ప్ర . ' లోకజ్ఞ్యానం ' అంటే ఏమిటి ?
జ . ' లోకజ్ఞ్యానం ' అంటే లోకం తీరు తెలుసుకోవడం . లోకం పోకడ తెలుసుకోవడం . లోక గమనాన్ని తెలుసుకోవడం . మనకో నానుడి తెలుసు " నీరు పల్లమెరుగు , నిజం దేవుడెరుగు " అని . పల్ల మంటే వంపుగా ఉన్న భూమి . నీరు సులువుగా ప్రవహించాలంటే, అది భూమి పల్లం గురించి తెలుసు కోవాలి . అలానే నిజమేదో , అబద్ద మేదో సులువుగా తెలుసుకోవడం , కేవలం దేవుడికే సాధ్యం , అని దీని భావం .
అలానే మనిషి సులువుగా ఎదుగాలంటే , కష్టం ఒక్కటే సరి పోదు . సమాజం పోకడ , రాజకీయాలు , చట్టాలు , కాలం , తోటి మనుష్యులు ఎదుగు తున్న తీరు , కులాలు , మతాలు , ప్రాంతాలు , ప్రభుత్వమందించే సంక్షేమ పధకాల గురించి అర్ధం చేసుకోవాలి . మనిషి సాఫీగా జీవనం సాగించ డానికి , వీటన్నిటిని తెలుసుకోవడమే
' లోకజ్ఞ్యానం '.
No comments:
Post a Comment