ప్ర . ద్రవ్యోల్భణం అనగా నేమి ? ద్రవ్యోల్భణం మదింపు సామాన్యులకు కూడా అర్ధం కావాలా ?
జ . ద్రవ్యోల్భణం అనగా క్లుప్తంగా చెప్పాలంటే వస్తువుల ధరలలో హెచ్చు తగ్గులు . వస్తువుల ధరలు పెరుగుతే ద్రవ్యోల్భణం పెరిగిందని , ధరలు తగ్గుతే ద్రవ్యోల్భణం తగ్గిందని ఒక సూచీ ద్వారా తెలియ జేస్తారు .
నేడు ద్రవ్యోల్భణం మదింపు విధానం చదువుకున్న వారికి కూడా అర్ధం కావడం లేదు . సాధారణంగా ద్రవ్యోల్భణం పెర్గింది అంటే , 'ధరలు పెరిగాయి' అని అర్ధం . అలానే ద్రవ్యోల్భణం తగ్గిందంటే ' ధరలు తగ్గాయి ' అని అర్ధం .
కాని అప్పుడప్పుడు ద్రవ్యోల్భణానికి సంభందించి ప్రకటించే అంకెలు , వాస్తవ ధరలను ప్రతి బింభించడం లేదు . ద్రవ్యోల్భణం రోజు రోజుకు తగ్గి నట్లు ప్రకటిస్తున్నారు . కాని ధరలు పెరుగుతూనే ఉన్నాయి .
ఉదా : 3 నెలల క్రితం రూ .లు 10/- నుండి 15/- కు కిలో లభించే ఉల్లి గడ్డలు నేడు , రూ .లు .50/- నుండి 70/- మధ్యన లభిస్తున్నాయి . రూ .లు 100/- నుండి 115/- కు కిలో లభించే కంది పప్పు నేడు , రూ .లు .150/- నుండి 160/- మధ్యన లభిస్తున్నది . రూ .లు 30/- నుండి 35/- కు కిలో లభించే బియ్యం నేడు , రూ .లు 40/- నుండి 50/- మధ్యన లభిస్తున్నాయి . ఇక కూర గాయాలు ఏవి కిలో రూ . లు 40/- కంటే తక్కువగా దొరకటం లేదు . డిజిల్ , పెట్రోల్ ధరలు రూ .లు . 1/- తగ్గుతే రూ.లు 2/- పెరుగుతున్నాయి . మెడిసిన్ల ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి .ఇలా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి . కాని తగ్గడం లేదు . అలాంటప్పుడు ద్రవ్యోల్భణం తగ్గి నట్లు గా ఎలా ప్రకటిస్తారు . ద్రవ్యోల్భణం మదింపుకు చిల్లర వర్తకుల ధరలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అవి సామాన్యులకు కూడా అర్ధం కావాలి . అలానే బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పరిస్థితులను బట్టి తగ్గించాలి కాని డిపాజిట్లపై వడ్డీ రేట్లు 8% కంటే తగ్గ కూడదు .
ద్రవ్యోల్భణం అంకెలను చూసి ప్రజలు పెద్దగ ఇబ్బంది పడరు . కాని ద్రవ్యోల్భణం అంకెల ఆధారంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన ఫైనాన్సియిల్ మార్కెట్లు అతలా కుతులం అవుతున్నాయి . ఉదా : షేర్ అర్కేట్ కావచ్చు . మనీ మార్కెట్ కావచ్చు . బ్యాంకింగ్ వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం కావచ్చు . ప్రభుత్వాలు తీసుకునే ఇతర విధాన పరమైన లేదా పాలనా పరమైన నిర్ణయాలు కావచ్చు . అప్పుడు ప్రజలు ఇబ్బందికి గురి అవుతుంటారు . అందుకని ఆర్. బి. ఐ. కి స్వయం ప్రతి పత్తిని కంటిన్యూ చేయాలి.
No comments:
Post a Comment