ప్ర . ' జల్లి కట్టు ' ఆట అనగా నేమి ?
జ . ' జల్లి కట్టు ' ఆట అనగా ఎద్దు పందాల ఆట . ఈ ఆటలో ఎద్దులను శుభ్రం చేసి , పూజలు చేసి వరసగా పరుగులెత్తిస్తారు . ధైర్యమున్న మొగ వారు , మొనగాండ్లు వాటి కొమ్ములను పట్టుకుని అదిమి పట్టి వాటిని ఆప గల్గాలి . ఈ పందెం లో అనేక మందికి గాయాలు అవుతాయి . ఎద్దుల కొమ్ములు విరిగి పోతాయి . ఎవరైతే ఎద్దులను ఆపుతారో , వారే గెలుపు ధీరులు , వీరులు . ఈ ఆట మగ వారిలో పోటీ తత్వాన్ని , ధీరత్వాన్ని పెంచుతుందని , చిన్నా పెద్దల్లో , ఆడవారిలో ఉత్సాహాన్ని నింపుతుందని అక్కడి వారి అభిప్రాయం . ఈ ఆట ముఖ్యంగా తమిళనాడులో ఆడుతారు . అలానే ఆంద్ర ప్రదేశ్ లో చిత్తూర్ జిల్లాలో మాత్రమె ఆడు తారు . మూగ జీవుల సంరక్షణ సంస్థలు , కోర్టులో కేసు వేయడం వలన , 'సుప్రీం కోర్ట్ ' నిషేధం విధించింది .
No comments:
Post a Comment