ప్ర . నిరుద్యోగులకు ప్రభుత్వం, జీవన భ్రుతిని కల్పించ వచ్చా ?
జ . నిరుద్యోగులకు ఉచితంగా ప్రభుత్వం జీవన భ్రుతిని కల్పించ కూడదు . అలా చేస్తే , చదువుకున్న , చదువు కోని యువతీ యువకులను సోమరులుగా తయారు చేసి నట్లవుతుంది . దీనులను చేసి నట్లవుతుంది . ప్రభుత్వం ఉచితంగా జీవన భ్రుతి కల్పించడం వలన , ప్రతి సంవత్సరం ఈ ఖాతాలో జమయ్యే నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోతూనే ఉంటుంది . దీని వలన దేశంలో ఉత్పాదకత తగ్గుతుంది . జి . డి . పి. తగ్గుతుంది . అసంఘటిత వ్యవస్థ పెరిగి పోతుంది . అంతే కాకుండా ప్రభుత్వం పై భారం అధికంగా పడుతుంది . కొన్నాళ్ళకు వీరికి ఏ పని చేత కాకనో , ఇష్టం లేకనో , అవకాశాలు ఉండో , అసాంఘీక శక్తులుగా మారడానికి అవకాశమున్నది ,
ఉచిత జీవన భ్రుతిని కల్పించ డానికి బదులు , ఏదో ఒక పనిని కల్పించి , దానికి తగ్గ వేతనం చెల్లించడం వలన యువతీ , యువకులు గర్వంగా జీవించ డానికి అవకాశ ముంటుంది . అలా కాకున్నా ఏదైనా వృత్తి విద్యలో గాని , సాంకేతిక విద్యలో గాని , సాఫ్ట్ స్కిల్స్ లో గాని , నిర్మాణాత్మకమైన , నాణ్యమైన ట్రేనింగ్ నిస్తూ ' స్టైఫండ్ ' నిచ్చినా యువతీ , యువకులు గర్వంగా జీవించ డానికి అవకాశముంటుంది . అంతే కాకుండా , దేశం గర్వించ దగిన , యువతీ , యువకులు తయారవుతారు . దీని వలన దేశంలో ఉత్పాదకత పెరుగుతుంది . జి . డి . పి. పెరుగుతుంది . చేతి నిండా పని , గర్వంగా జీవించ గల నైపుణ్యం , అంతకు మించి , వారిపై వారికి గల విశ్వాసం పెరగడం వలన , యువతీ యువకులు అసాంఘీక శక్తులుగా మారడానికి అవకాశ ముండదు , ఇక ప్రభుత్వం పై ఎలాంటి భారం పడదు .
No comments:
Post a Comment