Monday, January 25, 2016

పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చడం వలన ఉపయోగమేమిటి ?


ప్ర . పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చడం వలన ఉపయోగమేమిటి ?
జ . భారత దేశంలో అత్యధిక నెట్ వర్క్ గల ప్రభుత్వ విభాగామేదంటే " పోస్ట్ ఆఫీసులు " (POST OFFICES) మాత్రమే అని ఘంటా పధంగా చెప్పవచ్చు . 31.03.2009 నాటికి దేశంలో 1,55,015 పోస్టాఫీసులున్నాయి . అందులో 1,39,144 పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పుతే , 15,871 మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నెల కోల్ప బడ్డాయి . 

ఇంత పెద్ద నెట్ వర్క్ గల పోస్టాఫీసులు , దేశంలోని పట్టణ ప్రాంతాల వారికి , గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం . ప్రజలకు చేరువలో ఉంటాయి . పోస్టాఫీసులంటే ప్రజలకు ఎంతో నమ్మకం . ఎన్నోరకాల సేవలందించే పోస్టాఫీసులంటే ప్రజలకు ప్రాణం . ఇంటివద్దకే వచ్చి పోస్ట్ కార్డ్స్ , పార్సిల్స్ మరియు డబ్బులు అందించే పోస్ట్ మ్యాన్ అంటే ఎంతో అభిమానం , గౌరవం. ఇంతటి అభి మానం చూరగొన్న పోస్టాఫీసులన్నింటిని పోస్టల్ బ్యాంక్స్ గా మార్చి నట్లవుతే  ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా  ఉండ గలవు . ప్రజలలో పొదుపరితనం పేరుగా గలదు . ప్రజలు ఇతర పొదుపు సాధనాల ద్వారా మోస పోవడానికి అవకాశ ముండదు . ఆర్ధిక నష్టం జరుగదు .  

నేడు పోస్టాఫీసులు మనకు అనేక రకాల సేవలను అందిస్తున్నాయి . అందులో ముఖ్యమైనవి ,

1. దేశ , విదేశ నలుమూలలకి ఉత్తరాలను , పార్సిల్స్ ను , గ్రీటింగ్స్ ను , రాఖీస్ ను చేర వేయడం .
2. డబ్బులను అందించడం .
3. పొదుపు ఖాతాలను ( సేవింగ్ , రికరింగ్ మరియు పి. పి. ఎఫ్. ఖాతాలను ) నడపడం .
4. యూనివర్సిటీల ఫీజులను కల్లెక్ట్ చేయడం .
5. ఎన్ ఎస్ సి  లాంటి టాక్ష్ సేవింగ్ సర్టి ఫికట్స్ ను ఇష్యూ చేయడం .
6. కార్డులు , కవర్లు తపాల బిల్లలు , పోష్టల్ ఆర్డర్లను , నాన్ జుడీష్యల్  స్టాంప్ పేపర్లను  అమ్మడం .
7. బంగారు బిళ్ళలు (Gold coins) అమ్మడం .
8. ఇన్సూరెన్స్ (Insurance) చేయడం .
9. ఫైనాన్సియల్ ప్రాడక్ట్స్ అమ్మడం  మొ . న  అనేక రకాల సేవలను పోస్టాఫీసులు అందిస్తున్నాయి .

ఇంత పెద్ద నెట్ వర్క్ గల, ఇంతటి భద్రత కల్పించే , ఎంతో నమ్మకాన్ని చూర గొన్న పోస్టాఫీసులలో కొన్ని లోపాలు కూడా లేక పోలేదు . అవి , ఉత్తరాలు , మనియార్డర్లు , రిజిస్టర్ పోస్టులు అందించడంలో ఎక్కువ సమయం తీసు కోవడం , పొదుపు పధకాల సేవలకు ఎక్కువ సమయం తీసుకోవడం , ఎక్కువ డబ్బు డ్రా చేయాలంటే ఒక రోజు ముందే చెప్పాలనడం , పాస్ బుక్ ఎంట్రీస్ కు చాలా రోజులు తిప్పడం , వర్కింగ్ అవర్స్ ప్రజలకు అనుకూలంగా లేక పోవడం , అడుగడుగునా ఏజెంట్ల బెడద ,  సిబ్బంది కొరత , ఇంకను పూర్తిగా అన్ని పోస్టాఫీసులు  కంప్యూటరైజేషన్  కాక పోవడం , తెలివైన మరియు చురుకైన సిబ్భంది లేక పోవడం మొదలైనవి .

చిన్న చిన్న లోపాలను ఆదిగ మించి , నేడు పోస్ట్ ఆఫీసులను పూర్తీ గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది . ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో రోజు వారి సంపాదన వారి చేతిల్లో ఉంటుంది . రేపటి ఎన్నో రకాల అవసరాల కోసం పొదుపు చేయా లనుకుంటారు . దాని మీద కొంత వడ్డీ రావాలని కోరు కుంటారు . అందు బాటులో ఏమీ ఉండవు .  కొందరికి నేటి బ్యాంకులంటే భయం . అందుకని వారు చిట్టీలను , లాటరీలను ,ఇనుస్యూరెన్స్ లను ,  స్కీములను , ఇతరులకు వడ్డీలకు ఇవ్వడం చేస్తుంటారు . కొంత కాలానికి  వీరి బలహీనతను ఆసరా చేసుకుని  కొందరు కేడీలు , మోసం చేయడం , వీరు లబోదిబో మనడం ప్రతినిత్యం సర్వ సాధారణం అయిపోయింది . ఆ తరువాత కొట్లాటలు , కోర్టులు . 

ఇలాంటి వన్నింటిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రభుత్వం పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చాలి. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న చిన్న బ్యాంకుల పరిధిలోకే వస్తాయి . అంతే కాకుండా అన్ని పోస్టాఫీసులను కంప్యుటీ కరించాలి . సేవలను మెరుగు పరుచాలి . తెలివైన మరియు చురుకైన సిబ్భందిని నియమించాలి . పని వేలల ను మార్చాలి. ఆదాయం పెంచడానికి మరిన్ని సేవలను పెంచాలి . మీ సేవలో జరిగే సేవలన్నిటిని మరియు ఫ్రాంకింగ్ సేవలను పోస్టాఫీసు పరిధిలోకి తీసుకుని రావచ్చు . ఏజెంట్ల బెడదను రద్దు చేయాలి . "ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " ( INDIAN POST BANK) ల గురించి మరియు క్రొత్త సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి . 

అంతే కాకుండా , ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ , ప్రైవేటు మరియు బ్యాంకుల లాగానే , "ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " ల లో ఇష్యూ చేసే చెక్కులు , డ్రాఫ్ట్ లు , అన్ని బ్యాంకులలో చెల్లు బాటు కావాలి . ఇతర బ్యాంకుల లో మాదిరే , ట్రాన్సాక్షన్స్ జరిపే ఏర్పాట్లు ఉండాలి . రుణ పరిమితికి లిమిట్ ఉండాలి . పెద్ద మొత్తాల్లో ఉండ కూడదు . రాజకీయాల జోక్యం ఉండ కూడదు.

తపాల కార్యాలయాలలో " స్టాంప్ పేపర్లు " ( Non judicial Stamp papers ) అమ్మాలనే యోచన చాలా గొప్ప నిర్ణయం . దీని వలన కొరత అనేది ఉండదు , అధిక ధరలకు కళ్ళెం వేయ వచ్చు . మరియు అడ్రస్సు సులువుగా దొరుకుతుంది . ఒక్కొక్క సేవకు , ఒక్కొక్క కాడికి పోనవసరం ఉండదు . ఆ కారణంగా సమయం , డబ్బు , శ్రమ ఆదా అవుతుంది .

No comments: