Friday, January 1, 2016

తెలంగాణా , ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వాలు , వృద్దులకు , వికలాంగులకు , వితంతువులకు ప్రతి నెలా చెల్లించే ' ఆసరా పథకం ' / పెన్షన్ వలన ఉపయోగాముందా ?

ప్ర .  తెలంగాణా  , ఆంధ్రా   రాష్ట్ర  ప్రభుత్వాలు , వృద్దులకు  , వికలాంగులకు  , వితంతువులకు   ప్రతి నెలా  చెల్లించే ' ఆసరా  పథకం ' / పెన్షన్  వలన  ఉపయోగాముందా ?

జ.  ఇది  ఒక మంచి  పధకం .  తెలంగాణా  , ఆంధ్రా  రాష్ట్ర  ప్రభుత్వాలు , వృద్దులకు  , వికలాంగులకు  , వితంతువులకు   ప్రతి నెలా  చెల్లించే ' ఆసరా  పథకం ' / పెన్షన్  వలన అనేకమైన  ఉపయోగాలున్నాయి .  అవి ,
01. ముఖ్యంగా  ఇది , మేము కూడా  ఈ సమాజంలో  బ్రతకగలం  అనే  కొండంత  ధైర్యాన్నిస్తున్నది  . 
02. వీరికి  సాధారణగా  దీర్ఘ  కాల  అనారోగ్యాలు  వెంటాడు తాయి . అందుకని ,  కనీసం  కావాల్సిన  మందులు  , డాక్టర్ల  ఫీజులు  చెల్లించ డానికి  అవకాశం  లభించింది . 
03. వారి వారి  సంపర దాయాల ప్రకారం , పండుగలు  , పబ్బాలు  చేసుకోడానికి  వీలు గలుగుతున్నది . 
04. చిన్న పిల్లలు  దేవుడితో సమానం అంటారు . వారికి  ఏమైనా సమర్పిస్తేనే  దగ్గరకు  వస్తారు . ఏదైనా  సాయం చేస్తారు .  లేదంటే  దూరంగా  అంటి ముట్ట నట్లు ఉంటారు . 
05. ఎదిగిన  కొడుకులు  బిడ్డలు , బంధువులు కూడా  , వీరి దగ్గర  నాలుగు డబ్బులు కనబడే  సరికి , ఎంతో ప్రేమ  ఆప్యాయతలు  కనబరుస్తున్నారు . కనీసం  మా భారం తప్పిందను  కుంటున్నారు . 
06. పెన్షన్  డబ్బులు , రైతులకు  కష్ట  కాలాలలో  కూలీలలకు  చెల్లించ డానికి  చే బదులుగా  ఉపయోగ పడుతున్నాయి . 

No comments: