్లలో , గుడుల వద్ద , పర్యాటక స్థలాల వద్ద , పంట చేల వద్ద కోతులు పెట్ట బాధలు అంతా ఇంతా కాదు . మనుష్యులను గాయ పరుస్తాయి , పంటలను నాశనం చేస్తాయి . ఒక్క మాటలో చెప్పాలంటే , మనిషి కంటికి నిద్దుర లేకుండా చేస్తాయి . కోతులు ఇలా ఊళ్ళ మీద పడ డానికి ముఖ్య కారణం , రోజు రోజుకు అడవులు అంత రించుక పోవడం . వాటికి ఆహారం దొరుకక , అవి గ్రామాల మీద , పంట చేలపై పడి ఆహారాన్ని సంపాదించు కుంటున్నాయి .
కోతుల బాధల నుండి తప్పించు కోవాలంటే , మరల వాటికి ఆహారాన్ని అందించ గలిగే అడవులను పెంచాలి . లేదా ' వాటికీ శత్రువైన ' కొండ ముచ్చులను ' తీసు కొచ్చి అప్పుడప్పుడు , గ్రామాలలో , పంట చేలలో తిప్పాలి . అప్పుడు కోతులు సుదూర అడవి ప్రాంతాలకు పరుగులు పెడుతాయి . లేదా ' కోతుల పార్క్ ' లను కట్టించి అందులో వాటిని విడిచి ఆహారాన్ని అందించాలి . దానిని పర్యాటక స్థలం గా మార్చాలి .
No comments:
Post a Comment