Sunday, January 10, 2016

సక్రమ సంపాధనకు , అక్రమ సంపాదనకు తేడా ఏమిటి ? వాటి పరిణామాలు ఏమిటి ?

ప్ర . సక్రమ  సంపాధనకు  , అక్రమ సంపాదనకు తేడా ఏమిటి ?  వాటి పరిణామాలు ఏమిటి ?

జ .  సక్రమ సంపాదన అనగా , కష్ట పడి , నిజాయితీగా  సంపాదించి పొదుపు  చేసుకునేది . నీతి వంతంగా  వ్యాపారాలు చేసి సంపాదించినది  . చట్ట పరంగా  , వివిధ కారణాల వలన  ప్రభుత్వ సహాయం , ప్రభుత్వ  ఉద్యోగాలు పొంది  సంపాదించినది.  చట్ట బద్దంగా , నిజాయితీగా , వార సత్వంగా   సంక్రమించే  సంపదలన్నీ , ఆస్తులన్నీ సక్రమ సంపద గానే  భావించాలి . 
అక్రమ సంపాదన  అనగా ,  కష్ట పడి  నిజాయితీగా  సంపాదించ కుండా , దోచు కోవడం , మోసం చేసి సంపాదించడం , అక్రమ దారిలో  లంచాలు  కట్టి  , దొంగ  ధ్రువ పత్రాలు  పెట్టి   ప్రభుత్వ ఉద్యోగాలు  పొందడం , అక్రమ వ్యాపారాలు  చేసి , మోసాలతో  కోట్లకు పడగ లెత్తడం , రాజకీయ కార్య కర్తలుగా , రాజకీయ నాయకులుగా  , మంత్రులుగా  ఎదిగి వేలాది కోట్ల   ప్రజల సొమ్ము , ప్రభుత్వ ఆస్తులను  వెనుకేసుకోవడం , నాయకుల అండతో  , చట్టాలలోని  లోసుగులతో , మరికొంత మంది అధికారులు , కోట్లాది సొమ్మును సంపాదించడం  మొదలైనవాటిని  అక్రమ సంపాదన  అంటారు ,  వీరు  సంపాదించిన  సొమ్మును  , ఆస్తులను  బినామీ  పేర్లపై  ఆస్తులు  కొనడం , బ్యాంక్  లాకర్లలో  దాయడం  , ఎఫ్ .డి . ఐ , రూపాలలో  పెట్టుబడులు  పెట్టడం , విదేశీ బ్యాంకులలో  దాయడం  , షేర్లల్లో  , మ్యూచువల్ ఫండ్లల్లో  పొదుపు  చేయడం  , ఇన్స్యూరెన్స్  పాలసీలలో  పొదుపు చేయడం ,  లగ్జరీగా  జీవించడం , పిల్లలను  భారీ ఖర్చుతో  విదేశాలలో చదివించడం  చేస్తుంటారు . 
 సక్రమ  సంపాధన  , అక్రమ సంపాదన .  వాటి పరిణామాలు:
-----------------------------------------------------------------
పుట్టే డపుడు  ఎవరూ  ఏమి  తీసుకుని రారు . అలానే , ఆ తరువాత  కాలంలో  ఎవరు ఏ  రూపాన సంపాదించినా , ఏ  వారసత్వ రూపంలో  వచ్చినా  , పోయే టప్పుడు , నడుముకు  కట్టుకున్న మొల్దారం  కూడా తీసుక పోరు . 
సక్రమ సంపాదన వలన  సుఖముండక పోవచ్చు  గాని  ఎంతో తృప్తి ఉంటుంది . కొందరు పేద తనం లో  జీవించ వచ్చు గాని  ఎంతో ఆనందం  ఉంటుంది . ఎంతో మనఃశ్సాంతి  ఉంటుంది .  మరెంతో సంతోష ముంటుంది . ఎలాంటి భయ ముండదు . సమాజంలో  శాశ్విత  గౌరవ ముంటుంది . వారు చేసే  సేవలను బట్టి , మంచి పనులను బట్టి  గుర్తింపు  దక్కుతుంది  . నిండా నూరేళ్ళు ( అనుకోని సంఘటనల వలన తప్పా ) హాయిగా  జీవించ వచ్చు . 

అక్రమ సంపాదన  వలన , సుఖముండ వచ్చు  గాని  , తృప్తి  ఉండదు .  హాయి ఉండ వచ్చు గాని  , ఆనందముండదు . తాత్కాలికంగా  సంఘంలో  పేరు ప్రతిష్టలు  పెరుగ  వచ్చు  గాని , సంతోష ముండదు . ధనికంగా  బ్రతుక వచ్చు గాని , అడుగడుగునా  భయమే  నీడలా వెంటాడుతుంది .  మినరల్ వాటర్ తో స్నానం చేయ వచ్చు  ,  బెంజ్  కార్లల్లో   తిరుగ వచ్చు , కోట్లాది  రూపాయలను  , ఆస్తులను  కూడ బెట్ట వచ్చు . కాని  ఏదో ఒక రోజు  చిప్ప కూడు తిన వలసి రావచ్చు .  అంటే  జైల్లోకి  వెల్ల వలసి  రావచ్చు .  కన్న బిడ్డలు , భార్యా  పిల్లలు  , కష్ట కాలాలలో  తోడు నిలువక పోవచ్చు . అక్రమంగా  కూడా బెట్టిన  ఆస్తులకోసం , కన్న బిడ్డలు , భార్యా  పిల్లలు  తగవు లాడు కోవచ్చు , చంపు కోవచ్చు . ఇంత కాలం చుట్టూ  తిరిగిన , ఈగల్ల వాలిన బంధు మిత్రులు  దూరం కావచ్చు.  కోర్టుల చుట్టూ  తిరుగ వలసి  రావచ్చు . దాని కోసం మరల  జ్యోతిష్యుల కొరకు , వాస్తు  దోషాల కొరకు  లక్ష లాది రూపాయలు  ఖర్చు పెట్టాల్సి  రావచ్చు  . ఆ విధంగా   ఆస్తులన్నీ  తూడ్చి పెట్టుక పోవచ్చు . భార్యా పిల్లలు  రోడ్డు మీద  పడవచ్చు . పేరు ప్రతిష్టలు  మంటలో  కలువ వచ్చు .  అవార్డులు , రివార్డులు  గంగలో కలువ వచ్చు .  ఎదుటి వారు చూసే చూపులు , సూదుల్లా  గుచ్చుకోవచ్చు . చుట్టూ  పంచ పరమాన్నాలు  ఉంటాయి . కాని  నోట్లోకి  పోవు . ఒక వేల బల వంతంగా  తిన్నా , కడుపులో బెట్టం  పెట్టినట్లు ఉంటుంది .  జైళ్ళ  చుట్టూ తిరగ  వలసి  రావచ్చు , కోర్టుల చుట్టూ  తిరగ వలసి  రావచ్చు .   ప్రతి రోజూ  అవే  ఆలోచనలతో , మనస్సు పాడై  అనారోగ్యాల పాలు కావచ్చు . పక్ష వాతం  రావచ్చు . గుండె జబ్బులు  రావచ్చు . ఆకస్మికంగా  మరణించ  వచ్చు . 


   
  

No comments: