Monday, December 30, 2024

గుడి మెట్లు

అంశం: మౌన శిల 

 శీర్షిక: *గుడి మెట్లు*


*శిలలు అవి గుడి మెట్లుగా* 

*ఉంటే తొక్కుతాం*

*అవే శిలలు శిల్పంగా*

*గుడిలో చేరితే వాటిని*

*దైవంగా మొక్కుతాం!*

*సృష్టిలో ఆవిర్భవించు ప్రతీది,  మౌన శిలనే*

*శిలలు శిలలుగ ఉన్నంత కాలం మౌన శిలలే*

*శిలలకు శిల్పి రూపమిస్తే, అవి దైవాలు గానో*

*ఉపయోగపడే వస్తువులు గానో*

*రూపాంతరం చెందుతాయి*

*విలువలను , గౌరవం, గుర్తింపును*

*పెంచుతాయి*


శిల  "మౌన శిలనే"

స్థలం రూపం మారడం వలన

గుడిలో దానికంత గౌరవం

శిల గుడి మెట్ల లోనే ఉండటం వలన

రూపం లేక పోవడం వలన 

గౌరవం తగ్గడమే కాదు

భక్తి హీనమైంది 

మనిషి అంతే


మౌన శిలలను, శిల్పి  అందంగా 

చెక్కినప్పుడే 

వాటికి విలువ ఏర్పడుతుంది 

గుర్తింపు వస్తుంది.


పుట్టిన శిశువు మౌన శిలనే

శిశువు అమ్మనే మొదటి గురువు

ఆ తరువాతనే గురువు

సమాజం , ప్రకృతి 

ఒక మనిషిగా తీర్చి దిద్దబడుతాడు 


అజ్ఞానులకు

గురువు బోధించినపుడె 

వారు జ్ఞానవంతులవుతారు 

సమాజానికి గణనీయంగా 

దోహదపడుతారు


అప్పటి వరకు వారు 

మౌన శిలల వలె నున్న, 

మౌన మానవులే


కవి ఆచార్య ఆత్రేయ ఒక పాట వ్రాశారు:

"శిలలపై శిల్పాలు చెక్కినారు 

మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు"

"రాజులే మారినా, రాజ్యాలు మారినా 

శిల్పాలు చెక్కు చెదరకుండా ఉంటాయంటారు"


మౌన శిలలను, శిల్పి శిల్పాలుగా 

మలిచిన , ఎంత కాలం అయినా

చెక్కు చెదరకుండా స్థిర స్థాయిగా

నిలిచి పోవడమే కాకుండా

చరిత్రను పదిలంగా కాపాడుతాయి


అలానే మనుష్యులను మంచి మార్గంలో 

నడిచే విధంగా తీర్చిదిద్దిన 

తమకే కాక సమాజానికి, దేశానికి 

ప్రయోజకుడిగా చరిత్రలో నిలిచి పోతాడు(రు).


      

No comments: