Thursday, January 21, 2016

మనిషికి మనఃశ్శాంతి , మానసిక ప్రశాంతత కావాలంటే ఏమి చేయాలి ?

ప్ర . మనిషికి  మనఃశ్శాంతి  , మానసిక ప్రశాంతత  కావాలంటే  ఏమి చేయాలి ?

జ . "ఇంటి ఇంటికి  మట్టి పొయ్యే  అన్నట్లు"  సమస్యలు లేని   మనిషి  ఈ లోకంలో  లేడు . సమస్యలు లేని   జీవి   ఈ లోకంలో  లేదు . సమస్యలను  పాజిటివ్ గా  తీసుకుంటూ . జీవితాన్ని  ఆస్వాదించే వారే నిజమైన జ్ఞానులు .  'నిజ జీవితంలో  ప్రతి మనిషి  ఏదో  ఒక సమయంలో  లేదా అనేక  సమయాలలో , ఏదో ఒక కారణంగా  బాధలు , కష్టాలు , దు:ఖాలు , రందులు  ఎదుర్కునే  ఉంటాడు . ఏదో  ఒక సమయంలో   మనఃశ్శాంతి  , ప్రశాంతత గురించి తీవ్రంగా  తపించే ఉంటాడు . ఆలోచించే ఉంటాడు .  మనఃశ్శాంతి  , మానసిక ప్రశాంతత గురించి  డాక్టర్ల వద్దకు  పరుగెత్తే ఉంటాడు . ఏవో కొన్ని మందులు వాడే  ఉంటాడు . ఏమైతే నేమి ,  సమస్య మనస్సుకు సంభందించినది  కాబట్టి , అది అంత సులువుగా తగ్గదు . 
అయితే , మనఃశ్శాంతి  , మానసిక  ప్రశాంతత  కావాలంటే  ఏమి చేయాలి ?
-------------------------------------------------------------------
01. మనఃశ్శాంతి , మానసిక ప్రశాంతత లేక పోవడానికి  కారణాలు ఏమిటో  విశ్లేషించుకోవాలి . 
02. ఆ కారణాలకు అనుగుణంగా  మార్పులు చేసుకోవాలి . పరిస్థితులను  బట్టి , కాలాన్ని బట్టి  సర్దుకు పోవాలి .  
03. బాధ , రంది  అనేది మనసుకు  సంభందించినది కాబట్టి , '' మనకు ఏది శాస్వితం  కాదు అని , వచ్చేటప్పుడు  ఏమి తీసుకుని   రాలేదు , పోయే టప్పుడు  ఏమి  తీసుకుని పోము , అలాంటప్పుడు  నేనెందుకు  బాధ పడాలి  , రంది  పడాలి '' అని, "  జరిగినది , జరుగుతున్నది , జరుగబోయేది , అంతా  సృష్టి రహస్యమే , నేను  కేవలం నిమిత్త మాత్రుడిని " అని ,   ఒక పేపరు మీద వ్రాసుకుని  ప్రతి రోజు  ఉదయం  5 - 6  గంటల మద్యలో  , సాయంత్రం  9-10 గంటల మద్యలో  చదువుకోవాలి ,  ఆ విధంగా మనసుకు సర్ది చెప్పుకుంటూ  పోవాలి .  
04. సమస్య తీవ్రంగా ఉంటే , మనకు  ఇష్టమైన , నమ్మకమైన  బంధువులకు గాని , స్నేహితులకు గాని ,   దీని వలన  సగం భారం తగ్గి పోతుంది . అంతే కాదు . వారి నుండి సప్పోర్ట్  లభించ  వచ్చు . 
05. ప్రతి రోజు  ఉదయమే , వాకింగ్ కు  వెళ్ళాలి . యోగా చేయాలి . మెడిటేషన్  చేయాలి . 
06. మనసును  ఏదైనా  పని మీదికి గాని , ఏదైనా  ఇష్టమైన  వ్యాపకం మీదికి గాని ,  ఇష్టమైన  సంగీతం , కళల మీదికి గాని , ఆటల  మీదికి గాని  మల్లించాలి . 
06. ఆధ్యాత్మిక  దిశగా  కొంత సమయాన్ని  కెటాయించాలి .   
07. ఒక వేల  డబ్బు అధికంగా  ఉంటే , పేదవారికి  ఏదైనా విరాళ  మిచ్చి , వారి సంతోషంలో , ఆనందంలో  పాలు పంచుకుని , బాధను , రందిని  మరిచి పోవాలి . 
08. ఓక వేల  డబ్బు లేక పోతే , మాట సహాయం గాని , చేత సహాయం గాని  చేసి , వారి సంతోషంలో , ఆనందంలో  పాలు పంచుకుని , బాధను , రందిని  మరిచి పోవాలి . 
10. మరి కొన్నాళ్ళకు  మరో సమస్య  ఎదురౌతే , గత అనుభవాలను  గుర్తుకు తెచ్చుకుని , బాధను , రందిని  , మనసు దరికి  రాకుండా చూసుకోవాలి . 
11. ప్రతి రోజు  ఉదయం , సాయంత్రం  స్నానం  చేసి  , రాత్రి పడుకోబోయే ముందు  గ్లాసేడ్  పాలు తాగి  హాయిగా  నిద్ర పోవాలి . నిద్ర  సక్రమంగా  పోవడం వలన , అనేక మైన  శారీరక , మానసిక సమస్యలకు ఖచ్చితంగా  పరిష్కారం  లభిస్తుంది . 
12. అప్పటికీ  తగ్గ నట్లవుతే ,  ' సైకిలాజిస్ట్ ' వద్దకు గాని  లేదా ' సైక్రియాటిస్ట్ ' వద్దకు గాని  వెల్లి , కౌన్సిలింగ్  చేయించుకుని , మందులు వాడాలి .   

No comments: