Friday, January 22, 2016

.' మ్యూచువల్ ఫండ్స్ ' (MUTUAL FUNDS) అంటే ఏమిటి ? ఎన్ . ఎ . వి (NAV) అంటే ఏమిటి ?

ప్ర .' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS)  అంటే  ఏమిటి ?  ఎన్ . ఎ . వి  (NAV)  అంటే ఏమిటి ?

జ . ' మ్యూచువల్ ఫండ్స్ ' అనేవి  పొదుపు , పెట్టుబడి  సాధనాలు . ' మ్యూచువల్ ఫండ్స్ ' ను  పెద్ద  పెద్ద  మరియు  పరిశోధనాత్మక , విజ్ఞ్యానం  గల , వృత్తి  పరమైన  సంస్థలు నిర్వహిస్తాయి . ఈ  ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో  అన్ని రకాల పొదుపుదారులు  , ట్రస్టులు ,  కంపనీలు  రూ . లు . 500/- నుండి  కోట్ల  రూపాయల వరకు  పొదుపు లేదా  పెట్టుబడి పెట్టుకోవచ్చు . క్రొత్తగా  ' మ్యూచువల్ ఫండ్స్ ' స్కీం  స్టార్ట్  చేసి  నప్పుడు ,   ప్రతి యూనిట్ ను  రూ .లు . 10/- గా   లెక్కించి  యునిట్స్ ను అలాట్ చేస్తారు .  ఉదా: కరణ్ అనే వ్యక్తి   రూ .లు . 10,000/-.  లను  ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో  పెట్టుబడి పెట్టాడనుకుందాం .  అప్పుడు అతనికి  1,000 యూనిట్స్ ( 10,000/10)  అలాట్ చేస్తారు . కొంత కాలం తరువాత  అవే యూనిట్స్  ను కొనాలంటే , మార్కెట్  ఎన్ . ఎ . వి  (NAV) ప్రకారం  కొనాల్సి వస్తుంది .   ఎన్ . ఎ . వి  (NAV)  అంటే  నెట్  అసెట్ వ్యాల్యు .  ఈ  ఎన్ . ఎ . వి  (NAV)   ను  ఎలా  లెక్కిస్తారో  చూద్దాం .    పెట్టుబడిగా  వచ్చిన  కోట్ల  రూపాయలను  అభివృద్ధి చెందుతాయనుకున్న  మంచి  కంపనీల  షేర్లల్లో , సెక్యూరిటీలలో  ,  ఈ  ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు  పెట్టుబడులు  పెట్టాక , రోజులు గడుస్తున్న కొద్దీ  , మొత్తం  పెట్టుబడుల  మార్కెట్ వ్యాల్యు  పెర్గడమో , తగ్గడమో  జరుగుతుంది .  ఆ  మొత్తం మార్కెట్  వ్యాల్యు  నుండి  వారి  జీత బత్తాలు , అన్ని రకాల ఖర్చులు  తగ్గించాక  వచ్చిన  నికర  మొత్తం మార్కెట్  వ్యాల్యును , మొత్తం  యూనిట్స్ తో  డివైడ్  చేస్తారు . అలా భాగిస్తే  వచ్చేదే  ఎన్ . ఎ . వి  (NAV) . దీర్ఘ కాలంలో  ఈ  ఎన్ . ఎ . వి  (NAV)  పెరుగుతుందే  కాని తగ్గదు . దీర్ఘ కాలంలో  బ్యాంకులు  8% నుండి 9% వరకు  ఆదాయం లభిస్తే ,  మంచి  ' మ్యూచువల్ ఫండ్స్ '  లలో  13% నుండి14%  వరకు  ఆదాయం లభించవచ్చు .     ప్రస్తుతం  అనేక రకాల  ' మ్యూచువల్ ఫండ్స్ '  అందుబాటులో ఉన్నాయి .  . ఉదా : ఫ్రాంక్లిన్ , ఎచ్. డి . ఎఫ్ . సీ ., రిలయన్స్ , టాటా , కెనరా , సుందరం  ' మ్యూచువల్ ఫండ్స్ ' మొ . న వి  అనేకంగా  అందుబాటులో ఉన్నాయి .  మరియు వీటిలో వివిధ రకాలైన  ఫండ్స్ ఉన్నాయి . ఉదా : ఈక్విటీ ఫండ్స్ , డెట్  ఫండ్స్ , టాక్ష్  సేవింగ్ ఫండ్స్ , సెక్టార్ ఫండ్స్ , బ్యాలన్స్ ఫండ్స్ , డైవిర్సిఫైడ్  ఫండ్స్  మొ . నవి .  మరల వీటిలో  డివిడెండ్ పే అవుట్,  డివిడెండ్  రి ఇన్వెస్ట్  మెంట్  మరియు గ్రోత్  ఫండ్స్  అను రకాలు కలవు . 
 ఏది ఏమైనప్పటికీ  పెట్టుబడులు పెట్టేముందు  ఆర్ధిక  సలహాదారులను  సంప్రదించడం  ఉత్తమం .
ప్ర . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా  కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు  లేదా నష్టాలు  పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు .  డైరెక్టుగా  కొనేటప్పుడు  0.5% - 1%  కమీషన్స్  బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు  . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా  కొనుగోలు చేస్తే  0.5% - 1% , వీరికి  కమీషన్  మ్యూచ్యువల్  ఫండ్  సంస్థ  చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్  బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన  బ్రోకర్  సంస్థల ద్వారా  కొనడం వలన  అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి .  డైరెక్టుగా  కొనేటప్పుడు   సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) ,   ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది  డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే  పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు .  ఉదా : DSPBR TECHNOLOGIES FUND  కొన్నట్లయితే  ఈ రోజున  12.78% నష్టం వచ్చేది . అలానే  TATA DIGITAL INDIA FUND  కొన్నట్లయితే  ఈ రోజున  9.72% నష్టం వచ్చేది . అలానే  SBI PHARMA FUND కొన్నట్లయితే  ఈ రోజున  9.27 % నష్టం వచ్చేది . అలా  అనేక మైన  '' మ్యూచువల్  ఫండ్స్  '' స్కీమ్స్  నష్టాల లో  కూడా నడుస్తున్నాయి . 




No comments: