ప్రశ్న : ' అభివృద్ది ' అంటే ఏమిటి ?
జవాబు : ' అభివృద్ది ' అంటే ఎదుగుదల . ఒక పాజిటివ్ మార్పు . దేశం అభి వృద్ది చెందింది అనడానకి ప్రత్యేకమైన కొల మానాలు ఏమి లేవు . స్కేల్లు లేవు . అయినా ఒక పాజిటివ్ మార్పు ద్వారా 'అభి వృద్ధి 'ని గుర్తించ వచ్చు . ప్రజలందరూ విద్యా వంతులవడం . (అంటే నిరక్ష రాష్యతను రూపు మాపడం) . అనారోగ్యాల బారిన పడకుండా , రోగ నిరోధక శక్తిని పెంచ గలగడం . దేశంలో మనకు కావాల్సింది , మనమే తయారు చేసుకో గల్గడం , ఇతర దేశాలకు ఎగుమతి చేయ గల్గడం . (దీనినే ' స్వయం సమృద్ది ' అంటారు) . ప్రజలకు చేతి నిండా పని కల్పించడం ( అంటే నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం ) , ప్రజలకు కడుపునిండా భోజనం కల్పించడం , ఉండ డానికి నీడ కల్పించడం , కట్టు కోడానికి దుస్తులు కల్పించడం , వారి మోఖాలలో సంతోషాన్ని , ఆనందాన్ని చూడటం , అలానే వారు సమస్యలతో ఏ కోర్టుల చుట్టూ తిరుగ కుండా , జైళ్ళల్లో మ్రగ్గ కుండా ఉండడాన్ని ' అభివృద్ది ' అనవచ్చు . ఇది సాధించాలంటే , ముఖ్యంగా ప్రజలను ఆరోగ్యంగా , ఆనందంగా , సంతోషంగా ఉంచ గలగాలి . నాణ్యమైన విద్యను అందించ గల్గాలి . అనారోగ్యాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి . ప్రజలలో నైతికతను పెంచాలి . మానవత్వాన్ని , సమానత్వాన్ని పెంచాలి . నాది , నీది అనే స్వార్ధ బీజం పడకుండా చూడాలి . ఐఖ్యతా భావాన్ని పెంచాలి . మన సంస్కృతి , సాంప్ర దాయాలను , కట్టు బాట్లను గౌర వించాలి . వ్యవసాయాన్ని అభి వృద్ధి చేయాలి . పరిశ్రమలను అభివృద్ధి చేయాలి . ఇన్ఫ్రాస్ట్క్షర్ ను అభివృద్ధి పరుచాలి . ప్రకృతి సంపదలను ( Natural resources ) ను సద్వినియోగం చేసు కోవాలి , మనవ వనరులను అభి వృద్ది పరుచాలి . పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి . శాస్త్ర , సాంకేతిక విద్యను అంది పుచ్చుకోవాలి . యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి . అలానే దానిని సద్వినియోగం చేసుకోవాలి . దేశంలో అవినీతి లేకుండా చేయాలి . ఆర్ధిక అంత రాలను తగ్గించాలి . దేశ విదేశాలలో ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీసి , బినామీ ఆస్తులను వెలికి తీసి ( ఇవ్వ వలసిన అవకాశాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ) దానిని ఏ మాత్రం ఆలోచించ కుండా జాతీయ సంపదగా గుర్తించాలి . ' అభివృద్ది ' అంటే దేశంలో సంపద అంతా కేవలం పది మంది చేతిలో ఉండటం కాదు . అందరి వద్ద సమంగా ఉండాలి . దేశంలో బిక్షాటన చేసే వారే ఉండ కూడదు . బి . పి . ఎల్ . ( B.P.L ) క్రింద జీరో పర్సెంట్ ఉండ డానికి ప్రయత్నించాలి . సక్రమంగా ఎన్నికలు జరుగాలి . నిస్వార్ధమైన తీర్పులుండాలి . శిక్షలు వారినుండి క్రింది వారికి రావాలి గాని , క్రింది వారి నుండి పైకి పోకూడదు . క్రింది వారిలో కేవలం ఇది తప్పు , ఇది నేరం , దీనికి ఈ శిక్ష ఉంటుంది , చట్టం ముందు అందరూ సమానులే అనే ఆవ గాహనను , భయాన్ని క్రియేట్ చేయాలి . డబ్బు తోటి ఏ పనినైనా సర్దు మనిగేటట్లు చేయ వచ్చు , అనే సందేశాన్ని ప్రజలలోకి పంపిస్తే , ప్రజలు అక్రమంగా డబ్బు సంపాదించ డానికి ఎగ బడుతారు . అంటే ప్రభుత్వమే , చట్టాలే అవినీతిని ప్రోత్సహించినట్లవుతుంది . సబ్సీడీలు , రుణ మాఫీలు మొదలైనవి కేవలం ఓటు బ్యాంకు సాధనాలు . ఎఫ్ . డి ఐ. లు , ట్రస్టులు అవినీతి కూపాలు .
జి . డి . పి . లు , ద్రవ్యోల్భానాలు , కరెంట్ అకౌంట్లు , విదేశీ నిల్వలు , లోటు బడ్జెట్లు , ఇతర సూచీలు , ఆకాశ మెత్తు బిల్డింగులు , రింగు రోడ్లు , ఫ్లై ఓవర్లు కట్టడం , యుద్ద సామాగ్రి సముపార్జించుకోవడం మొదలైనవి , ఎన్నడూ అభివృద్ధికి తార్కాణాలు కావు .
No comments:
Post a Comment