అంశం: ప్రయాగ
శీర్షిక: *గోదాదేవి మేల్కొలుపు*
నిన్ను నేను మరువ లేక నీ కోసమే తపిస్తున్న పరితపిస్తున్నా స్వామీ!
అలమందల బయటకు పంపి , శీతల నదిలో స్నానం చేసి,
దవళ వస్త్రములేసుకుని చెలికత్తెలతో,తులసిమాల తెచ్చా లేనాధా!
విష్ణుదత్తు పుత్రికను త్వరగా లేవయ్యా
విరహంతో సీతాకోక చిలుకలా తూగుతున్నాను కనవయ్యా
చెలికత్తెలు నన్ను గేలి చేస్తున్నారు వినవయ్యా
నా మీద కోపమా తాపమా పరిహాసమా !
పరిహాసమా! నన్ను ఆట పట్టిస్తున్నావా!
అవునులే, గోదంటే నీకు అలుసు కదా
అయినా నేను నీ వెంట నీవు నా వెంట
పడుతూనే ఉంటాం, చిలుకా గోరింకల్లా
దేనికైనా కాలం కలిసి రావాలి, ఆ కాలంలో మనం
తేలియాడాలి.
అంతేగా, నేనంటే ఇంతేలే, అంతేలే.
పరిహాసం చేయకు స్వామి, మాలలు అలుగు తున్నాయి.
స్వామీ! శుభ *కర* *కర* ములు నీవే నయ్యా
సు *గంధం*. *గంధం* నీ కొరకే తెచ్చాను నాధా!
నా వస్త్ర ధా *రణ* *రణ* మునకు దారితీయు ననుకుంటున్నావా
నిన్ను నేను మరువ లేక నీ కోసమే తపిస్తున్న
పరితపిస్తున్నా స్వామీ!
No comments:
Post a Comment