Monday, December 23, 2024

ప్రేమ గుడ్డిదా!

అంశం: చిత్ర కవిత (గోదాదేవి )

శీర్షిక: భగ్న ప్రేమికురాలు

*ప్రేమ గుడ్డిదా!*

వేకువ జామునే లేచి
తన ప్రియుడి కోసం నదిలో స్నానమాచరించి
చిలుక పచ్చని గౌను
ముదురు ఎరుపురంగు వస్త్రాలు ధరించి
ఎడమ చేతిలో తాను ప్రేమతో అల్లిన
పూమాలను చేబూని
కుడి చేతిలో తనకు ఇష్టమైన నెమలి పింఛం పట్టి

పక్షుల కిలకిలా రావాలు
వినిపిస్తున్నాయని
ఆవుల మందలు మేతకు వెలుతున్నాయని
త్వరంగా రండి రండి అంటూ
కర్ర చేతబట్టి చెలియలను పురమాయిస్తూ
వడివడిగా నడుస్తూ

ప్రియుడిని త్వరగా మేల్కొల్పాలనీ
తన చెంతకు త్వరగా చేరాలనీ ఆరాటపడుతూ
చిన్ని క్రిష్ణుడి ప్రేమకు తపిస్తూ
ఊహా లోకంలో తేలిపోతుంది
విష్ణు చిత్తుల వారి ముద్దుల తనయ
భగ్న ప్రేమికురాలు గోదాదేవి

ప్రేమ గుడ్డిదే కావచ్చు ,
కానీ, ప్రేమలో నమ్మకం, నిజాయితీ ,
నిస్వార్ధం, సంకల్పం ఉంటే
దానిని ఏ సృష్టి ఆపలేదు

   

No comments: