Monday, December 9, 2024

చిత్ర కవిత

*అమూల్యమైనది ప్రకృతి*


*సంస్కృతి లేకుండా మనుగడ లేదు*
ప్రకృతి లేకుండా పారవశ్యము లేదు*

*విశ్వంలో కొనాలన్నా దొరుకనిది,
ఉచితంగా లభించినపుడు
ఆస్వాదించ దగినది, అమూల్యమైనది  ప్రకృతి*

కురులు దువ్వుకుని
శిఖ నిండ మల్లెల హారం చుట్టుకుని
చిగురు పచ్చని చీరకట్టుకుని
పాలపిట్ట జాకిటు తొడుగుకుని
ప్రకృతి తరుణిలా తలపిస్తూ
ప్రయాణిస్తుంది భారతీయ మహిళ

అద్భుతమైన
ప్రకృతిని ఆస్వాదిస్తూ
లేలేత బుగ్గలతో
ఎరుపెక్కిన పెదవులతో
రైలు ప్రయాణం సాగిస్తుంది
అందాల ఓ సుందరి

ఒక వైపు మంచు
మరోవైపు చలి చక్కిలి గింతలు
దర్పనం పూర్తిగా మూసివేసినా
సుందర ముఖ ప్రతిబింబం
అద్దంలో మంచు బిందువుల మధ్య
అందంగా దర్శనమిస్తుంది
తోటి ప్రయాణికులకు

ఎచటికో ప్రయాణం
ఎవరి కోసమో ఆ తాపత్రయం
మనసులో ఎంత ఆనందం ఉంటే మాత్రం
ధూమ శకటం వేగం పెంచుతుందా ఏమి?
దానికి కొన్ని భాద్యతలు ఉంటాయి కదా
ప్రయాణికులను వారి వారి గమ్యాలకు
చేర్చాలి కదా

తెలుసుకుంది అమ్మడు
పర్వాలేదనుకుందో ఏమో
చెదరని ముఖ తేజస్సుతో
చెక్కు చెదరని కురులతో
చిరునవ్వుతో  మగువ
ఉల్లాసమైన ఆలోచనలతో
స్వచ్ఛమైన మనస్సుతో
ప్రయాణం సాగిస్తునే ఉంటుంది
ప్రకృతిని ఆస్వాదిస్తూ
గమ్యం చేరే వరకు

    

No comments: