Monday, January 4, 2016

బేసి - సరి సంఖ్యా ట్రాఫిక్ విదానమంటే ఏమిటి ? దీని వలన ప్రయోజనాలు ఏమిటి ? దీనిని ఎవరు , ఎక్కడ ప్రవేశ పెట్టారు ?

ప్ర . బేసి - సరి  సంఖ్యా   ట్రాఫిక్  విదానమంటే  ఏమిటి ? దీని వలన  ప్రయోజనాలు ఏమిటి ? దీనిని  ఎవరు , ఎక్కడ ప్రవేశ పెట్టారు ?

జ . బేసి - సరి  సంఖ్యలు అనగా  మనకు  తెలుసు .  ఉదా : 1 బేసి సంఖ్య , 2 సరి సంఖ్య , 3 బేసి సంఖ్య , 4 సరి సంఖ్య .  ఇలా  0 వరకు  అన్న మాట . ప్రతి రోజు  డిజిల్ , పెట్రోల్ బస్సులు , లారీలు , కార్లు , ఆటోలు   మరియు  బైకులు  నడవడం  వలన ,  ట్రాఫిక్  అధికం  కావడం వలన , విపరీతమైన  కాలుష్యం  పెరుగుతున్నది . సర్వ రోగాలకు  కారణం  కాలుష్యం  , ప్లాస్టిక్  కవర్లు , ప్లాస్టిక్  పేపర్లు  మరియు ప్లాస్టిక్  టీ  కప్పులు .   కాలుష్యం  పెరగడం వలన , వాతావరణానికి  ,  జీవకోటికి  పెనుముప్పు వాటిల్లు  చున్నది . దీనిని  ప్రపంచ మంతా  ఒప్పుకుంటున్న  నగ్న  సత్యం .   అందుకని , పెనుముప్పుగా  వాటిల్ల  బోతున్న  కాలుష్యాన్ని  తగ్గించ డానికి , బేసి - సరి  సంఖ్యా   ట్రాఫిక్  విదానాన్ని   ప్రవేశ పెట్టారు .  దీని ప్రకారం  బేసి సంఖ్య అంటే  1 వ నెంబర్  చివరన గల   అన్ని  రకాల  వాహనాలను  రోడ్ల మీద  నడువడానికి  మొదటి  రోజు అనుమతిస్తారు . అలానే  సరి సంఖ్య  అంటే 2 వ నెంబరు  చివరన  గల  అన్ని రకాల వాహనాలను  రెండవరోజు  అనుమతిస్తారు . అంటే  ఒకరోజు  బేసి సంఖ్య  గల వాహనాలను , మరొక రోజు బేసి సంఖ్య  గల  వాహనాలను  అనుమతిస్తారు  . అయితే  దీనికి  రాష్ట్రపతి  , ప్రధాన మంత్రి , సుప్రీం  కోర్ట్ , హైకోర్ట్  చీఫ్  జస్టిస్  లాంటి  వి . ఐ . పి . లకు , ఆడవారికి  , వికలాంగులకు  మినహాయింపు  నిచ్చారు .  ఈ నిబందనలను  పాటించని  వారికి  భారీ  జురిమానాలను  విధిస్తారు . 

ఈ విదానం వలన   జీవ కోటికి , మానవులకు , వాత వరణానికి  ఎంతో  మేలు  జరుగుతుంది  . అనేకమైన  వ్యాదుల  నుండి  , ఉపద్రవాలనుండి  మానవులను  , వాతావరణాన్ని  రక్షించ వీలు  కాగలదు . అందుకని  దేశ ప్రజలందరూ  ఈ మంచి విదానాన్ని  సమర్ధించాలి . అలానే  ఇలాంటి  విదానాన్నే  ముంభాయి  , హైదరాబాద్ , విజయవాడ  లాంటి రద్దీ  గల పట్టణాలలో  కూడా  అమలు చేయాలి . ఏ  క్రొత్త  విదానమైన  మొదట కొన్ని రోజులు  కష్ట మవు  తుంది . కాని  అలవాటైన  తరువాత , దాని వలన  మేలు జరుగుతుందని  తెలుసుకున్న తరువాత  ప్రజలెవ్వరికీ  కష్టమనిపించదు , నష్టం లేదు . 

దీనిని  దేశ  రాజధాని  మరియు  అధికంగా  కాలుష్యం  వెద జల్లే    డెల్హీ  లో  ది . 01.04.2015 న   ముఖ్య మంత్రి     శ్రీ అరవింద్  కేజ్రివాల్  గారు  ప్రవేశ పెట్టారు . 

No comments: