Thursday, January 28, 2016

కుటుంబంలో ప్రశాంతత నెల కొనాలంటే ఏమి చేయాలి ?

ప్ర . కుటుంబంలో  ప్రశాంతత  నెల కొనాలంటే  ఏమి చేయాలి ?
జ . కుటుంబంలోని  సభ్యులంతా  సఖ్యంగా, ఐఖ్యంగా, క్రమ శిక్షణతో ఉంటూ ,  ఇగోలకు పోకుండా ,  ఒకరి  ఆలోచనలు మరొకరు  పంచుకుంటూ , కుటుంభాన్ని పోషించే ( ఆడ కావచ్చు , మగ కావచ్చు  లేదా ఇద్దరూ  కావచ్చు )  వారికి  అనుకూలంగా  నడుచుకుంటూ  ఉంటే  ,  కుటుంబంలో  ప్రశాంత  నెలకొంటుంది .  మనసు ఉల్లాసంగా ఉంటుంది .  కుటుంబంలో  గొడవలు , ఘర్శనలుండవు . అప్పుడు  చెట్టు  క్రిందనైనా , పుట్ట క్రింద నైనా , పూరి గుడిసె లోనైనా , పస్తులుండైనా ,  హాయిగా , సంతోషంగా  జీవించ వచ్చు .  అంతే  కాని  ఆడంభారాలకు  పోయి  , లేనిది  కావాలని  కోరుకుని , ప్రక్క వారి కున్నది మనకు లేదని , అక్రమ సంపాదనకు  ప్లానులు వేసి ,  క్షణికమైన శారీరక  సుఖాలకు తెర లేపి , కోట్లకు పడగలెత్తుదామన్న దురాశతో  లేదా ఏదయినా  సమస్య ఉత్పన్నమయినప్పుడు  వాస్తు దోషాలని , మూఢ  నమ్మకాలతో  కుటుంభాన్ని పోషించే  వారి ( ఆడ కావచ్చు , మగ కావచ్చు  లేదా ఇద్దరూ  కావచ్చు )  యిష్టానికి  విరుద్దంగా , ఏక పక్షంగా   ఇంట్లో  వస్తువులు , ఫోటోలు , అద్దాలు , టీ  . వీ. ల   స్థలాలు  మార్చడం వలన  , చని పోయిన పెద్దల ఫోటోలు  తీసి వేయడం వలన ,  ఇండ్లు , జాగలు  ఆమ్మటాలు , పునర్నిర్మాణాలు  చేయడం వలన  , కొత్త కొత్త  వేషాలు వేయడం వలన , అరిచి డామినేషన్  చూపించు కోవాలనుకున్నా  ప్రశాంత నెలకొనదు గాక  , పైనుండి  మన:స్పర్ధలు పెరిగి , ఘర్శనలు పెరిగి పోవచ్చు . ఒకరి కొకరు  ఎకాకయి  ఏవైనా అనుకోని  నిర్ణయాలు  తీసుకోవలసి రావచ్చు .  ఏదైనా కల్సి నిర్ణయాలు తీసుకోవాలి . లేదంటే వదిలేయాలి . ఇంటిని పోషించే వారి మీద  ఆడార పడి  జీవించే వారు ,  తాబట్టిన కుందేలుకు  మూడే కాళ్ళని గాలిలో మేడలు కట్టాలని  వ్యవహరిస్తే   , కుటుంబం మొత్తం  మరియు  వారిపై ఆదారపడిన  కుటుంబాలు  కుమిలి కుమిలి  జీవించ వలసి రావచ్చు .  ఆర్ధికంగా నష్ట పోవాల్సి రావచ్చు  . కుటుంబ గౌరవం  పోవచ్చు .  అంతే  కాదు , వీరి ప్రభావం  మొత్తం సమాజంపై పడుతుంది . లా & ఆర్డర్  కు  పని కల్పించాల్సి రావచ్చు .  కోర్టుల కేసులు తప్పక పోవచ్చు 

Wednesday, January 27, 2016

కులాలు ఎలా ఏర్పడ్డాయి ? మతాలు ఎలా ఏర్పడ్డాయి ?

ప్ర . కులాలు  ఎలా ఏర్పడ్డాయి ? మతాలు ఎలా ఏర్పడ్డాయి ?
 జ .  నాటి  ప్రజలు  మొట్ట మొదటి సారిగా  వారి వారి  ఇష్టన్గానో , కష్టంగానో  చేపట్టిన  పనులను బట్టి , వృత్తులను  బట్టి కులాలు ఏర్పడ్డాయి . 
ఉదా :  బట్టలు  ఉతికే వారిని  చాకలి అని , కుండలు చేసే వారిని  కుమ్మరి అని , నగలు  చేసే వారిని  కంసాలి  అని , చెక్క పనులు చేసే వారిని  వడ్రంగి అని , పురోహితం చేసే వారిని  అయ్య వార్లు  అని , వేదాలు పఠియించే  వారిని  వేదాంతులు , బ్రాహ్మలు అని , ఇనుమును సరిసే వారిని  కమ్మరి అని , వెంట్రుకలను కత్తిరించు వారిని  మంగలి  లేదా నాయి బ్రాహ్మలని , ఉరూర  తిరిగి  రక రకాల  వస్తువులను  అమ్ముకుని జీవించే వారిని  దాసరి  అని , ఇలా  అనేకమైన వందల కులాలు  ఏర్పడ్డాయి .  వారి  వారి గురువులను బట్టి ,  పూజించే  దేవుళ్ళను బట్టి  , మతాలు  ఏర్పడ్డాయి .  మతాలను  బట్టి  ఆచారాలు , సాంప్రదాయాలు   ఏర్పడ్డాయి .  ఏది  ఏమైనప్పటి కి ఈ సృష్టిలో  ప్రజలందరూ  సమానులే .  

జి . హెచ్ . ఎం. సి . (GHMC) ఎన్నికలలో " ఎక్ష్ అఫీసియో మెంబర్స్" అంటే ఎవరు ?

ప్ర .  జి . హెచ్ . ఎం. సి . (GHMC) ఎన్నికలలో  " ఎక్ష్ అఫీసియో  మెంబర్స్"  అంటే ఎవరు ?

జ .  జి . హెచ్ . ఎం. సి . (GHMC) ఎన్నికలలో  " ఎక్ష్ అఫీసియో  మెంబర్స్" అనగా  ఆ  జి . హెచ్ . ఎం. సి . (GHMC) ఎన్నికల పరిధిలోని  పార్లమెంట్ మెంబర్స్ , రాజ్య సభ  మెంబర్స్ , ఎం . ఎల్ .  ఎ . లు  మరియు  ఎం . ఎల్ . సి .  లు .  

ధ్యానం అంటే ఏమిటి ?

ప్ర . ధ్యానం అంటే  ఏమిటి ? 

జ . ధ్యానం అంటే  ' శ్వాస మీద ధ్యాస ' . 

Monday, January 25, 2016

పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చడం వలన ఉపయోగమేమిటి ?


ప్ర . పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చడం వలన ఉపయోగమేమిటి ?
జ . భారత దేశంలో అత్యధిక నెట్ వర్క్ గల ప్రభుత్వ విభాగామేదంటే " పోస్ట్ ఆఫీసులు " (POST OFFICES) మాత్రమే అని ఘంటా పధంగా చెప్పవచ్చు . 31.03.2009 నాటికి దేశంలో 1,55,015 పోస్టాఫీసులున్నాయి . అందులో 1,39,144 పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాలలో నెలకొల్పుతే , 15,871 మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నెల కోల్ప బడ్డాయి . 

ఇంత పెద్ద నెట్ వర్క్ గల పోస్టాఫీసులు , దేశంలోని పట్టణ ప్రాంతాల వారికి , గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం . ప్రజలకు చేరువలో ఉంటాయి . పోస్టాఫీసులంటే ప్రజలకు ఎంతో నమ్మకం . ఎన్నోరకాల సేవలందించే పోస్టాఫీసులంటే ప్రజలకు ప్రాణం . ఇంటివద్దకే వచ్చి పోస్ట్ కార్డ్స్ , పార్సిల్స్ మరియు డబ్బులు అందించే పోస్ట్ మ్యాన్ అంటే ఎంతో అభిమానం , గౌరవం. ఇంతటి అభి మానం చూరగొన్న పోస్టాఫీసులన్నింటిని పోస్టల్ బ్యాంక్స్ గా మార్చి నట్లవుతే  ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా  ఉండ గలవు . ప్రజలలో పొదుపరితనం పేరుగా గలదు . ప్రజలు ఇతర పొదుపు సాధనాల ద్వారా మోస పోవడానికి అవకాశ ముండదు . ఆర్ధిక నష్టం జరుగదు .  

నేడు పోస్టాఫీసులు మనకు అనేక రకాల సేవలను అందిస్తున్నాయి . అందులో ముఖ్యమైనవి ,

1. దేశ , విదేశ నలుమూలలకి ఉత్తరాలను , పార్సిల్స్ ను , గ్రీటింగ్స్ ను , రాఖీస్ ను చేర వేయడం .
2. డబ్బులను అందించడం .
3. పొదుపు ఖాతాలను ( సేవింగ్ , రికరింగ్ మరియు పి. పి. ఎఫ్. ఖాతాలను ) నడపడం .
4. యూనివర్సిటీల ఫీజులను కల్లెక్ట్ చేయడం .
5. ఎన్ ఎస్ సి  లాంటి టాక్ష్ సేవింగ్ సర్టి ఫికట్స్ ను ఇష్యూ చేయడం .
6. కార్డులు , కవర్లు తపాల బిల్లలు , పోష్టల్ ఆర్డర్లను , నాన్ జుడీష్యల్  స్టాంప్ పేపర్లను  అమ్మడం .
7. బంగారు బిళ్ళలు (Gold coins) అమ్మడం .
8. ఇన్సూరెన్స్ (Insurance) చేయడం .
9. ఫైనాన్సియల్ ప్రాడక్ట్స్ అమ్మడం  మొ . న  అనేక రకాల సేవలను పోస్టాఫీసులు అందిస్తున్నాయి .

ఇంత పెద్ద నెట్ వర్క్ గల, ఇంతటి భద్రత కల్పించే , ఎంతో నమ్మకాన్ని చూర గొన్న పోస్టాఫీసులలో కొన్ని లోపాలు కూడా లేక పోలేదు . అవి , ఉత్తరాలు , మనియార్డర్లు , రిజిస్టర్ పోస్టులు అందించడంలో ఎక్కువ సమయం తీసు కోవడం , పొదుపు పధకాల సేవలకు ఎక్కువ సమయం తీసుకోవడం , ఎక్కువ డబ్బు డ్రా చేయాలంటే ఒక రోజు ముందే చెప్పాలనడం , పాస్ బుక్ ఎంట్రీస్ కు చాలా రోజులు తిప్పడం , వర్కింగ్ అవర్స్ ప్రజలకు అనుకూలంగా లేక పోవడం , అడుగడుగునా ఏజెంట్ల బెడద ,  సిబ్బంది కొరత , ఇంకను పూర్తిగా అన్ని పోస్టాఫీసులు  కంప్యూటరైజేషన్  కాక పోవడం , తెలివైన మరియు చురుకైన సిబ్భంది లేక పోవడం మొదలైనవి .

చిన్న చిన్న లోపాలను ఆదిగ మించి , నేడు పోస్ట్ ఆఫీసులను పూర్తీ గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది . ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో రోజు వారి సంపాదన వారి చేతిల్లో ఉంటుంది . రేపటి ఎన్నో రకాల అవసరాల కోసం పొదుపు చేయా లనుకుంటారు . దాని మీద కొంత వడ్డీ రావాలని కోరు కుంటారు . అందు బాటులో ఏమీ ఉండవు .  కొందరికి నేటి బ్యాంకులంటే భయం . అందుకని వారు చిట్టీలను , లాటరీలను ,ఇనుస్యూరెన్స్ లను ,  స్కీములను , ఇతరులకు వడ్డీలకు ఇవ్వడం చేస్తుంటారు . కొంత కాలానికి  వీరి బలహీనతను ఆసరా చేసుకుని  కొందరు కేడీలు , మోసం చేయడం , వీరు లబోదిబో మనడం ప్రతినిత్యం సర్వ సాధారణం అయిపోయింది . ఆ తరువాత కొట్లాటలు , కోర్టులు . 

ఇలాంటి వన్నింటిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రభుత్వం పోస్టాఫీసులన్నింటిని " ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " (INDIAN POST BANK) లు గా మార్చాలి. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న చిన్న బ్యాంకుల పరిధిలోకే వస్తాయి . అంతే కాకుండా అన్ని పోస్టాఫీసులను కంప్యుటీ కరించాలి . సేవలను మెరుగు పరుచాలి . తెలివైన మరియు చురుకైన సిబ్భందిని నియమించాలి . పని వేలల ను మార్చాలి. ఆదాయం పెంచడానికి మరిన్ని సేవలను పెంచాలి . మీ సేవలో జరిగే సేవలన్నిటిని మరియు ఫ్రాంకింగ్ సేవలను పోస్టాఫీసు పరిధిలోకి తీసుకుని రావచ్చు . ఏజెంట్ల బెడదను రద్దు చేయాలి . "ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " ( INDIAN POST BANK) ల గురించి మరియు క్రొత్త సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి . 

అంతే కాకుండా , ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ , ప్రైవేటు మరియు బ్యాంకుల లాగానే , "ఇండియన్ పోస్ట్ బ్యాంక్ " ల లో ఇష్యూ చేసే చెక్కులు , డ్రాఫ్ట్ లు , అన్ని బ్యాంకులలో చెల్లు బాటు కావాలి . ఇతర బ్యాంకుల లో మాదిరే , ట్రాన్సాక్షన్స్ జరిపే ఏర్పాట్లు ఉండాలి . రుణ పరిమితికి లిమిట్ ఉండాలి . పెద్ద మొత్తాల్లో ఉండ కూడదు . రాజకీయాల జోక్యం ఉండ కూడదు.

తపాల కార్యాలయాలలో " స్టాంప్ పేపర్లు " ( Non judicial Stamp papers ) అమ్మాలనే యోచన చాలా గొప్ప నిర్ణయం . దీని వలన కొరత అనేది ఉండదు , అధిక ధరలకు కళ్ళెం వేయ వచ్చు . మరియు అడ్రస్సు సులువుగా దొరుకుతుంది . ఒక్కొక్క సేవకు , ఒక్కొక్క కాడికి పోనవసరం ఉండదు . ఆ కారణంగా సమయం , డబ్బు , శ్రమ ఆదా అవుతుంది .

' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టి 'లక్షాధికారులు ' కావచ్చా ?

ప్ర . ' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు  పెట్టి   'లక్షాధికారులు కావచ్చా ?


జ .  ' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు  పెట్టి   'లక్షాధికారులు  '  కావచ్చు .  అది ఎలాగంటే ,  ఒకే సారి రూ . లు.  25,000/- పెట్టుబడి పెట్టినట్లవుతే ,   12 % చొ . న .  ఆన్యువల్  కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో  రూ . లు 2,41,157/- కాగలవు .  లేదా   ఒకే సారి రూ . లు.  1,00,000/- పెట్టుబడి పెట్టినట్లవుతే ,   12 % చొ . న    ఆన్యువల్  కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో   రూ . లు 9,64,629/- కాగలవు . ( Calculator  source: www.moneycontrol.com/ magic of compoundingtool) 

' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు పెట్టే  ముందు  నమ్మక మైన  ఆర్ధిక సలహా దారులను  సంప్రదించడం  తప్పనిసరి .   ఇది కేవలం  అంచనా మాత్రమే .  సగటు ఆదాయమనేది మార్కెట్ ట్రెండ్స్ పైన ఆధార పడి  ఉంటుంది .  ఎవరి  లాభ నష్టాలకు  వారే బాద్యులు . 

Sunday, January 24, 2016

నిదుర పట్టక పోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి ?

ప్ర .  నిదుర  పట్టక పోవడానికి  ముఖ్యమైన  కారణాలు ఏమిటి ?
జ.  నిదుర  పట్టక పోవడానికి  ముఖ్యమైన  కారణాలు  సమస్యలు , అనారోగ్యం ( దీర్ఘ కాల  వ్యాదులు, గాయాలు , నొప్పి )  , అసూయ , ఆష ,  కోపం , లోభం , కామం , ఆందోలన , కోరికలు  మొ . న వాటి వలన  వచ్చే  ఆలోచనలు. 

Saturday, January 23, 2016

MUTUAL FUNDS / ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టి 'కోటీశ్వరులు ' కావచ్చా ?

ప్ర . ' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు  పెట్టి   'కోటీశ్వరులు '  కావచ్చా ?

జ .  ' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు  పెట్టి   'కోటీశ్వరులు '  కావచ్చు .  అది ఎలాగంటే ,  నెలకు  రూ . లు . 10,000/- చొ . న , 20 సంవత్సరాలు  క్రమం తప్పకుండా  పెట్టుబడి  పెట్టినట్లవుతే , 12% చొ . న .  ఆన్యువల్  కాంపౌండ్ వడ్డీతో  రూ . లు 1,03,08,701/-  కాగలవు .  లేదా  ఒకే సారి రూ . లు.  3,00,000/- పెట్టుబడి పెట్టినా  12% చొ . న .  ఆన్యువల్  కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో  రూ . లు  1,00,17,839/- కాగలవు . ( Calculator  source: www.moneycontrol.com/ magic of compoundingtool) 

' మ్యూచువల్ ఫండ్స్  ' లలో  పెట్టుబడులు పెట్టే  ముందు  నమ్మక మైన  ఆర్ధిక సలహా దారులను  సంప్రదించడం  తప్పనిసరి . ఇది కేవలం  అంచనా మాత్రమే .  సగటు ఆదాయమనేది మార్కెట్ ట్రెండ్స్ పైన ఆధార పడి  ఉంటుంది .  ఎవరి  లాభ నష్టాలకు  వారే బాద్యులు . 

Friday, January 22, 2016

.' మ్యూచువల్ ఫండ్స్ ' (MUTUAL FUNDS) అంటే ఏమిటి ? ఎన్ . ఎ . వి (NAV) అంటే ఏమిటి ?

ప్ర .' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS)  అంటే  ఏమిటి ?  ఎన్ . ఎ . వి  (NAV)  అంటే ఏమిటి ?

జ . ' మ్యూచువల్ ఫండ్స్ ' అనేవి  పొదుపు , పెట్టుబడి  సాధనాలు . ' మ్యూచువల్ ఫండ్స్ ' ను  పెద్ద  పెద్ద  మరియు  పరిశోధనాత్మక , విజ్ఞ్యానం  గల , వృత్తి  పరమైన  సంస్థలు నిర్వహిస్తాయి . ఈ  ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో  అన్ని రకాల పొదుపుదారులు  , ట్రస్టులు ,  కంపనీలు  రూ . లు . 500/- నుండి  కోట్ల  రూపాయల వరకు  పొదుపు లేదా  పెట్టుబడి పెట్టుకోవచ్చు . క్రొత్తగా  ' మ్యూచువల్ ఫండ్స్ ' స్కీం  స్టార్ట్  చేసి  నప్పుడు ,   ప్రతి యూనిట్ ను  రూ .లు . 10/- గా   లెక్కించి  యునిట్స్ ను అలాట్ చేస్తారు .  ఉదా: కరణ్ అనే వ్యక్తి   రూ .లు . 10,000/-.  లను  ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో  పెట్టుబడి పెట్టాడనుకుందాం .  అప్పుడు అతనికి  1,000 యూనిట్స్ ( 10,000/10)  అలాట్ చేస్తారు . కొంత కాలం తరువాత  అవే యూనిట్స్  ను కొనాలంటే , మార్కెట్  ఎన్ . ఎ . వి  (NAV) ప్రకారం  కొనాల్సి వస్తుంది .   ఎన్ . ఎ . వి  (NAV)  అంటే  నెట్  అసెట్ వ్యాల్యు .  ఈ  ఎన్ . ఎ . వి  (NAV)   ను  ఎలా  లెక్కిస్తారో  చూద్దాం .    పెట్టుబడిగా  వచ్చిన  కోట్ల  రూపాయలను  అభివృద్ధి చెందుతాయనుకున్న  మంచి  కంపనీల  షేర్లల్లో , సెక్యూరిటీలలో  ,  ఈ  ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు  పెట్టుబడులు  పెట్టాక , రోజులు గడుస్తున్న కొద్దీ  , మొత్తం  పెట్టుబడుల  మార్కెట్ వ్యాల్యు  పెర్గడమో , తగ్గడమో  జరుగుతుంది .  ఆ  మొత్తం మార్కెట్  వ్యాల్యు  నుండి  వారి  జీత బత్తాలు , అన్ని రకాల ఖర్చులు  తగ్గించాక  వచ్చిన  నికర  మొత్తం మార్కెట్  వ్యాల్యును , మొత్తం  యూనిట్స్ తో  డివైడ్  చేస్తారు . అలా భాగిస్తే  వచ్చేదే  ఎన్ . ఎ . వి  (NAV) . దీర్ఘ కాలంలో  ఈ  ఎన్ . ఎ . వి  (NAV)  పెరుగుతుందే  కాని తగ్గదు . దీర్ఘ కాలంలో  బ్యాంకులు  8% నుండి 9% వరకు  ఆదాయం లభిస్తే ,  మంచి  ' మ్యూచువల్ ఫండ్స్ '  లలో  13% నుండి14%  వరకు  ఆదాయం లభించవచ్చు .     ప్రస్తుతం  అనేక రకాల  ' మ్యూచువల్ ఫండ్స్ '  అందుబాటులో ఉన్నాయి .  . ఉదా : ఫ్రాంక్లిన్ , ఎచ్. డి . ఎఫ్ . సీ ., రిలయన్స్ , టాటా , కెనరా , సుందరం  ' మ్యూచువల్ ఫండ్స్ ' మొ . న వి  అనేకంగా  అందుబాటులో ఉన్నాయి .  మరియు వీటిలో వివిధ రకాలైన  ఫండ్స్ ఉన్నాయి . ఉదా : ఈక్విటీ ఫండ్స్ , డెట్  ఫండ్స్ , టాక్ష్  సేవింగ్ ఫండ్స్ , సెక్టార్ ఫండ్స్ , బ్యాలన్స్ ఫండ్స్ , డైవిర్సిఫైడ్  ఫండ్స్  మొ . నవి .  మరల వీటిలో  డివిడెండ్ పే అవుట్,  డివిడెండ్  రి ఇన్వెస్ట్  మెంట్  మరియు గ్రోత్  ఫండ్స్  అను రకాలు కలవు . 
 ఏది ఏమైనప్పటికీ  పెట్టుబడులు పెట్టేముందు  ఆర్ధిక  సలహాదారులను  సంప్రదించడం  ఉత్తమం .
ప్ర . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా  కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు  లేదా నష్టాలు  పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు .  డైరెక్టుగా  కొనేటప్పుడు  0.5% - 1%  కమీషన్స్  బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు  . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా  కొనుగోలు చేస్తే  0.5% - 1% , వీరికి  కమీషన్  మ్యూచ్యువల్  ఫండ్  సంస్థ  చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్  బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన  బ్రోకర్  సంస్థల ద్వారా  కొనడం వలన  అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి .  డైరెక్టుగా  కొనేటప్పుడు   సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) ,   ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది  డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే  పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు .  ఉదా : DSPBR TECHNOLOGIES FUND  కొన్నట్లయితే  ఈ రోజున  12.78% నష్టం వచ్చేది . అలానే  TATA DIGITAL INDIA FUND  కొన్నట్లయితే  ఈ రోజున  9.72% నష్టం వచ్చేది . అలానే  SBI PHARMA FUND కొన్నట్లయితే  ఈ రోజున  9.27 % నష్టం వచ్చేది . అలా  అనేక మైన  '' మ్యూచువల్  ఫండ్స్  '' స్కీమ్స్  నష్టాల లో  కూడా నడుస్తున్నాయి . 




Thursday, January 21, 2016

మనిషికి మనఃశ్శాంతి , మానసిక ప్రశాంతత కావాలంటే ఏమి చేయాలి ?

ప్ర . మనిషికి  మనఃశ్శాంతి  , మానసిక ప్రశాంతత  కావాలంటే  ఏమి చేయాలి ?

జ . "ఇంటి ఇంటికి  మట్టి పొయ్యే  అన్నట్లు"  సమస్యలు లేని   మనిషి  ఈ లోకంలో  లేడు . సమస్యలు లేని   జీవి   ఈ లోకంలో  లేదు . సమస్యలను  పాజిటివ్ గా  తీసుకుంటూ . జీవితాన్ని  ఆస్వాదించే వారే నిజమైన జ్ఞానులు .  'నిజ జీవితంలో  ప్రతి మనిషి  ఏదో  ఒక సమయంలో  లేదా అనేక  సమయాలలో , ఏదో ఒక కారణంగా  బాధలు , కష్టాలు , దు:ఖాలు , రందులు  ఎదుర్కునే  ఉంటాడు . ఏదో  ఒక సమయంలో   మనఃశ్శాంతి  , ప్రశాంతత గురించి తీవ్రంగా  తపించే ఉంటాడు . ఆలోచించే ఉంటాడు .  మనఃశ్శాంతి  , మానసిక ప్రశాంతత గురించి  డాక్టర్ల వద్దకు  పరుగెత్తే ఉంటాడు . ఏవో కొన్ని మందులు వాడే  ఉంటాడు . ఏమైతే నేమి ,  సమస్య మనస్సుకు సంభందించినది  కాబట్టి , అది అంత సులువుగా తగ్గదు . 
అయితే , మనఃశ్శాంతి  , మానసిక  ప్రశాంతత  కావాలంటే  ఏమి చేయాలి ?
-------------------------------------------------------------------
01. మనఃశ్శాంతి , మానసిక ప్రశాంతత లేక పోవడానికి  కారణాలు ఏమిటో  విశ్లేషించుకోవాలి . 
02. ఆ కారణాలకు అనుగుణంగా  మార్పులు చేసుకోవాలి . పరిస్థితులను  బట్టి , కాలాన్ని బట్టి  సర్దుకు పోవాలి .  
03. బాధ , రంది  అనేది మనసుకు  సంభందించినది కాబట్టి , '' మనకు ఏది శాస్వితం  కాదు అని , వచ్చేటప్పుడు  ఏమి తీసుకుని   రాలేదు , పోయే టప్పుడు  ఏమి  తీసుకుని పోము , అలాంటప్పుడు  నేనెందుకు  బాధ పడాలి  , రంది  పడాలి '' అని, "  జరిగినది , జరుగుతున్నది , జరుగబోయేది , అంతా  సృష్టి రహస్యమే , నేను  కేవలం నిమిత్త మాత్రుడిని " అని ,   ఒక పేపరు మీద వ్రాసుకుని  ప్రతి రోజు  ఉదయం  5 - 6  గంటల మద్యలో  , సాయంత్రం  9-10 గంటల మద్యలో  చదువుకోవాలి ,  ఆ విధంగా మనసుకు సర్ది చెప్పుకుంటూ  పోవాలి .  
04. సమస్య తీవ్రంగా ఉంటే , మనకు  ఇష్టమైన , నమ్మకమైన  బంధువులకు గాని , స్నేహితులకు గాని ,   దీని వలన  సగం భారం తగ్గి పోతుంది . అంతే కాదు . వారి నుండి సప్పోర్ట్  లభించ  వచ్చు . 
05. ప్రతి రోజు  ఉదయమే , వాకింగ్ కు  వెళ్ళాలి . యోగా చేయాలి . మెడిటేషన్  చేయాలి . 
06. మనసును  ఏదైనా  పని మీదికి గాని , ఏదైనా  ఇష్టమైన  వ్యాపకం మీదికి గాని ,  ఇష్టమైన  సంగీతం , కళల మీదికి గాని , ఆటల  మీదికి గాని  మల్లించాలి . 
06. ఆధ్యాత్మిక  దిశగా  కొంత సమయాన్ని  కెటాయించాలి .   
07. ఒక వేల  డబ్బు అధికంగా  ఉంటే , పేదవారికి  ఏదైనా విరాళ  మిచ్చి , వారి సంతోషంలో , ఆనందంలో  పాలు పంచుకుని , బాధను , రందిని  మరిచి పోవాలి . 
08. ఓక వేల  డబ్బు లేక పోతే , మాట సహాయం గాని , చేత సహాయం గాని  చేసి , వారి సంతోషంలో , ఆనందంలో  పాలు పంచుకుని , బాధను , రందిని  మరిచి పోవాలి . 
10. మరి కొన్నాళ్ళకు  మరో సమస్య  ఎదురౌతే , గత అనుభవాలను  గుర్తుకు తెచ్చుకుని , బాధను , రందిని  , మనసు దరికి  రాకుండా చూసుకోవాలి . 
11. ప్రతి రోజు  ఉదయం , సాయంత్రం  స్నానం  చేసి  , రాత్రి పడుకోబోయే ముందు  గ్లాసేడ్  పాలు తాగి  హాయిగా  నిద్ర పోవాలి . నిద్ర  సక్రమంగా  పోవడం వలన , అనేక మైన  శారీరక , మానసిక సమస్యలకు ఖచ్చితంగా  పరిష్కారం  లభిస్తుంది . 
12. అప్పటికీ  తగ్గ నట్లవుతే ,  ' సైకిలాజిస్ట్ ' వద్దకు గాని  లేదా ' సైక్రియాటిస్ట్ ' వద్దకు గాని  వెల్లి , కౌన్సిలింగ్  చేయించుకుని , మందులు వాడాలి .   

' అభివృద్ది ' అంటే ఏమిటి ? / WHAT DOE'S IT MEAN THE DEVELOPMENT ?

ప్రశ్న : ' అభివృద్ది ' అంటే ఏమిటి ?

జవాబు : ' అభివృద్ది ' అంటే ఎదుగుదల . ఒక  పాజిటివ్ మార్పు . దేశం అభి వృద్ది చెందింది  అనడానకి  ప్రత్యేకమైన  కొల మానాలు ఏమి లేవు . స్కేల్లు  లేవు .  అయినా  ఒక  పాజిటివ్ మార్పు ద్వారా  'అభి వృద్ధి 'ని  గుర్తించ వచ్చు . ప్రజలందరూ  విద్యా వంతులవడం . (అంటే  నిరక్ష రాష్యతను  రూపు మాపడం) . అనారోగ్యాల బారిన పడకుండా , రోగ నిరోధక శక్తిని పెంచ గలగడం .  దేశంలో మనకు కావాల్సింది  , మనమే  తయారు చేసుకో గల్గడం , ఇతర దేశాలకు  ఎగుమతి   చేయ గల్గడం . (దీనినే  ' స్వయం  సమృద్ది ' అంటారు) . ప్రజలకు చేతి నిండా పని కల్పించడం  ( అంటే నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం  ) , ప్రజలకు కడుపునిండా  భోజనం కల్పించడం , ఉండ డానికి నీడ  కల్పించడం , కట్టు కోడానికి  దుస్తులు  కల్పించడం , వారి మోఖాలలో సంతోషాన్ని  , ఆనందాన్ని  చూడటం  ,  అలానే  వారు   సమస్యలతో  ఏ కోర్టుల చుట్టూ  తిరుగ కుండా  , జైళ్ళల్లో  మ్రగ్గ కుండా   ఉండడాన్ని  ' అభివృద్ది ' అనవచ్చు . ఇది  సాధించాలంటే  , ముఖ్యంగా  ప్రజలను  ఆరోగ్యంగా  , ఆనందంగా  , సంతోషంగా  ఉంచ గలగాలి . నాణ్యమైన  విద్యను  అందించ గల్గాలి . అనారోగ్యాలు  రాకుండా  రోగ నిరోధక  శక్తిని  పెంచే ప్రయత్నం  చేయాలి . ప్రజలలో  నైతికతను పెంచాలి . మానవత్వాన్ని , సమానత్వాన్ని  పెంచాలి .  నాది , నీది  అనే  స్వార్ధ  బీజం పడకుండా చూడాలి . ఐఖ్యతా  భావాన్ని  పెంచాలి . మన  సంస్కృతి  , సాంప్ర  దాయాలను , కట్టు  బాట్లను గౌర వించాలి .   వ్యవసాయాన్ని  అభి వృద్ధి  చేయాలి . పరిశ్రమలను  అభివృద్ధి  చేయాలి . ఇన్ఫ్రాస్ట్క్షర్  ను అభివృద్ధి పరుచాలి . ప్రకృతి  సంపదలను  ( Natural resources ) ను సద్వినియోగం  చేసు కోవాలి , మనవ వనరులను అభి వృద్ది పరుచాలి . పర్యావరణాన్ని  కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి . శాస్త్ర , సాంకేతిక విద్యను  అంది పుచ్చుకోవాలి . యువతలో ఉన్న నైపుణ్యాన్ని  వెలికి తీయాలి . అలానే దానిని సద్వినియోగం చేసుకోవాలి . దేశంలో  అవినీతి లేకుండా చేయాలి . ఆర్ధిక అంత  రాలను  తగ్గించాలి . దేశ  విదేశాలలో ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీసి  , బినామీ ఆస్తులను వెలికి తీసి  ( ఇవ్వ వలసిన  అవకాశాలన్నీ  ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి )  దానిని  ఏ  మాత్రం ఆలోచించ కుండా  జాతీయ సంపదగా గుర్తించాలి .  ' అభివృద్ది ' అంటే  దేశంలో  సంపద అంతా  కేవలం  పది మంది చేతిలో ఉండటం కాదు . అందరి వద్ద సమంగా ఉండాలి . దేశంలో  బిక్షాటన చేసే వారే   ఉండ కూడదు . బి . పి . ఎల్ . ( B.P.L ) క్రింద  జీరో  పర్సెంట్  ఉండ డానికి  ప్రయత్నించాలి .  సక్రమంగా ఎన్నికలు జరుగాలి . నిస్వార్ధమైన తీర్పులుండాలి . శిక్షలు   వారినుండి  క్రింది వారికి రావాలి గాని  , క్రింది వారి నుండి పైకి  పోకూడదు . క్రింది వారిలో కేవలం ఇది తప్పు , ఇది నేరం , దీనికి ఈ శిక్ష ఉంటుంది , చట్టం ముందు అందరూ  సమానులే అనే ఆవ గాహనను  , భయాన్ని  క్రియేట్ చేయాలి .  డబ్బు తోటి  ఏ  పనినైనా  సర్దు మనిగేటట్లు  చేయ వచ్చు , అనే సందేశాన్ని  ప్రజలలోకి  పంపిస్తే , ప్రజలు  అక్రమంగా  డబ్బు సంపాదించ డానికి  ఎగ బడుతారు . అంటే   ప్రభుత్వమే , చట్టాలే  అవినీతిని  ప్రోత్సహించినట్లవుతుంది .  సబ్సీడీలు  , రుణ మాఫీలు  మొదలైనవి  కేవలం  ఓటు బ్యాంకు  సాధనాలు . ఎఫ్ . డి ఐ. లు , ట్రస్టులు  అవినీతి  కూపాలు . 

జి . డి . పి . లు , ద్రవ్యోల్భానాలు , కరెంట్ అకౌంట్లు , విదేశీ నిల్వలు , లోటు బడ్జెట్లు , ఇతర సూచీలు , ఆకాశ మెత్తు బిల్డింగులు , రింగు రోడ్లు , ఫ్లై ఓవర్లు  కట్టడం , యుద్ద  సామాగ్రి సముపార్జించుకోవడం  మొదలైనవి , ఎన్నడూ  అభివృద్ధికి  తార్కాణాలు కావు . 



దేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి ?

ప్రశ్న : దేశంలో  వ్యవస్థలు  ఎలా ఉన్నాయి ?

జవాబు : " ఏ  వ్యవస్థను  చూసినా  ఏముంది గర్వ కారణం , వ్యవస్థలు  సమస్తం  అవినీతి మయం. అందుకే  కావాలి  ప్రజలందరూ ఏకం  ." 

కోతుల బెడదను తప్పించు కోవాలంటే ఏమి చేయాలి ?

ప్రశ్న : కోతుల బెడదను  తప్పించు కోవాలంటే ఏమి  చేయాలి ?

జవాబు : గ్రామాలలో  , రైల్వే  స్టేషన్లలో  , గుడుల వద్ద , పర్యాటక  స్థలాల వద్ద , పంట చేల వద్ద  కోతులు పెట్ట బాధలు అంతా ఇంతా కాదు . మనుష్యులను  గాయ పరుస్తాయి , పంటలను నాశనం  చేస్తాయి . ఒక్క  మాటలో చెప్పాలంటే  , మనిషి కంటికి నిద్దుర  లేకుండా చేస్తాయి .  కోతులు  ఇలా  ఊళ్ళ  మీద పడ డానికి  ముఖ్య కారణం , రోజు రోజుకు  అడవులు అంత రించుక పోవడం . వాటికి ఆహారం దొరుకక , అవి గ్రామాల మీద , పంట చేలపై  పడి  ఆహారాన్ని  సంపాదించు కుంటున్నాయి . 
కోతుల బాధల నుండి  తప్పించు కోవాలంటే ,  మరల  వాటికి ఆహారాన్ని  అందించ గలిగే అడవులను  పెంచాలి .  లేదా  ' వాటికీ  శత్రువైన  ' కొండ ముచ్చులను ' తీసు కొచ్చి  అప్పుడప్పుడు  , గ్రామాలలో , పంట చేలలో తిప్పాలి .  అప్పుడు కోతులు  సుదూర  అడవి  ప్రాంతాలకు  పరుగులు  పెడుతాయి . లేదా   ' కోతుల  పార్క్ ' లను కట్టించి  అందులో వాటిని  విడిచి  ఆహారాన్ని అందించాలి . దానిని  పర్యాటక స్థలం గా  మార్చాలి .  

Wednesday, January 20, 2016

చుట్టూ అన్నీ ( కూడు , గూడు , గుడ్డ మరియు కావలసినంత ధనం ) ఉన్నా , మనుష్యులు ఎందుకు బాధతో , దు:ఖం తో ఉంటారు ? ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటారు ?

ప్ర . చుట్టూ  అన్నీ ( కూడు , గూడు , గుడ్డ   మరియు  కావలసినంత ధనం ) ఉన్నా , మనుష్యులు   ఎందుకు  బాధతో , దు:ఖం తో   ఉంటారు ? ఎందుకు  ఆత్మ హత్యలు  చేసుకుంటారు ? 

జ . సాధారణంగా  మనుష్యులు  3 రకాల భావనలతో , ఆలోచనలతో ( కోరికలతో )  ఉంటారు . అవి ఏమంటే , ఏ వస్తువైనా , జీవి అయినా , అది  ' నాది ' , లేదా  'మనది ', లేదా   'అందరిది '. అని .
ఇక్కడ ,
01.  ' నాది ' అంటే ,  నా  ఇల్లు , నా  బైకు  , నా బిడ్డ , నా కొడుకు , నా భార్య  లేదా  నా  భర్త  అనే  భందం లో , నా స్వంతం  అనే భావనలో    ఉంటారు . తమకు  ఇష్టమైన   వస్తువులపై , కుటుంభ సభ్యులపై  అమితమైన ప్రేమతో  ఉంటారు .  నా వస్తువు  లేదా నా వారు  అనే స్వార్ధం  ఉంటుంది .  కుటుంభంలో తమను  గుర్తించాలి  , విలువను  ఇవ్వాలి  అని కోరుకుంటారు .   తాము  ఆ విధంగా భావించింది , తమకు కావాల్సింది , తాము కోరుకున్నది , తాము ఇష్ట పడినది ,  ఎప్పుడైతే  తమకు  కాకుండా పోతుందో  లేదా   కనపడకుండా  పోతుందో  లేదా  దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో  ఆలోచనలు  విపరీతంగా  వస్తుంటాయి  .  మనస్సు  ఒక చోట  స్థిమితంగా  ఉండదు .  మనిషికి  ఎనలేని  బాధ  కలుగుతుంది . దు:ఖం  పొంగి పొర్లు తుంది  . అదే రందితో మంచాన పడ  వలసి రావచ్చు .  అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే  గుండె పోటు   లేదా  పక్ష  వాతం రావచ్చు .  లేదా  మరి కొందరు  ఆత్మ హత్యలు  చేసు కోవచ్చు . దీనికి చక్కటి ఉదాహరణ  సినీ నటుడు  రంగనాథ్ గారు .  ఇక   మరి కొందరు , అసహనం  పెరిగి  అసాంఘీక  శక్తులుగా  మార వచ్చు .  దీనికి చక్కటి ఉదాహరణ  విద్యా వంతుడు  సాఫ్టవేర్  ఇంజినీర్  బల్బీర్ సింగ్ .  


 02. 'మనది ' అంటే , మన కుటుంభ సభ్యులది , మన స్నేహితులది , మన  కాంప్లె క్ష్  వారిది  లేదా మన కాలనీ వాసులది , లేదా మన ఉద్యోగులది , మన వర్గానికి   సంభందించినది  అనే భావన .  ' నాది ' అనేది  ఒక వ్యక్తికి  సంభందించిన దైతే   ' మనది ' అనేది   ఒక సమూహానికి సంభందించినది . ఇక్కడ కూడా , ఎప్పుడైతే  తాము  అనుకున్నది  జరుగ కుండా ,  కాకుండా పోతుందో  లేదా   కనపడకుండా  పోతుందో  లేదా  దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో  ఆలోచనలు  విపరీతంగా  వస్తుంటాయి  .  మనస్సు  ఒక చోట  స్థిమితంగా  ఉండదు .  మనిషికి  ఎనలేని  బాధ  కలుగుతుంది . దు:ఖం  పొంగి పొర్లు తుంది  . అదే రందితో మంచాన పడ  వలసి రావచ్చు .  అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే  గుండె పోటు   లేదా  పక్ష  వాతం రావచ్చు .  లేదా  మరి కొందరు  ఆత్మ హత్యలు  చేసు కోవచ్చు . దీనికి చక్కటి  ఉదాహరణ   ఈ మద్యనే  ఆత్మ  హత్య  చేసుకున్న  వేముల  రోహిత్ .   ఇక   మరి కొందరు , అసహనం  పెరిగి  అసాంఘీక  శక్తులుగా  మార వచ్చు . 


03. ఇక మూడోది  ' అందరిది ' . ' అందరిది ' అంటే  అందరూ  సమానంగా  అనుభవించాల్సింది .  ఇవి ముఖ్యంగా  ప్రభుత్వ ఆస్తులు  , సంపదలు  , వసతులు  , సంక్షేమ పధకాలు , విద్యా సంస్థలు , ఆరోగ్య సదు  పాయాలు , రక్షణ  మొదలైనవాటిని చెప్పుకోవచ్చు .  ఇక్కడ కూడా , ఎప్పుడైతే  తాము  అనుకున్నది  జరుగ కుండా ,  కాకుండా పోతుందో  లేదా   కనపడకుండా  పోతుందో  లేదా  దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో  ఆలోచనలు  విపరీతంగా  వస్తుంటాయి  .  మనస్సు  ఒక చోట  స్థిమితంగా  ఉండదు .  మనిషికి  ఎనలేని  బాధ  కలుగుతుంది . దు:ఖం  పొంగి పొర్లు తుంది  . అదే రందితో మంచాన పడ  వలసి రావచ్చు .  అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే  గుండె పోటు   లేదా  పక్ష  వాతం రావచ్చు .  లేదా  మరి కొందరు  ఆత్మ హత్యలు  చేసు కోవచ్చు . ఇక   మరి కొందరు , అసహనం  పెరిగి  అసాంఘీక  శక్తులుగా  మార వచ్చు . వీరు సాధారణంగా  లీడర్లు , జాతీయ  నాయకులై   ఉంటారు . వీరికి  చక్కటి ఉదాహరణ , మహాత్మా గాంధీ , మదర్ తెరిస్సా , గౌతమ బుద్దుడు ,           డా . అంభేద్కర్ , నెల్సన్ మండేలా , జయ ప్రకాష్ నారాయణ్ , వినోభా బావే , ఝాన్సీ లక్ష్మి భాయి , దుర్గా భాయి దేశ్ ముఖ్ , అల్లూరి సీతా రామా  రాజు , అన్నా హజారే  మొదలగు  ఎందరినో  చెప్పుకోవచ్చు .  

మంచి కాలమొస్తుందా ? మంచి పాలనొస్తుందా ?

ప్ర : మంచి కాలమొస్తుందా  ? మంచి పాలనొస్తుందా  ?


జ : పల్లవి :


మంచి కాల మొస్తుందనీ, మంచి పాలనొస్తుందనీ “2″అందరూ అనుకున్నారు క్రిష్ణ , క్రిష్ణా …. అంత మంచిదేమి కానే కాదు , బాబయ్యా ….అంత మంచిదేమి రానే లేదు , బాబయ్యా …. “మంచి కాల”


చరణం :1.
నల్ల ధనం రప్పిస్తామని, నరులకు ఇప్పిస్తామనీ “2″
వంద రోజులే గడువనీ , ఒట్టేసుకున్నారు, బాబయ్యా …..
అంతా ఒట్టిదాయి పాయే , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :2.
ఉద్యోగాలోస్తాయనీ , కొలువులే పెట్టిస్తామనీ “2″
చెత్త ఊడిపిస్తున్నారు , బాబయ్యా …..
చెత్త  పన్నూ  వేస్తున్నారు , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం:3.
ధాన్యమూ పండిస్తామనీ , ధరలూ తగ్గిస్తామని “2″
భూములన్నీ లాగు తుండ్రీ , బాబయ్యా …..
ధరలన్నీ పెంచుతుండ్రీ , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :4.
నిలువ నీడ లేక , జనులు అల్లాడి పోతుంటే “2″
భూమి సేకరణకు సభలో , బిల్లు పెట్టిరీ , బాబయ్యా …..
నల్లదనం తెల్లజేయ , పోటీ పడుతున్నారు , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :5.
పెట్టు బడులనీ , గిట్టు బాటు ఆవు తుందనీ “2″
పట్టు పరుపులు వేసిరీ , బాబయ్యా …..
వారు దేశాన్ని, ఒక్క రోజులోనే ఊడ్చిరి , అన్నయ్యా ……. “మంచి కాల”
( తేది .06.05.2015, 2.89 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో )

చరణం :6
జన ధన్ స్కీం అనీ , ఉచిత భీమా అనీ “2″
ఐదు వేల అప్పిస్తామనిరీ , బాబయ్యా …….
నేడు భీమాలకు కాసులు కట్టమనిరీ , అన్నయ్యా …….. “మంచి కాల”

Friday, January 15, 2016

. మేయర్ ఎన్నికలలో ' విప్ ' జారీ చేయ వచ్చా ? విప్ జారీ చేసినా వేరే అభ్యర్దికి ఓటు వేయ వచ్చా ?

ప్ర . మేయర్ ఎన్నికలలో  ' విప్ '  జారీ  చేయ వచ్చా ?  విప్ జారీ చేసినా   వేరే అభ్యర్దికి ఓటు వేయ  వచ్చా ?

జ . మేయర్ ఎన్నికలలో  ' విప్ '  జారీ  చేయ వచ్చు .  విప్ జారీ చేసినా   వేరే అభ్యర్దికి ఓటు వేయ  వచ్చు . కాని  ఆ పార్టీ  అనర్హత  వేటు వేయ వచ్చు . 

కార్పోరేటర్లు గా పోటీ చేసే అభ్యర్దుల వ్యయ పరిమితి ఎంత ?

ప్ర . కార్పోరేటర్లు గా  పోటీ చేసే  అభ్యర్దుల  వ్యయ పరిమితి  ఎంత ?

జ . కార్పోరేటర్లు గా  పోటీ చేసే  అభ్యర్దుల  వ్యయ పరిమితి 5 లక్షలు . నామినేషన్  వేసే రోజు నుండి లెక్క గడుతారు.  ప్రత్యేకమైన  బ్యాంకు అకౌంట్ నుండే ఖర్చు పెట్టాలి . అలానే  ఎన్నికైన  45 రోజులలో  ఎన్నికల సంఘానికి  ఆ ఖర్చు వివరాలను  పంపించాలి . ఎన్నికల అధికారులు  సేకరించిన  ఖర్చుల మొత్తానికి  సరి చూసి  నిర్ణయం  తీసుకుంటారు . ఒక వేల  మొత్తం ఖర్చు 5 లక్షలకు  మించితే  అనర్హత వేటు వేస్తారు . 

మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది ?

ప్ర  మేయర్  ఎన్నిక  ఎలా జరుగుతుంది ?

జ .  150 డివిజన్లలో   ఎన్నికైన  కార్పోరేటర్లు , అక్కడి  ఎంపీలు , ఎం . ఎల్ . ఎ . లు , ఎం . ఎల్ . సి . లు , ( వీరిని  ఎక్ష్ అఫీసియో  మెంబర్లు  అంటారు ) , కల్సి  చేతులు  ఎత్తడం ద్వారా  ' మేయర్ '  ను  , ' ఉప మేయర్ ' ను  ఎన్నుకుంటారు . వీరి పదవీ కాలం 4 సంవత్సరాలు . 

ప్రస్తుతం జి . హెచ్ . ఎం . సి . (GHMC) ఎన్నికలలో మహిళల రిజర్వేషన్ శాతం ఎంత ?

ప్ర . . ప్రస్తుతం  జి . హెచ్ . ఎం . సి . (GHMC)  ఎన్నికలలో  మహిళల రిజర్వేషన్  శాతం ఎంత ?

జ . . ప్రస్తుతం  జి . హెచ్ . ఎం . సి . (GHMC)  ఎన్న్కిలలో  మహిళల రిజర్వేషన్  50%.  అనగా  75 సీట్లు అన్న మాట . 

జి . హెచ్ . ఎం . సి . (GHMC) మేయర్ ఎన్నికలు సాధారణంగా ఎన్ని సంవత్సరాల కొక సారి జరుగుతాయి ?

ప్ర . జి . హెచ్ . ఎం . సి . (GHMC)  మేయర్  ఎన్నికలు  సాధారణంగా  ఎన్ని సంవత్సరాల కొక సారి జరుగుతాయి ?

జ .   జి . హెచ్ . ఎం . సి . (GHMC)  మేయర్  ఎన్నికలు  సాధారణంగా  4  సంవత్సరాల కొక సారి జరుగుతాయి . 

Thursday, January 14, 2016

' ఆస్తికులు ' అంటే ఎవరు ? ' నాస్తికులు ' అంటే ఎవరు ?

ప్ర . ' ఆస్తికులు ' అంటే  ఎవరు ? ' నాస్తికులు ' అంటే  ఎవరు ?

జ .  లోకం లో  మానవులు  మూడు  భిన్న నమ్మకాలతో జీవించు వారు  ఉన్నారు . ' దేవుడు ' ఉన్నాడని  పూర్తిగా  నమ్మే వారు కొందరున్నారు . ' దేవుడు ' లేడు  అని   పూర్తిగా నమ్మే వారు కొందరున్నారు . ' దేవుడు '   ఉన్నాడో  లేడో   తెలియదు  అని   మద్యస్థంగా  ఉండే  వారు  మిగిలిన వారు .  ' దేవుడు ' ఉన్నాడు  అని పూర్తిగా  నమ్మే వారిని   ' ఆస్తికులు ' అని అంటారు .  ' దేవుడు ' లేడు  అని  పూర్తిగా  నమ్మే వారిని ' నాస్తికులు ' అని అంటారు . 

' లోకజ్ఞ్యానం ' అంటే ఏమిటి ?

ప్ర . ' లోకజ్ఞ్యానం ' అంటే ఏమిటి ?

జ . ' లోకజ్ఞ్యానం ' అంటే లోకం తీరు తెలుసుకోవడం . లోకం పోకడ తెలుసుకోవడం . లోక గమనాన్ని  తెలుసుకోవడం . మనకో నానుడి  తెలుసు " నీరు పల్లమెరుగు , నిజం దేవుడెరుగు "  అని . పల్ల మంటే వంపుగా  ఉన్న భూమి . నీరు  సులువుగా ప్రవహించాలంటే, అది  భూమి పల్లం గురించి తెలుసు కోవాలి  . అలానే  నిజమేదో , అబద్ద  మేదో  సులువుగా  తెలుసుకోవడం  , కేవలం  దేవుడికే  సాధ్యం , అని దీని భావం . 
అలానే  మనిషి  సులువుగా ఎదుగాలంటే  , కష్టం  ఒక్కటే సరి పోదు . సమాజం  పోకడ ,  రాజకీయాలు  , చట్టాలు , కాలం  , తోటి  మనుష్యులు  ఎదుగు  తున్న తీరు , కులాలు , మతాలు , ప్రాంతాలు ,   ప్రభుత్వమందించే సంక్షేమ  పధకాల గురించి  అర్ధం  చేసుకోవాలి .  మనిషి  సాఫీగా  జీవనం  సాగించ డానికి , వీటన్నిటిని  తెలుసుకోవడమే   
' లోకజ్ఞ్యానం '. 

బస్సులలో చిల్లర సమస్యకు పరిష్కార మేమిటి ?

ప్ర .  బస్సులలో  చిల్లర  సమస్యకు  పరిష్కార మేమిటి ?
జ . చిల్లర డబ్బుల గురించి  కండక్టర్ కు ,  ప్రయాణికులకు మద్య  ప్రతి బస్సులో , ప్రతి రొజూ గొడవే  . ఒక్కో సారి అది ఎంతకు  దారి తీస్తుందంటే , బస్సుల నిలిపి  వేసే వరకు  , కొట్టుకునే వరకు , కత్తి పొట్ల వరకు వెలుతున్నది ,  దీని వలన  అర్జంటుగా  ఆఫీసులకు  వెల్ల వలసిన  ప్రయాణికులకు  చాలా ఇబ్బంది అవుతుంది . కండక్టర్లు  భయం భయం గా  డ్యూటీ  చేయాల్సి  వస్తుంది . మరికొందరు  ప్రయాణికులు  , మా చిల్లర డబ్బులను  కావాలని కండక్టర్లు  ఇవ్వడం లేదని  వాపోతున్నారు . ప్రయాణికులకు  మతి మరుపు ఎక్కువ అని , గమ్యం చేరడమే  ముఖ్యంగా  భావిస్తారని , కొందరు కండక్టర్లు  కూడా కావాలనే  చేతి  వాటాన్ని ప్రయోగిస్తున్నారు .  
  
బస్సులలో  అన్ని రకాల   చిల్లర సమస్యలకు   చక్కటి  పరిష్కారం , అన్ని రకాల బస్సు టికట్లను  రూ .లు . 5/- , 10/-  , 15/- , 20/- ,  మరియు  25/- కి దగ్గరగా  సరి చేయాలి . ఉదా : రూ  . లు . 6/- , 7/- ఉన్న వాటిని రూ . లు 5/- గాను  ,  రూ  . లు . 8/- , 9/- ఉన్న వాటిని రూ . లు 10/- గాను , సరి చేయాలి . అలానే మిగిలిన వన్నీ  సరి చేయాలి . దానికి తోడు  , అవసరాన్ని బట్టి   రూ . లు . 5/-  టోకెన్లను  , అన్ని బస్సులలో  , మీ సేవలలో  చెల్లే  విధంగా  అందుబాటులో  ఉంచాలి . ప్రయాణికులు కూడా  సహకరించాలి . అప్పుడే  బస్సులలో  చిల్లర  సమస్యకు   ఈ  పరిష్కారం  విజయ వంత మవుతుంది .  

ద్రవ్యోల్భణం అనగా నేమి ? ద్రవ్యోల్భణం మదింపు సామాన్యులకు కూడా అర్ధం కావాలా ?

ప్ర . ద్రవ్యోల్భణం అనగా నేమి ?  ద్రవ్యోల్భణం మదింపు సామాన్యులకు కూడా అర్ధం కావాలా ?

జ .  ద్రవ్యోల్భణం అనగా  క్లుప్తంగా  చెప్పాలంటే  వస్తువుల  ధరలలో  హెచ్చు తగ్గులు . వస్తువుల ధరలు  పెరుగుతే ద్రవ్యోల్భణం  పెరిగిందని  , ధరలు తగ్గుతే  ద్రవ్యోల్భణం తగ్గిందని  ఒక సూచీ ద్వారా  తెలియ జేస్తారు . 

 నేడు ద్రవ్యోల్భణం మదింపు విధానం చదువుకున్న వారికి కూడా అర్ధం కావడం లేదు . సాధారణంగా ద్రవ్యోల్భణం పెర్గింది అంటే , 'ధరలు పెరిగాయి' అని అర్ధం . అలానే ద్రవ్యోల్భణం తగ్గిందంటే ' ధరలు తగ్గాయి ' అని అర్ధం .
కాని అప్పుడప్పుడు ద్రవ్యోల్భణానికి  సంభందించి ప్రకటించే అంకెలు , వాస్తవ ధరలను ప్రతి బింభించడం లేదు . ద్రవ్యోల్భణం రోజు రోజుకు తగ్గి నట్లు ప్రకటిస్తున్నారు . కాని ధరలు పెరుగుతూనే ఉన్నాయి . 
ఉదా : 3 నెలల క్రితం రూ .లు 10/- నుండి 15/- కు కిలో లభించే ఉల్లి గడ్డలు నేడు , రూ .లు .50/- నుండి 70/- మధ్యన లభిస్తున్నాయి . రూ .లు 100/- నుండి 115/- కు కిలో లభించే కంది పప్పు నేడు , రూ .లు .150/- నుండి 160/- మధ్యన లభిస్తున్నది . రూ .లు 30/- నుండి 35/- కు కిలో లభించే బియ్యం నేడు , రూ .లు 40/- నుండి 50/- మధ్యన లభిస్తున్నాయి . ఇక కూర గాయాలు ఏవి కిలో రూ . లు 40/- కంటే తక్కువగా దొరకటం లేదు . డిజిల్ , పెట్రోల్ ధరలు రూ .లు . 1/- తగ్గుతే   రూ.లు 2/- పెరుగుతున్నాయి . మెడిసిన్ల ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి .ఇలా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి . కాని తగ్గడం లేదు . అలాంటప్పుడు ద్రవ్యోల్భణం తగ్గి నట్లు గా ఎలా ప్రకటిస్తారు . ద్రవ్యోల్భణం మదింపుకు చిల్లర వర్తకుల ధరలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అవి సామాన్యులకు కూడా అర్ధం కావాలి . అలానే బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పరిస్థితులను బట్టి తగ్గించాలి కాని డిపాజిట్లపై వడ్డీ రేట్లు 8% కంటే తగ్గ కూడదు .

ద్రవ్యోల్భణం అంకెలను చూసి ప్రజలు పెద్దగ ఇబ్బంది పడరు . కాని ద్రవ్యోల్భణం అంకెల ఆధారంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన ఫైనాన్సియిల్ మార్కెట్లు అతలా కుతులం అవుతున్నాయి . ఉదా : షేర్ అర్కేట్ కావచ్చు . మనీ మార్కెట్ కావచ్చు . బ్యాంకింగ్ వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం కావచ్చు . ప్రభుత్వాలు తీసుకునే ఇతర విధాన పరమైన లేదా పాలనా పరమైన నిర్ణయాలు కావచ్చు . అప్పుడు ప్రజలు ఇబ్బందికి గురి అవుతుంటారు . అందుకని ఆర్. బి. ఐ. కి స్వయం ప్రతి పత్తిని కంటిన్యూ చేయాలి.

రైతులు ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండ డానికి శాశ్విత పరిష్కారాలున్నాయా ?

ప్ర . రైతులు ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండ డానికి శాశ్విత పరిష్కారాలున్నాయా ?
      ***********************************************************************************
జ . " పల్లె సీమలే దేశానికి పట్టు గొమ్మలు" , "వ్యవసాయానికి వెన్నెముక రైతు" అన్నాడు మన మహాత్ముడు గాంధీజీ గారు . 'జై జవాన్ ! జై కిసాన్ !' అనే నినాదమిచ్చారు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు .'జై జవాన్ ! జై కిసాన్ !, జై విజ్ఞ్యాన్ ' అనే నినాదమిచ్చారు మన మాజీ రాష్ట్ర పతి డా . అబ్దుల్ కలాం గారు . ఇక్కడ మనం ముఖ్యంగా గమనిచాల్సింది ఏమంటే , కిసాన్ ( రైతు ) కు మన నాయకులు ఎంతటి గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇచ్చారు అని .

అందుకనే , సుమారుగా 70% ప్రజలు ఆధారపడిన మన వ్యవసాయ రంగానికి , దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత , మొదటి పంచవర్ష ప్రణాళికలలో (1951) , వ్యవసాయ రంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది .వ్యవసాయ రంగాన్ని , అన్న ధాతలైన రైతులను రక్షించు కోవాలనీ , వ్యవ సాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనీ ఆనాడే గుర్తించారు . 
అలాంటిది ప్రపంచీకరణ, ప్రవీటీకరణ , సరళీకరణ కారణంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్షం చేస్తూ వస్తున్నారు . రాను రాను స్వార్ధం పెరిగి , అవినీతి పెరిగి , కుంభకోణాలు పెరిగి , నల్లదనం పెరిగి , నేడు రోజుకు 5 నుండి 10 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకునే స్థాయికి వ్యవసాయ పరిస్తితి , రైతుల పరిస్థితి దిగ జారింది . స్వాతంత్ర్యం వచ్చి 68 సం. రాలు దాటినా , రైతు వర్గం కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే మిగిలి పోయింది . అందుకే ఓట్లు కావాల్సిన వారందరూ ఒకే సారి మొసలి కన్నీరు కార్చ డానికి పోటీలు పడుతున్నారు .

