ప్ర . పెట్టు బడుల విషయం లో 100 సూత్రం వాడుతారు . ఈ 100 సూత్రం ఏమిటి ?
జ . ఒక మనిషి నిండా నూరేండ్లు జీవిస్తాడనుకుందాం . లేదా నూరు శాతం కావచ్చు . ఆ నూరేండ్లు అనగా 100. ఆ 100 సంఖ్య నుండి తన వయస్సును తీసి వేస్తే వచ్చే సంఖ్య కు సమాన శాతంలో పెట్టుబడులను , ఈక్విటిలో పెట్టాలని , ఈ సూత్ర ముఖ్య ఉద్దేశ్యం .
ఉదా : ఒక వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు అనుకుందాం . అప్పుడు అతను (100-60=40 ) 40% సొమ్మును ఈక్విటీ లలో పెట్టుబడులు పెట్టి మిగిలిన 60% సొమ్మును సాంప్ర దాయ పెట్టుబడులు, అనగా బ్యాంక్ ఫిక్షుడ్ డిపాజిట్ల లోను , ప్రభుత్వ సెక్యురిటీల లోను , పోస్టాఫీస్ లోని వివిధ పధకాల లోను పెట్టుబడులు పెట్టి నట్లవుతే , దీర్ఘ కాలంలో అధికంగా సంపాదించ గలడు మరియు ఏవైనా ఒడుదొడుకులు వచ్చినా ఆర్ధికంగా తట్టుకోగలడు అని ఈ సూత్ర ముఖ్య ఉద్దేశ్యం .
ఉదా : ఒక వ్యక్తి వయస్సు 40 సంవత్సరాలు అనుకుందాం . అప్పుడు అతను (100-40=60 ) 60% సొమ్మును ఈక్విటీ లలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి మిగిలిన 40% సొమ్మును సాంప్ర దాయ పెట్టుబడులు, అనగా బ్యాంక్ ఫిక్షుడ్ డిపాజిట్ల లోను , ప్రభుత్వ సెక్యురిటీల లోను , పోస్టాఫీస్ లోని వివిధ పధకాల లోను పెట్టుబడులు పెట్టి నట్లవుతే , దీర్ఘ కాలంలో అధికంగా సంపాదించ గలడు మరియు ఏవైనా ఒడుదొడుకులు వచ్చినా ఆర్ధికంగా తట్టుకోగలడు అని ఈ సూత్ర ముఖ్య ఉద్దేశ్యం .
No comments:
Post a Comment