పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా
శీర్షిక: *ప్రాణత్యాగి*(మినీ కవిత: ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)
01.
తెలుగురాష్ట్ర జాతిపిత
పెంచెను రాష్ట్రము ఘనత
ఆమరణ ధీక్షతో
అమరుడయ్యెనూ నేత!
02.
అతి నిరాడంబరుడు
దిశా నిర్ధేశకుడు
ప్రజల చైతన్యపరిచే
వాక్పటిమ గలవాడు!
03.
మద్రాసు రాష్ట్రమున
మార్చినెల పదహారున
పొట్టి శ్రీ రాములు
జన్మించెనతడు భువిన!
04.
తండ్రి గురువయ్య గారు
తల్లి లక్ష్మమ్మ గారు
సాంప్రదాయ కుటుంబము
పెరిగె వినయముగ వీరు!
05.
ప్రత్యేక రాష్ట్రమనేది
జాతి గౌరవం అనేది
శ్రీరాములు తత్వం
సాధించడమూ అనేది!
06.
ఉన్నత విధ్యాధికుడు
ఇంజినీర్ చదివినాడు
బహు భాషా వేత్తగా
మన్ననలను పొందాడు!
07.
మేటి సంస్కరణ వాది
ఆత్మీయతావాది
వెలకట్ట లేనట్టి
భారతీయ, ప్రతినిధి!
08.
స్థిర లక్ష్యంబు గలవాడు
పరిణత ఉపన్యాసకుడు
ఆంధ్రరాష్ట్రం నిలిపిన
స్వాతంత్ర్యసమరయోధుడు!
09.
తెల్ల దొరలను తరమడము
బానిసత్వం వదలడము
*తెలుగు వారి స్వేచ్ఛనే*
రాములు గారీ లక్ష్యము!
10.
ఉప్పుకై సత్యాగ్రహము
సహాయా నిరాకరణము
గాంధి గారితో పాల్గొనె
క్విట్ ఇండియా ఉధ్యమము!
11.
ఆలోచనలు ఉన్నతము
*మౌనం* వారి ఆయుధము
శ్రీ రాములు ఆశయంబు
*అహింస*,తన సిద్ధాంతము!
12.
ఉచిత విద్య అందాలనె
ఉచిత వైద్యమందాలనె
హరిజన వర్గం లోనూ
ఆనందం విరియాలనె!
13.
ఫలాలందరికి అందిన
స్త్రీలు నిశి తిరుగగలిగిన
రాష్ట్ర పితకుకలుగు శాంతి
ప్రజలు హాయిగ బ్రతికిన!
No comments:
Post a Comment