Sunday, January 10, 2016

మనుష్యులలో ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు ? / WHO LIVE MORE YEARS ?

ప్ర . మనుష్యులలో  ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు ?

జ . పూర్వ కాలంలో  మునులు  , ఋషులు  ఎలాంటి భౌతిక  ఆశలు , కోరికలు  లేకుండా  యేళ్ళ  తరబడి , కంద మూలలను , ఫలాలను  తినుకుంటూ  , గాలిని  పీల్చుకుంటూ  తపస్సు చేసే వారు . అలాంటి  ఋషులు  , మునులు  వందల యేండ్లు   , వేల యేండ్లు  జీవించ గలిగారు .  ఇప్పుడు మానవుల  విషయానికి వస్తే  , పురుషులకు  స్త్రీల  కంటే అధిక ఆర్ధిక భాద్యతలు , టెన్షన్లు  , కష్టపడుతూ  ఉండటం  వలన  మరియు  , కొన్ని  చెడు  వ్యసనాలకు బానిసలు  కావడం వలన , పురుషుల జీవిత  కాలం  తగ్గుతూ వస్తుంది . కొందరు పురుషులు కావచ్చు , స్త్రీలు  కావచ్చు , వారి  వారి పూర్వ  తరాల  జీన్స్ ప్రకారం  ఎక్కువ కాలం జీవిస్తున్నారు . ఇక విదేశాల విషయానికి వస్తే , కొన్ని దేశాలలో  నూరు సంవత్సరాలు  దాటిన  వారిలో స్త్రీలు ఉన్నారు , పురుషులు ఉన్నారు . అది వారి జీవన విధానం పై ఆధార పడి ఉంటుంది .  భారత దేశం  విషయానికి వస్తే ,  ప్రస్తుత లెక్కల  ప్రకారం   స్త్రీలు  ఎక్కువ కాలం జీవిస్తున్నారు . 

No comments: