ప్ర . దొంగ తనాలు , మోసాలు , పాపాలు ఎందుకు చేస్తారు ?
జ . అందరూ అనుభవించాల్సిన సిరి సంపదలు , విలాసాలు , ఆనందాలు , సంతోషాలు , సుఖాలు , సమాజంలో ఆదర్శంగా , ఉన్నత స్థాయిలో ఉండే ఏ కొందరో అక్రమంగా నిరంతరాయంగా అనుభవిస్తుంటే , వాటిని మేమెందుకు పొంద కూడదనే తపనతో కొందరు , తమ తెలివిని , సత్తా చూపించుకునేందుకని మరికొందరు , నిజంగానే ఆకలికి , సుఖ సంతోషాలకు , ప్రేమకు నోచుకోలేక ఇంకొందరు దొంగ తనాలు , మోసాలు , పాపాలు చేస్తారు . ఉన్నత స్థానంలో ఉన్న వారిలో మార్పు రావాలి గాని , ఇక్కడ శాసనాలు , ఎవ్వరిని శాశ్వతంగా అదుపులో పెట్టలేక పోవచ్చు . పుండు ఒక చోట ఉంటే , మందు మరోచోట పెడుతే ఫలితం శూన్యం .
No comments:
Post a Comment