ప్ర . ' వాల్మీకి '   ఎవరు ?
జ . ' వాల్మీకి ' అంటే ఎవరో సాదారణంగా మనందరికి తెలుసు . వారు ఒక గొప్ప ఋషి . ' రామాయణం ' అనే ఇతి హాస్యాన్ని, మహా గ్రంధాన్ని సంస్కృతంలో రచించిన గొప్ప మహా నీయుడు .
కాని వాస్తవానికి పూర్వ కాలంలో అతను ఒక వేటగాడు . అంతే కాదు ఒక గజ దొంగ కూడాను. అప్పుడు అతని పేరు ' రత్నాకర ' . ఇతను ప్రతి రోజు అడవికి వేటకు వెల్లేవాడు . జంతువులను వేటాడి , వాటిని అమ్మి కుటుంభాన్ని పోషించే వాడు . అలానే జంతువులు దొరకని రోజు , దారి దోపిడీ చేసి కుటుంభాన్ని పోషించే వాడు .

అలా ఒక రోజు అడవిలో దారి దోపిడీ చేస్తుండగా , ఓ బాటసారి ఏమాత్రం ఎదురు తిరగలేదు . కాని ఒక మాట అంటాడు, నీవు నా దగ్గర దోచుకున్నావు సరే . అందుకు నాకు ఏ మాత్రం బాధ లేదు . కాని కొన్ని ప్రశ్నలు వేస్తాను . వాటికి సమాధానం చెప్పి ఈ సోమ్మునంతా తీసుకుని పో అని అంటాడు .
"సరే" అడగమంటాడు రత్నాకరుడు 
బాటసారి ఏమి అడిగి ఉంటాడో కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి.
గుర్తు కొచ్చాయా కళ్ళు తెరిచి సారి చూడండి.
బాట సారి : ఈ సొమ్మును ఎందుకు దోచావు ?
రత్నాకర : ఈ సొమ్ము నాకు నా కుటుంభాన్ని పోషించా డానికి .
బాట సారి : సరే బాగుంది . అంటే నీవు దోపిడీ చేసిన సొమ్మును అనుభవిస్తూ , నీ బార్యా పిల్లలు హాయిగా సంతోషంగా ఉంటున్నారు . అవునా ?
రత్నాకర : అవును .
బాట సారి : దారి దోపిడీ పాపం , నీచం కదా ?
రత్నాకర : అవును .
బాట సారి : అయితే నీ పాపంలో కూడా నీ బార్యా పిల్లలు సగ భాగం పంచుకుంటారేమో ఒక్క సారి అడిగి వచ్చి ఈ సొమ్మును తీసుకుని పో అని అంటాడు .
రత్నాకరుడు , "సరే" అని ఇంటి వెళ్తాడు . ఇంటికి వెళ్లి అలానే బార్యా పిల్లలను అడుగుతాడు . వారు , " నీవు చేసిన పాపాన్ని మీమెందుకు భరిస్తాం . భర్తవి కాబట్టి మమ్మల్ని పోషించే భాద్యత మీదే " అని అంటారు .
తిరిగి వచ్చి అదే విషయ్యాన్ని ఆ బాట సారికి చెబుతాడు . అప్పుడంటాడు ఆ బాట సారి. "చూసావా , నీ బార్యా పిల్లలు , నీ దోపిడీ సొమ్ము కావాలంటారు . కాని నీ పాపాలలో నీ కష్టాలలో ఎంత మాత్రం పాలు పంచుకో నంటారు . అలాంటప్పుడు, నీ బార్యా పిల్లలను పోషించేందుకు నీవెందుకు దోపిడీ చేయాలి ?".
అప్పుడు ' రత్నాకరుడు ' బాగా ఆలోచిస్తాడు . జీవితంపై విరక్తి చెందుతాడు . బార్యా పిల్లలను వదిలి పెట్టి , హిమాలయాల్లోకి వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చొని తీక్షణంగా తపస్సు చేస్తాడు . ఎండకు , వానకు ,
చలికి  ఎ మాత్రం  బెదర లేదు  అదర లేదు . ఆ విధంగా అతనిపై  పుట్ట పెర్గి  అతను కనబడ  కుండా పోతాడు . అప్పుడు  ఆకాశవాణి వచ్చి  తన కర్తవ్యాన్ని బోధిస్తాడు. దాని  ప్రభావమే  ' రామాయణ  ' ఆవిర్భావం .  ఆ పుట్ట కారణంగానే  అతనికి వాల్మీకి  అనే పేరు వచ్చింది . 
వాళ్మీకం అంటే పుట్ట. ఆ బాటసారే  'నారద  మహార్హి ' . 
పిల్లలూ! దీని వలన మనకు తెల్సిన నీతి ఏమంటే, ''పొరపాట్లు అందరూ చేస్తారు . ఆ తప్పులనుండి బయట పడి తొందరగా నిజాయితీగా మంచి పనులు చేస్తే మహా మనీషు లవు తారు అని "
పిల్లలూ! దీని వలన మనకు తెల్సిన నీతి ఏమంటే, ''పొరపాట్లు అందరూ చేస్తారు . ఆ తప్పులనుండి బయట పడి తొందరగా నిజాయితీగా మంచి పనులు చేస్తే మహా మనీషు లవు తారు అని "
మీరు ఏమంటారు ?
అవును తాతయ్యా!...
  
No comments:
Post a Comment