ప్రభుత్వాలు మారినా , పార్టీలు మారినా , నాయకులు వారే కాబట్టి , ఒక ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వం నిందించుకోవడం వలన రైతులకు లభించే ప్రయోజనం శూన్యం . సమయం వృధా , మరిన్ని రైతుల ఆత్మ హత్యలు పెరుగుతాయి తప్పా మరేమీ జరుగదు .
రుణ మాఫీ అనేది ఎన్నికల హామీ కాబట్టి , దానిని నెరవేర్చాలి కాని , దీనిని కంటిన్యూ చేయ కూడదు . రైతులకు చెల్లించే నష్ట పరిహారం రూ . లు . 1.5 లక్షల నుండి రూ . లు . 6 లక్షలకు పెంచిన తరువాత , రోజు కు 10 నుండి 13 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారంటే , రేపు పది లక్షలు ఇచ్చినా రైతుల ఆత్మ హత్యలు పెర్గుతాయే తప్పా తగ్గవు . అంతే కాదు మరో వర్గం నుండి పోటీ రావచ్చు . అందుకని లోతుగా కారణాలు విశ్లేషించాలి . వాటికనుగునంగా మార్పులు చేయాలి .

రైతులకు చెల్లించ దలిచిన డబ్బును అందరికి ఉపయోగ పడే విధంగా , శాశ్విత పరిష్కారాలకు ఉపయోగించాలి . ఉదా : చెరువులలో పూడికలు తీయించడం , నదులను, కాలువలను అనుసంధానం చేసి , సాగు నీరు , త్రాగు నీరు అందించడం , నిరంతర విద్యుత్తు అందించడం , గిడ్డంగులు కట్టించడం , నాణ్యమైన ఎరువులు , విత్తనాలు లభింప చేయడం , రోడ్ల విస్తరణ , ఆరోగ్య సదుపాయాలు మెరుగు పరచడం , మార్కెటింగ్ , గిట్టుబాటు ధర కల్పించడం మొ నవి . చేయాలి . తెలంగాణలో మన ముఖ్య మంత్రి 'కె . సి . ఆర్' గారు ప్రారంభించిన పధకాలు ' జల హారం ', ' హరిత హారం ', 'మిషన్ కాక తీయ ', ' గ్రామా జ్యోతి ' , ' పవర్ గ్రిడ్ ' మొ . నవి , వ్యవ సాయ రంగానికి (రైతులకు ) శాశ్వితమైన అద్భుతమైన పధకాలు.
రైతులు ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండ డానికి శాశ్విత పరిష్కార మార్గాలు :
---------------------------------------------------------------------------------
01. మొదట ఏయే గ్రామాలలో రైతుల ఆత్మ హత్యలు జరుగుతున్నాయో గుర్తించాలి .
02. ఆ పరిధి లోని ఎం .ఎల్. ఎ . లు , ఎం . పి . లు సర్పంచులు , సామాజిక వేత్తలు , విద్యా వంతులు , రైతు సంఘ నాయకులు , అధికారులతో కమిటీలు వేసి , రైతుల ఆత్మ హత్యలకు ఖచ్చితమైన కారణాలు గుర్తించాలి .
03. ఖచ్చితమైన కారణాల ఆధారంగా సంభందిత వ్యక్తులపై చర్యలు తీసు కోవాలి . అలానే మరో రైతు ఆత్మ హత్య చేసుకోకుండా నివారణ చర్యలు తీసుకోవాలి .
04. రుణ మాఫీ , నష్ట పరిహారాలు , సబ్సిడీలు మొ నవి . శాశ్విత పరిష్కార మార్గాలు కావు . అందుకని శాశ్విత పరిష్కార మార్గాల కొరకు అన్వేషించాలి .
05. ఎక్కువమంది రైతులు బోరు బావుల వలననే , అప్పులు ఎక్కువై ఆత్మ హత్యలు చేసుకున్నారని అంటున్నారు . దీనికి పరిష్కార మార్గం రైతులచే బోరులు త్రవ్వించ కుండా , ప్రభుత్వాలే శాస్త్ర పరిజ్ఞ్యానంతో నీరు పడే చోట సబ్సిడీతో దీర్ఘ కాలిక , శాశ్విత బోరులు త్రావ్వించాలి . లేదా చెరువుల పూడిక తీయడం ద్వారా , కాలువల అనుసంధానం ద్వారా , సాగు నీరు అందించ గలగాలి . డ్యాములు , ప్రాజెక్టులు కట్టి నీటిని నిలువచేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయాలి , సాగు నీరుగా వాడు కోవాలి . 
06. దీర్ఘ కాలిక, శాశ్విత రోడ్లను వేయాలి .
07. నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి .
08. వడ్డీ వ్యాపారస్తులను పూర్తిగా నిషేదించి , తక్కువ వడ్డీ తో రైతులకు రుణాలు అందించాలి . పంటలు పండ నప్పుడు , రుణాలను వడ్డీని , ఆ తరువాయి కాలంలో చెల్లించే వెసులు బాటు చేయాలి .
09. ప్రస్తుత రుణ మాఫీ , నష్ట పరిహారం నేరుగా , రైతుల , కౌలు దారుల బ్యాంక్ అకౌంట్ లోకే జమ కావాలి . అది కూడా ఇన్ టైం లోనే జరుగాలి .
10. సక్రమంగా నష్ట పరిహారం చెల్లించే పంటల భీమా పథకాలను ఏర్పాటు చేయాలి . 
11. పండించిన పంటలను , ధర వచ్చి నప్పుడు అమ్ముకునే వీలుగా దీర్ఘ కాలిక , శాశ్విత గిడ్డంగులను ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి .
12. మధ్య దళారులను నిషేదించాలి .
13. గ్రామాలలో ఆరోగ్య సదుపాయాలను , సాంకేతిక సదుపాయాలను , ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకుని రావాలి .
14. వ్యవసాయ శాస్త్ర వేత్తలు , రైతులకు ప్రతి రోజు 10 గంటలు అందుబాటులో ఉండాలి .
15. నాన్య మైన ఎరువులు , విత్తనాలు సమయానికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి .
16. లాభ సాటి పంటలకు మరియు తక్కువ కాలంలో పండే పంటలకే ప్రాధాన్యత ఇప్పించాలి .
17. వ్యవ సాయపు పనులు లేని సమయాలలో , ఉపాధి సదుపాయాలూ కల్పించాలి .
18. కల్తీ మద్యాన్ని , కల్తీ కల్లును గ్రామాలలో పూర్తిగా నిషేదించాలి .
19. ఇప్పుడు రైతులకున్న అప్పులు ఏమిటో తెలుసుకుని , దానికి పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి 
20. వ్యవ సాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలి .
21. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను గ్రామాలలో ఏర్పాటు చేసి యువతకు ఉపాది కల్పించాలి . రైతులకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి .
22. రాష్ట్రం లోని నిజమైన రైతులకు , కౌలు దారులకు , గీత , నేత కార్మికులందరికీ ఉచితంగా సమూహ భీమా ను కల్పించాలి . ఆరోగ్య కార్డులను జారీ చేయాలి . ఆర్ధిక భద్రతను కల్పించాలి .
23. భూ స్వాములను , ధన వంతులను గ్యాస్ సబ్సిడీ వదులు కున్నట్లుగా నే , రుణ మాఫీ , నష్ట పరిహారం , సబ్సీడీలను వదులు కునే విధంగా ఒప్పించాలి .
24. ధన వంతులను , పేదలను గుర్తించే సాఫ్టవేర్ ను అభి వృద్ధి చేసి భూ స్వాములకు , ధన వంతులకు రుణ మాఫీ , నష్ట పరిహారం , సబ్సీడీలను పూర్తిగా రద్దు చేయాలి . 
25. గ్రామాలలో రైతులు ( పేద ప్రజలు ) మరే విధంగా నష్ట పోతున్నారో క్షున్నంగా పరిశోధించాలి . గ్రామాలలో ప్రయివేటు చిట్టీలను , లాటరీలను , స్కీములను , మద్యాన్ని , ధూమ పానాన్ని , ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ప్రభుత్వమే నిషేదించాలి . 
26. పోరాడి సాదించు కోగలమనే మనో బలాన్ని రైతుకు కల్పించాలి .
27. రైతులకు ఆర్ధిక బరోసాను కల్పించే వ్యక్తిగత భీమాను , పంటల భీమాలను , పెంపుడు జంతువుల , పక్షుల భీమాలను కల్పించాలి . 
28. ప్రధాన మంత్రి మోడీ గారు ప్రతి పాదించిన ' జన ధన్ యోజన స్కీం ' ద్వారా ప్రతి రైతుకు బ్యాంక్ అకౌంట్ ను కల్పించాలి . అలానే ప్రధాన మంత్రి మోడీ గారు ప్రతి పాదించిన ఇన్స్యురెన్స్ మరియు పెన్షన్ స్కీం లయిన ' సురక్షా బీమా యోజన ' స్కీం క్రింద రూ . లు 12/- ను మరియు ' జీవన జ్యోతి యోజన ' స్కీం క్రింద రూ . లు 330/- లను ,( మొత్తం కలిపి కేవలం రూ లు . 342/-) రాష్ట్ర ప్రభుత్వాలే నిజాయితీ గా చెల్లించి , రైతులకు ఆర్ధిక బరోసాను కల్పించాలి .
29. ఓటుబ్యాంక్ రాజ కీయ విధానాలను శాశ్వితంగా ప్రక్కన పెట్టాలి .
30. ఇన్ని చేసినను రైతులు అప్పుల పాలై , ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారంటే , ప్రభుత్వమే నిపుణులైన , కష్ట పడే తత్వం గల రైతులచే , ప్రతి గ్రామానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి , రైతులందరినీ ఒప్పించి అన్ని భూములను ఈ సంఘ రైతులచేత సాగు చేయించాలి . ఆ భూముల్లో అందరి రైతులకు 365 రోజులు పని కల్పించాలి . అలానే భూమికి తగ్గా ఆదాయం దామాషా పద్ధతిలో ప్రతి రైతుకు చెల్లించాలి . బ్యాంకు అప్పులతో , కరెంట్ . సాగు నీరు , నకిలీ విత్తనాలు , ఎరువులతో , మార్కెటింగ్ తో మరియు ఏ పంట వేయాలి అనే విషయంలో కూడా రైతు లకు సంబంధం ఉండ కూడదు . ఈ విధంగా చేయడం వలన ఉత్పత్తి పెరుగుతుంది . ఖర్చు ఆదా అవుతుంది . ప్రకృతి వైపరీత్యాలనుండి తట్టుకునే శక్తి కలుగు తుంది . రైతులకు ఆర్ధిక బరోసా కలుగుతుంది . భూములన్నీ రైతుల పేరుమీదనే ఉంటాయి . రైతులు అప్పుల పాలయ్యే అవకాశం లేదు కాబట్టి , ఆత్మ హత్యలు చేసుకోరు .
31. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఉండాలి . క్రొత్త క్రొత్త ఆలోచనలతో , కాలానుగునంగా మార్పులు చేస్తూ ఉండాలి .

కొలీజియం అంటే ఏమిటి ? న్యాయ వ్యవస్థకు స్వతంత్ర అధికారం అవసరమా ?

ప్ర . కొలీజియం" అంటే ఏమిటి ? "న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం అవసరమా ?
       ************************************************************************
జ . న్యాయ వ్యవస్థలో ప్రస్తుతమున్న " కొలీజియం " విధానాన్నే కొన సాగించాలి .

అసలు " కొలీజియం" అంటే ఏమిటి ? నలుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తుల ధర్మాసనం సూచనతో , సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి , న్యాయ వ్యవస్థ లోని వారినే సుప్రీం కోర్ట్ , రాష్ట్ర హై కోర్టుల న్యాయ మూర్తులుగా నియమిస్తారు . న్యాయ మూర్తుల నియామకాలనే కాకుండా , ట్రాన్స్ఫర్ ల ను మరియు ప్రమోషన్లను చేపడుతారు . దీనికి గవర్నరు , రాష్ట్ర పతి ఆమోద ముద్ర తప్పని సరి. ఈ నలుగురు సభ్యులలో అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు తప్పా ఇతర వ్యవస్థ ల లోని సభ్యులు ఎవ్వరూ ఉండరు .
అయితే ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా తీసు కొచ్చిన కొత్త విధానం ఏమంటే , న్యాయ మూర్తుల నియామకాలను పార దర్శకంగా , విశాల ప్రాతి పదికన చేపట్టడానికంటూ " జాతీయ న్యాయ నియామకాల కమీషన్ " (ఎన్. జె . ఎ . సి . ) ని ఏర్పాటు చేశారు . న్యాయ శాసన వ్యవస్థల నుండే కాకుండా , పౌర సమాజం నుంచి , పార్ల మెంటరీ వ్యవస్థ నుండీ ప్రజా ప్రతినిధులు ఉంటారు . అనగా ఇందులో , సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి , ఇరువురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు , న్యాయ శాక మంత్రి మరియు ఇరువురు ఉన్నత మైన మేధావులు ( వీరిని సూచించే వారిలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి కూడా ఉంటాడు .) దీనిని సుప్రీం కోర్ట్ 16.10.2015 న కొట్టివేసింది .

సుమారుగా 70% అనేక కులాల , మతాల , ప్రాంతాల , దేశాల సామాన్య ప్రజలున్న భారత దేశంలో , వారు కొంత వరకైనా ధైర్యంగా, ప్రశాంతంగా , ఆత్మాభిమానంతో జీవించాలంటే , న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం ఉండ కూడదు . కొందరంటారు , రాజకీయ నాయక సభ్యులు కేవలం సూచనలు చేస్తారు , మిగిలిన సభ్యులు నచ్చక పోతే వ్యతిరేకించ వచ్చు,అని . ఇక్కడే ఒక గొప్ప తిరకాసు ఉంది . ఆ రాజకీయ నాయకుడి సభ్యుడి వెనుకాల , మొత్తం కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాల పాలకులు ఉంటారు . వారి వద్ద ఎంతటి అధికారం , డబ్బు బలం ,కార్య కర్తల బలం ఉంటుందో అందరికి తెల్సిన విషయమే . అలాంటప్పుడు , ఆ రాజకీయ సభ్యుడి సూచనను వ్యతిరేకించే దమ్ము , ధైర్యం ఎవరికీ ఉంటుంది చెప్పండి . కనీసం ఇప్పుడు కోర్టు తీర్పులను గౌరవిస్తున్నారు , పాటిస్తున్నారు . విమర్శించే సాహాసం కూడా ఎవ్వరూ చేయడం లేదు
కాని రేపు అలా ఉండదు . ప్రతి తీర్పు విమర్శకు తావు ఉంటుంది . రాజకీయ సభ్యుల సూచనలను వ్యతిరేకించే ఇతర సభ్యులు బిక్కు బిక్కున బ్రతుకాల్సి ఉంటుంది . న్యాయ మూర్తులకు తీర్పులు నచ్చక స్వచ్చంద విరమణ చేయ వచ్చు . అప్పుడు వ్యవస్థ మరల తిరోగమన దశలో నడువ వచ్చు ." కొలీజియం " విధానంలో ఏమైనా లోపాలు ఉంటే సూచనలు చేయ వచ్చు . సవరణలు చేయ వచ్చు . న్యాయ మూర్తులను నియామకం చేసే అత్యంత సీనియర్ న్యాయ మూర్తులను ప్రభుత్వాలు సిఫారస్ చేయ వచ్చు . కాని ఎట్టి పరిస్థితులలోనూ న్యాయ వ్యవస్థలో , ఎన్నికల సంఘంలో , రిజర్వు బ్యాంకులో మరియు అన్ని నియంత్రణ సంస్థలలో రాజకీయ నాయకులకు సభ్యత్వం ఉండ కూడదు . వీటికి స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలి . అలా అని , ఏ వ్యవస్థను , ఏ సార్వ భౌమాదికారాన్ని కించ పరిచినట్లు కాదు . వేటి పరిధి వాటివే . వేటి అధికారాలు వాటివే .వేటి భాధ్యతలు వాటివే . వేటి గౌరవాలు వాటివే .
1000 కోట్ల కుంభ కోన దారులకు అత్యధికంగా 7 సంవత్సరాలు శిక్ష విధిస్తే ,100 రూపాయల దొంగలకు ఎన్నోరెట్లు మానసిక , శారీరక శిక్షలుంటున్నాయి . 1000 కోట్ల నల్ల ధన కుభేరులను ఏ . సి .లో , విచారిస్తే , 100 రూపాయల దొంగలను థర్డ్ డిగ్రీతో విచారిస్తున్నారు . పొట్ట కూటి కోసం చేసే 100 రూపాయల దొంగలకు వెంటనే శిక్షలు పడుతే , తర తరాల కోసం దాచిపెట్టే 1000 కోట్ల అవినీతి పరులకు యేండ్ల తరబడి శిక్షలుండవు . ఈ లోగా మల్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు . గెలుస్తారు .
ఎవ్వరైనా పనిచేసేది 12 గంటలే . ఎవ్వరైనా తీసుకునేది ఆహారమే . ఎవ్వరికైనా ఉన్నవి రెండే చేతులు , రెండే కాళ్ళు , ఒకటే శిరస్సు , ఒకటే మొండెం . కాని కొందరే కొద్ది కాలం లోనే కోట్లకు పడగలెత్తు తున్నారు . మరికొందరు జీవితాంతం పేద రికంలోనే మ్రగ్గు తున్నారు , బిక్షాటనే చేస్తున్నారు . అదే అక్రమంగా సంపాదించే వారు కోట్లల్లో సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు . నిజాయితీ పరులు దినమొక గండంగా కాలం వెల్లదీస్తున్నారు . ఎక్కడుంది లోపం ? కనిపెట్టడం ఎలా ? అరికట్టడం ఎలా ? నల్ల ధనం దేశంలో , విదేశాలల్లో లక్షల కోట్లు అనుత్పాదక శక్తి గా మ్రగ్గు తుంది . ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థకు , స్వతంత్రత లేకుండా చేయడ మంటే ప్రజా స్వామ్యాన్ని బలహీన పరచడమే అవుతుంది .
అందరికి సమాన న్యాయం అందాలంటే , ఇప్పుడున్న " కొలీజియం " విధానం లో నేటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని వ్యవస్థల , ప్రజల సూచనలు , సలహాలతో మరిన్ని మార్పులు చేయ డానికి అవకాశం ఉండాలి . మరిన్ని మార్పులు చేయాలి . సామాన్య పేద ప్రజలకు రక్షణ కల్పించాలన్నా , అవినీతి పరుల , నల్ల ధన కుబేరుల ను శిక్షించాలన్నా , న్యాయ వ్యవస్థలో , రాజ కీయ నాయకుల ప్రవేశం ఉండ కూడదు . ప్రస్తుతం అనేకమైన అసాంఘీక శక్తులకు , అవినీతి పరులకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తుంది . ఎలాగో అలాగా డబ్బు ఎగజల్లి గెలుస్తున్నారు . ఎన్నికల సమయంలో డబ్బు దొరికినా ఎవరికీ శిక్షలు పడిన దాఖలాలు లేవు . డబ్బు ఎగజల్లిన వారు , దానిని వడ్డీతో సహా పది రెట్లు అధికంగా సంపాదించు కోవాలని చూస్తున్నారు . ఏదో విధంగా గెలిచినా వారు , ప్రజలకు తెలియ కుండానే శాషనాలు చేస్తున్నారు . దానిని ప్రజలపై రుద్దు తున్నారు . రాష్ట్ర పతి ఎన్నికలకు విప్ లు జారి చేస్తున్నారు . ఇలాంటి కాలంలో , సామాన్య పేద ప్రజలకు , ఒకే ఒక దిక్కుగా ఉన్న , జుడీష్యరీ వ్యవస్థలో కూడా , రాజకీయ నాయకులు ప్రవేశిస్తే , సామాన్య పేద ప్రజల భవష్యత్ ఏమౌతుందో మేధావులు ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి . సుప్రీం కోర్ట్ తీర్పును వ్యతిరేకించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో , సమర్ధించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో క్షున్నంగా పరిశీలించాలి . అప్పుడు విషయం భోధ పడుతుంది . కేవలం ఒకే ఒక పాయింట్ , రాజ్యాంగ బద్ధమైన కమీషన్ అని కాకుండా , మెజార్టీ ప్రజల భవిష్యత్ , ఆర్ధిక అసమానతలు , అవినీతిని , నల్లదనాన్ని అరి కట్టే మార్గాలు అదో గతి పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది . అధికారం చేతికి రాగానే దేశం లోని , రాష్ట్రాల లోని సంపద అంతా పాలకులది గానే భావించే రోజులు పోవాలి . ప్రభుత్వ ఉద్యోగం రాగానే మాదే అధికారం అనుకునే కాలం మారాలి . ఇలాంటి విషయాలలో కట్టడికి న్యాయ వ్యవస్థ లో మార్పులు తీసుకుని రావాలి . సాధారణంగా , సామాన్యులకు , పేదలకు శిక్షలుండ కూడదు . కుంభ కోన దారుల , నల్ల ధన కుభేరుల , అవినీతి పరులకు సత్వర ఖటిన పారదర్శకమైన శిక్షలు విదిస్తూ , సామాన్యుల , పేద వారిలో ఒక భయానక వాతా వరణాన్ని క్రియేట్ చేయాలి . అప్పుడు అందరూ భయ పడుతారు . ఎవ్వరూ తప్పులు చేయరు . దేశ మంతటా విశ్రాంత న్యాయ మూర్తులచే న్యాయ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి . ఈ విధంగా చేయడం వలన కోర్టుల్లో కేసులు కూడా తగ్గుమొఖం పడుతాయి . న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే , అంత పేద , సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది . భద్రత లభిస్తుంది . సుఖ సంతోషాలు లభిస్తాయి . ధైర్యముంటుంది . లేదంటే రాజకీయ నాయకులదే , వారి కార్య కర్తలదే , బలమున్న వారిదే, అవి నీతి పరులదే , బడా అక్రమ వ్యాపార వేత్తలదే ,మోస కారులదే రాజ్య మవుతుంది .

' జల్లి కట్టు ' ఆట అనగా నేమి ? / JALLIKATTU GAME MEANCE ?

ప్ర . ' జల్లి కట్టు ' ఆట  అనగా నేమి ? 

జ . ' జల్లి కట్టు ' ఆట అనగా  ఎద్దు పందాల ఆట . ఈ ఆటలో  ఎద్దులను  శుభ్రం  చేసి , పూజలు చేసి  వరసగా  పరుగులెత్తిస్తారు . ధైర్యమున్న  మొగ వారు , మొనగాండ్లు  వాటి కొమ్ములను పట్టుకుని  అదిమి పట్టి వాటిని  ఆప గల్గాలి . ఈ పందెం  లో అనేక మందికి గాయాలు అవుతాయి . ఎద్దుల కొమ్ములు విరిగి పోతాయి .  ఎవరైతే  ఎద్దులను  ఆపుతారో , వారే  గెలుపు ధీరులు , వీరులు . ఈ ఆట  మగ వారిలో  పోటీ తత్వాన్ని ,  ధీరత్వాన్ని  పెంచుతుందని , చిన్నా పెద్దల్లో , ఆడవారిలో  ఉత్సాహాన్ని  నింపుతుందని  అక్కడి వారి  అభిప్రాయం  .  ఈ ఆట ముఖ్యంగా  తమిళనాడులో ఆడుతారు . అలానే ఆంద్ర ప్రదేశ్ లో  చిత్తూర్ జిల్లాలో  మాత్రమె ఆడు తారు . మూగ జీవుల సంరక్షణ  సంస్థలు , కోర్టులో కేసు వేయడం వలన , 'సుప్రీం కోర్ట్ ' నిషేధం విధించింది .    

' కంపాస్ ' లోని ఇండెక్స్ ( ముల్లు ) ఎరుపు గుర్తు ఎల్లప్పుడూ ఏ దిక్కును సూచిస్తుంది ?

ప్ర . ' కంపాస్ '  లోని  ఇండెక్స్  ( ముల్లు )  ఎరుపు గుర్తు   ఎల్లప్పుడూ  ఏ  దిక్కును సూచిస్తుంది ?

జ .  ' కంపాస్ ' (COMPASS) లోని  ఇండెక్స్  ( ముల్లు )  ఎరుపు గుర్తు   ఎల్లప్పుడూ ఉత్తరం ( NORTH)  దిక్కును సూచిస్తుంది . అందుకని  దానికి అనుగుణంగా సరి చేసుకొని  , మిగిలిన దిక్కులను చూడాలి . 

Wednesday, January 13, 2016

దొంగ తనాలు , మోసాలు , పాపాలు ఎందుకు చేస్తారు ?

ప్ర . దొంగ తనాలు , మోసాలు , పాపాలు  ఎందుకు చేస్తారు ?
జ . అందరూ అనుభవించాల్సిన  సిరి సంపదలు , విలాసాలు , ఆనందాలు , సంతోషాలు , సుఖాలు , సమాజంలో  ఆదర్శంగా , ఉన్నత స్థాయిలో  ఉండే  ఏ  కొందరో  అక్రమంగా నిరంతరాయంగా  అనుభవిస్తుంటే , వాటిని  మేమెందుకు  పొంద కూడదనే  తపనతో కొందరు , తమ తెలివిని , సత్తా  చూపించుకునేందుకని మరికొందరు , నిజంగానే ఆకలికి , సుఖ సంతోషాలకు , ప్రేమకు నోచుకోలేక  ఇంకొందరు దొంగ తనాలు , మోసాలు , పాపాలు  చేస్తారు .   ఉన్నత స్థానంలో ఉన్న వారిలో  మార్పు రావాలి గాని , ఇక్కడ  శాసనాలు , ఎవ్వరిని  శాశ్వతంగా  అదుపులో పెట్టలేక పోవచ్చు  .  పుండు ఒక చోట  ఉంటే , మందు మరోచోట  పెడుతే  ఫలితం  శూన్యం . 

