ప్ర . చుట్టూ అన్నీ ( కూడు , గూడు , గుడ్డ మరియు కావలసినంత ధనం ) ఉన్నా , మనుష్యులు ఎందుకు బాధతో , దు:ఖం తో ఉంటారు ? ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటారు ?
జ . సాధారణంగా మనుష్యులు 3 రకాల భావనలతో , ఆలోచనలతో ( కోరికలతో ) ఉంటారు . అవి ఏమంటే , ఏ వస్తువైనా , జీవి అయినా , అది ' నాది ' , లేదా 'మనది ', లేదా 'అందరిది '. అని .
ఇక్కడ ,
01. ' నాది ' అంటే , నా ఇల్లు , నా బైకు , నా బిడ్డ , నా కొడుకు , నా భార్య లేదా నా భర్త అనే భందం లో , నా స్వంతం అనే భావనలో ఉంటారు . తమకు ఇష్టమైన వస్తువులపై , కుటుంభ సభ్యులపై అమితమైన ప్రేమతో ఉంటారు . నా వస్తువు లేదా నా వారు అనే స్వార్ధం ఉంటుంది . కుటుంభంలో తమను గుర్తించాలి , విలువను ఇవ్వాలి అని కోరుకుంటారు . తాము ఆ విధంగా భావించింది , తమకు కావాల్సింది , తాము కోరుకున్నది , తాము ఇష్ట పడినది , ఎప్పుడైతే తమకు కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి . మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు . మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది . దు:ఖం పొంగి పొర్లు తుంది . అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు . లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు . దీనికి చక్కటి ఉదాహరణ సినీ నటుడు రంగనాథ్ గారు . ఇక మరి కొందరు , అసహనం పెరిగి అసాంఘీక శక్తులుగా మార వచ్చు . దీనికి చక్కటి ఉదాహరణ విద్యా వంతుడు సాఫ్టవేర్ ఇంజినీర్ బల్బీర్ సింగ్ .
02. 'మనది ' అంటే , మన కుటుంభ సభ్యులది , మన స్నేహితులది , మన కాంప్లె క్ష్ వారిది లేదా మన కాలనీ వాసులది , లేదా మన ఉద్యోగులది , మన వర్గానికి సంభందించినది అనే భావన . ' నాది ' అనేది ఒక వ్యక్తికి సంభందించిన దైతే ' మనది ' అనేది ఒక సమూహానికి సంభందించినది . ఇక్కడ కూడా , ఎప్పుడైతే తాము అనుకున్నది జరుగ కుండా , కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి . మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు . మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది . దు:ఖం పొంగి పొర్లు తుంది . అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు . లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు . దీనికి చక్కటి ఉదాహరణ ఈ మద్యనే ఆత్మ హత్య చేసుకున్న వేముల రోహిత్ . ఇక మరి కొందరు , అసహనం పెరిగి అసాంఘీక శక్తులుగా మార వచ్చు .
03. ఇక మూడోది ' అందరిది ' . ' అందరిది ' అంటే అందరూ సమానంగా అనుభవించాల్సింది . ఇవి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు , సంపదలు , వసతులు , సంక్షేమ పధకాలు , విద్యా సంస్థలు , ఆరోగ్య సదు పాయాలు , రక్షణ మొదలైనవాటిని చెప్పుకోవచ్చు . ఇక్కడ కూడా , ఎప్పుడైతే తాము అనుకున్నది జరుగ కుండా , కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి . మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు . మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది . దు:ఖం పొంగి పొర్లు తుంది . అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు . లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు . ఇక మరి కొందరు , అసహనం పెరిగి అసాంఘీక శక్తులుగా మార వచ్చు . వీరు సాధారణంగా లీడర్లు , జాతీయ నాయకులై ఉంటారు . వీరికి చక్కటి ఉదాహరణ , మహాత్మా గాంధీ , మదర్ తెరిస్సా , గౌతమ బుద్దుడు , డా . అంభేద్కర్ , నెల్సన్ మండేలా , జయ ప్రకాష్ నారాయణ్ , వినోభా బావే , ఝాన్సీ లక్ష్మి భాయి , దుర్గా భాయి దేశ్ ముఖ్ , అల్లూరి సీతా రామా రాజు , అన్నా హజారే మొదలగు ఎందరినో చెప్పుకోవచ్చు .
No comments:
Post a Comment