ప్ర . ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి ?
జ. ప్రజా స్వామ్య దేశం లో , 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ' ఓటు హక్కు ' ఉంది . ప్రజా స్వామ్య దేశం లో , ' ఓటు ' అనేది ప్రజల చేతిలో 'వజ్రాయుధం' . సాధారణంగా , ఎన్నికలు ప్రతీ 5 సంవత్సరాల కొకసారి వస్తాయి. అవి జనరల్ ఎన్నికలు కావచ్చు , ఉప ఎన్నికలు కావచ్చు , కార్పోరేట్ ఎన్నికలు కావచ్చు . ఎన్నికయిన ప్రతి నాయకుడు , పాలక పక్షం లోనో , ప్రతి పక్షం లోనో ఉండి , మనల్ని 5 సంవత్సరాలు పాలిస్తారు లేదా శాశిస్తారు . మనకు స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు దాటినా , 30 శాతం ప్రజలు ఇంకనూ , బి . పి . ఎల్ . లైన్ క్రిందనే ఉన్నారు . 1951 లో 35 కోట్ల ఉన్న జనాభ నేడు 127 కోట్లకు దాటింది . అదే దామాషాలో పేద తనం పెరిగి పోతున్నది తప్పా వారి బ్రతుకులు మారడం లేదు . కాని అదే సమయంలో నాయకులు , ,అధికారులు పెద్ద పెద్ద వ్యాపారస్థులు కోట్లకు పడగ లెత్తుతున్నారు . దానికి ముఖ్య కారణం ప్రజల పేద తనం , నిరక్ష రాస్యత , నాయకుల డామినేషన్ , ప్రజల అభిమానం , డబ్బు , మద్యం ప్రాబల్యం , చట్టాలలో మినహాయింపులు , 'ఎన్నికల సంఘం' , పోటీ చేసే అభ్యర్దుల యెడల , వారు అందించే ధ్రువ పత్రాల పట్లా , పెట్టే ఖర్చు పట్ల చూసీ చూడ నట్లు వ్యవహరించడం మొదలైన వన్నీ , ఓటర్లలో అనాసక్తికి కారణాలుగా చెప్పు కోవచ్చు .
ఏది ఏమైనా , గత నాయకుల పాలన ను బేరీజు వేసుకుని ప్రజలు , సమర్ధులైన అభ్యర్దులకు మాత్రమే ఓటు వేయాలి . ఎన్నికలలో గెలిచి , అధికారం చేపట్టిన 90 రోజులలో , వారు ఎన్నికలలో వాగ్దానం చేసిన పనులు ప్రారంభించారా లేదా ? అధికారం చేపట్టిన ఒక సంవత్సర కాలంలో , అందులో కొన్నింటినైనా పూర్తి చేశారా లేదా ? అధికారం చేపట్టిన 2 సంవత్సరాలలో సగం వాగ్దానాలైనా పూర్తి చేశారా లేదా ? వాగ్దానం చేయనివి కూడా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారా , నిజాయితీగా , అవినీతి రహితంగా పాలిస్తున్నారా , ఎలాంటి కుల , మత , ప్రాంత గొడవలు సృష్టించ కుండా , ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ , ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటున్నారా అనే విషయాలను బేరీజు వేసుకుని మంచి అభ్యర్దులకు ఓటు వేయాలి . తప్పకుండా ఓటు హక్కు వినియోగించు కోవాలి . ఒకే ఒక్క ఓటుతో ఒక అవినీతి అభ్యర్ధి , కుంభ కోన అభ్యర్ధి , హంతక అభ్యర్ధి , కేవలం నటన అభిమానం గల సెలబ్రిటీ గెలువ వచ్చు . అలానే ఒకే ఒక్క ఓటుతో ఒక మేధావి అభ్యర్ధి , సమర్ధత గల అభ్యర్ధి , నిజాయితీ అభ్యర్ధి , సమాజానికి సేవ చేయాలనే , రాష్ట్రాన్ని , దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం గల అభ్యర్ధి ఓడి పోవచ్చు . అందుకని , అభిమానం తో , తాత్కాలిక డబ్బు , మద్యం , వస్తువుల ఎరలకు లొంగ కుండా , ఏ మాత్రం ఎవరకీ భయ పడ కుండా మీకు ఇష్టమైన , నమ్మకమైన మంచి అభ్యర్దులకు ఓటు వేయాలి ,
No comments:
Post a Comment