మనుష్యులలో ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు ?/ WHO LIVE MANY YEARS ?

ప్ర . మనుష్యులలో  ఎవరు ఎక్కువ  కాలం  జీవిస్తారు ?
జ . స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు .  అందుకు ముఖ్య  కారణాలు , వారు జీవన్ శైలి లో  జాగ్రత్త  వహించడం , మత్తు మందులు , డ్రగ్గ్స్  తీసు కోక పోవడం  , చుట్టలు  , సిగరెట్లు  త్రాగాక పోవడం , తెలియ కుండానే  , ఇంట్లోనే  వేల  మైళ్ళు  నడవడం , బరువు బాధ్యతలు  తక్కువగా ఉండటం , టెన్షన్స్  లేక పోవడం  మొదలైనవి గా చెప్పు కోవచ్చు. 

సాత్విక భోజనం అంటే ఏమిటి ?

ప్ర . సాత్విక  భోజనం  అంటే ఏమిటి ?

జ . కూర గాయాలు , ఆకు కూరలు ,  పప్పులు , పాలు , పెరుగు ,( మితంగా  ఉప్పు కారం)  తో  తీసు కునే ఆహారాన్ని, సాత్విక  భోజనం అంటారు .  దీని వలన  మనిషికి  కోపం రాదు . ప్రశాంతత  ఉంటుంది . ఆరోగ్యంగా ఉంటారు .  ఎక్కువకాలం జీవిస్తారు . 

' అరిషడ్వర్గాలు ' అనగా నేమి ? వాటి పర్యవసానాలు ఏమిటి ?

ప్ర . ' అరిషడ్వర్గాలు ' అనగా నేమి ? వాటి పర్యవసానాలు ఏమిటి ?
జ . మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడే  శత్రువులు , మనిషి  దుఃఖాలకు   మూల కారణాలు ' అరిషడ్వర్గాలు '.  మనిషి మనసును , చెట్టుకు పట్టిన  చెదలా  పీల్చి పిప్పి చేసేవి  ' అరిషడ్వర్గాలు '. ఈ అరిషడ్వర్గాలు  రెండు వైపులా  పదునున్న కత్తి లాంటివి .   అసలు ఏమిటి  ఈ  'అరిషడ్వర్గాలు ' . 
"కామ , క్రోధ , లోభ  , మోహ , మధ  మరియు  మాత్సర్యం " అనే ఆరు వర్గాలే  ( శత్రువులు ) ఈ ' అరిషడ్వర్గాలు'.   
మనిషి అభివృద్ధికి   అడ్డు పడే , మనిషి  దుఃఖాలకు   మూల కారణమయ్యే  ఈ ' అరిషడ్వర్గాలు'  ఏమిటో వివరంగా  
******************************************************************************
చూద్దాం : 
******
01. కామం :  కామం అంటే  వివిధ రకాల  శారీరక  , మానసిక కోరికలు  కలిగి ఉండటం . కామం మనిషికి ఒక  శత్రువు లాంటిది .  మనిషి  వివిధ రకాల కోరికలు  కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు  పడి , మనిషి  దుఃఖాలకు   మూల కారణమవుతుంది .  ఉదా :  కామంతో కీచకుడు  తనకు తానే  వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు . కీచకుడు  ఎవరో కాదు , విరాట మహారాజు  బావమరిది . విరాట మహా రాజు  బావమరిది ననే అహంకారంతో , తనను కూడా  లెక్క చేయ కుండా , అనేకమైన కీచక పనులు , ఆకృత్యాలు  చేసేవాడు .  అజ్ఞ్యాత వాస సమయంలో , విరాట మహారాజు  ఇంట  , సతీ  సమేతంగా   పంచ పాండవులు కొలువుదీరుతారు . అప్పుడు ఈ కీచకుడు  ద్రౌపతిని  చెర  పట్టేందుకు ప్రయత్నిస్తాడు .  తెలివిగా   ద్రౌపతి నర్తన శాలకు  రమ్మంటుంది . అక్కడ నల్లటి ముసుగులో వున్న  భీముడు,   భయంకరమైన  పిడిగుద్దులతో   కామంతో  ఊగి పోయే   కీచకుణ్ణి  హతమారుస్తాడు  .   


02.  క్రోధం : క్రోధం అంటే  కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్ని  కల్గి ఉండటం . అనుకున్న పనులు కాలేదని , తన మాట చెల్ల లేదని, పని వత్తిడి పెరిగిందని , దానికి కారణం  ఎదుటి  వారే నని  వారిపై  కోపాన్ని ప్రదర్శించడం , కక్ష పెంచు కోవడం  మొ. నవి . కోపం  లో , ఆవేశం లో  తీసుకునే  ఏ   నిర్ణయం  కూడా  నష్ట పరుస్తుందే కాని  విజయాన్ని  చేకూర్చదు . క్రోధం  మనిషికి ఒక  శత్రువు లాంటిది . క్రోధం   కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడి , మనిషి  దుఃఖాలకు   మూల కారణమవుతుంది .  ఉదా : శ్రీ  మహావిష్ట్నువు  మీద  క్రోధం వలన  హిరణ్యకశ్యపుడు , తన కొడుకు  ప్రహల్లాదుడు  నిరంతరం  హరినామ  స్మరణం  చేయడం  తట్టుకోలేక , కన్నా కొడుకని  కూడా చూడ కుండా, అత్యంత  కఠినమైన  శిక్షలు  పెడుతాడు . ఐనను   ప్రహల్లాదుడు హరి నామ స్మరణ  మానడు . " ఎక్కడరా  నీ  హరి  , ఈ  స్థంభం లో చూప మనగా " ,  " ఇందు గల డందు లేడన  వలదు , ఎందెందు  వెతికినా  నందు గలడు  హరి "   అంటాడు  ప్రహల్లాదుదు . వెంటనే  అదే  స్తంభాన్ని  చీల్చుకుని  శ్రీ  లక్ష్మి  నరసింహ  స్వామి  వచ్చి , హిరణ్యకస్యపున్ని  హతమారుస్తాడు . 


03. లోభం : లోభమంటే  పిసినారి తనం . తాను  సంపాదించింది  తనకు  తప్పా ఇతరులకు  చెంద కూడదు  అని అనుకోవడం . ఈ లోభత్వం గల  కొందరు  తాము తినరు , ఇతరులను  తిన నివ్వరు . చివరికి అది , దొంగల పాలో  లేక  భూమి పాలో కాక తప్పదు . లోభం  మనిషి ఎదుగుదలకు , దేశ అభివృద్దికి  ఒక  శత్రువు లాంటిది . ఉదా : ద్రుతరాసష్ట్రుడికి  లోభం ఎక్కువ . దేశ సంపద అంతా తన కొడుకులైన  దుర్యోధనాది  నూరుగురు కౌరవులకే  దక్కాలి గాని , పాండవులకు  సూది మొన  భూమి కూడా  చెంద  కూడదని  ఎత్తులు వేసి ,  ఓడించి , వారిని అరణ్య వాసం  పంపిస్తాడు . కాని  చివరికి  పాండవుల చేతిలో  లోభులైన  , క్రూరులైన , హీనులైన  కౌరవులు ,  అత్యంత ఘోరంగా  మరణిస్తారు .  

04. మోహం : మోహమంటే  అత్యధిక  కోరికలు కలిగి ఉండటం . అత్యధికంగా  వ్యామోహం  కలిగి ఉండటం . అభి మానం  పెంచుకోవడం .  తాను కోరుకున్నది తనకే  చెందాలి తప్పా  ఇతరులకు  చెంద కూడదు  అనే  గట్టి  భావన కలిగి ఉండటం . దానినే  ఇతరులు పొందితే  తట్టుకోలేక పోవడం . అనుకున్న కోరిక తీరక పోతే  మానసికంగా  క్రుంగి పోతారు .  మోహం  మనిషికి ఒక  శత్రువు లాంటిది .  ఉదా : కన్న  కొడకు పై  వ్యామోహంతో , కైకేయి  , రాముడిని కాకుండా  , భరతునికే   పట్టాభి షేకం  చేయాలని  కోరగా , మాట తప్పని  దశరథ మహారాజు  రాజు  , రాముడిని  14 సంవత్సరాలు  అరణ్య వాసానికి  పంపడం  , ఆ తరువాత   సీతా మాత , శ్రీ  రాముడు ఎదుర్కొన్న  శారీరక  మానసిక  బాధలు  వర్ణనాతీతం . చివరికి సీత  అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది  . భరతుడు  రాజ్యాధికారం  ఒప్పుకోలేదు .  అలానే  ద్రుత రాష్ట్రుడు కూడా తన కొడుకులైన  కౌరువలపై  వాళ్ళ మాలిన  వ్యామోహం  వలన  , వారిని సక్రమ మార్గం లో పెంచక సర్వాన్ని కోల్పోతాడు .   


05. మధం  : మధమనగా   గర్వం .  గాంభీర్యాన్ని  ప్రదర్శించడం . గొప్పలకు  పోవడం . అంతా  నా  వల్లనే  జరిగింది, ఇది నా వల్లనే సాధ్యం  . నేను  లేక పోతే  ఇది జరిగేది కాదు  అని  తమకు తామే  జబ్బలు  చరుచు కోవడం.  
ఎదుటి వారిని  లెక్క  చేయక పోవడం , కించ పరుచడం , దూషించడం , చిన్న చూపు చూడటం.  మధం   మనిషికి ఒక  శత్రువు లాంటిది . ఉదా : మధం తోటి , లంకాధి పతి  రావణా సురుడు, తన  మాయలతో  బంగారు  జింకను  సృష్టించి , శ్రీ రాముడిని  , లక్ష్మణుడిని  అటు వైపు  మళ్ళించి , మారు వేషంలో  బిక్షాటనకు  వచ్చి , శ్రీ రాముడు  గీసిన  గీతను  కూడా దాటి  వచ్చి  బిక్షం వేయాలని  ఒప్పించి , సీతను  అపహరించి,  లంకలో బంధిస్తాడు . హనుమంతుడు లంకకు  నిప్పు పెట్టినా  లెక్క చేయడు . వద్దని  వారించిన  తమ్ముడు విభీషణుడిని తరిమి  కొడుతాడు.  శ్రీ రాముడు తో  తలపడి  సర్వాన్ని కోల్పోతాడు . చివరికి   శ్రీ  రాముడి  చేతిలో  తానూ  హతుడయ్యాడు  

06. మాత్సర్యం : మాత్సర్యం అనగా  అసూయ , ఈర్ష్య , ద్వేషం . సిరి సంపదలన్నీ  తనకే దక్కాలి గాని  , ఇతరులకు దక్కకూడదు  అనే  భావన  , ఆలోచన  కలిగి ఉండటం . ఇతరులు  ఇండ్లు కట్టుకుంటే  చూసి  ఈర్ష్య  పడటం , ఇతరులు  బట్టలు కొనుక్కుంటే  చూసి  అసూయ పడటం , ఇతరుల ఇంట్ల  పెండిండ్లు  అవుతుంటే ఏడవడం మొ . నవి  గా చెప్పుకోవచ్చు .   ఉదా : పాండవుల ఎదుగుదలను  జీర్నిచుకోలేని  దుర్యోధుని మామ ' శకుని '  ఈర్ష్యతో ,  వారిని ఎలాగో  ఓడించాలని  మోసపూరిత  పాచికలు  వేసి , ఓడించి  పాండవులను  12 సంవత్సరాలు  అరణ్య వాసం  1 సంవత్సరం అజ్ఞ్యాత వాసం  పాలు చేస్తారు . 


ఈ అరిషడ్వర్గాలు  మనిషిని  శారీరకంగా  , మానసికంగా , ఆర్ధికంగా  సాంఘీక  పరంగా , సామాజిక పరంగా  అదః పాతాళ లోకానికి  త్రొక్కేస్తాయి . అందుకని  వీటిని  ఎప్పుడూ అదుపులో ఉంచు కోవాలి .  ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి   గాని  , వాటి  అదుపు  లోకి మనం వెల్ల  కూడదు .