ప్ర . నికర ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేయాలా ?
జ . సామాన్య ప్రజానీకం ఎప్పటి నుండో కోరుకుంటున్న " సంవత్సర కాలంలో అన్ని రకాలుగా సంపాదించిన కుటుంభ మొత్తం నికర ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సిలెండర్ల సబ్సిడీని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం " సాహసో పేతం . ఒక్క గొప్ప ఆలోచన . ఇక నుండి ఎం .పి . లను , ఎం . ఎల్ . ఎ లను , పెద్ద వ్యాపారస్తులను , సినీ ఫీల్డ్ వారిని , పెద్ద పెద్ద క్రీడా కారులను , అధి కారులను , పెద్ద పెద్ద కళా కారులను , జ్యోతిష్యులను , అనేక మైన వృత్తుల వారిని , భూ స్వాములను గ్యాస్ సబ్సిడీని వదులు కోండని బుజ్జ గించ నవసరం లేదు .నికర ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేయాలి . ఇలానే అనేక మైన ఇతర సంక్షేమ పధకాలలో కూడా అమలు పరుస్తే , వేలాది కోట్ల ఆదాయం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదా కాగలదు . ఐతే దీనిని నల్ల ధనంగా మార్చ కుండా , వినియోగ వస్తువుల ధరలు , సేవల ధరలు తగ్గే విధంగా , పన్నులను తగ్గించడం , ఆరోగ్యానానికి , విద్య కు , సాంకేతికాభి వృద్ధికి ఉపయోగించే టట్లు శ్రద్ధ చూపాలి . అలానే ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేసే టప్పుడు , స్వచ్చందంగా వదులుకునే వారు '0' నొక్కండి అనే వాయిస్ రికార్డింగ్ ను ఎత్తి వేయాలి . దీని వలన , పేద వారు తెలిసీ తెలియక '0' నొక్కినా సబ్సిడీ క్యాన్సిల్ అవుతుంది .
కాని వీటిని ఎంత వరకు పార దర్శకంగా , నిస్వార్ధంగా అమలు పరుస్తారనేదే , మిలియన్ డాలర్ల ప్రశ్న .
No comments:
Post a Comment