Wednesday, December 4, 2024

ప్రభుత్వ సంక్షేమ పథకాలు

శీర్షిక: *ప్రభుత్వ సంక్షేమ పథకాలు*


మంచి ఆలోచనలుంటే మంచే జరుగుతుంది
చెడు ఆలోచనలుంటే చెడే జరుగుతుంది
ఆశ మనిషికి శ్వాస లాంటిది
ఆ మనిషి జీవించినంత వరకు ఆశ ఉంటుంది

మనిషికి ఆశ ఉండాలి
కానీ అది పరిమితంగా ఉండాలి
కోరికలు పరవళ్లు తొక్కిన
అది మనిషి బలహీనతగా మారి
అతని పాలిట శాపంగా మారుతుంది
ఎదుటి వారి చేతిలో ఆయుధంగా
బలపడుతుంది

నేతలు జనులను ఉచితాలకు
బానిసలను చేసి 
మద్యానికి అలవాటు చేసి
శ్రమకు దూరం చేసి
సోమరులను చేయడం జరుగుతుంది

సంక్షేమ పథకాలు ఉండకూడదని కాదు
ఉచితాలు ఉండకూడదని కాదు
ప్రభుత్వ పథకాలు పరిమితంగా,
నిష్పక్షపాతంగాను, అర్హులకే అందాలి

ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించాలి
ఉద్యోగాలు కల్పించాలి,ఉపాధి పెంచాలి
ఉత్పత్తిని పెంచాలి, ఉన్నతిని సాధించాలి
స్వార్ధ చింతనను దూరం చేయాలి

ఇక గూటిలో వజ్రం పెట్టి మరిచిపోతే
పిల్లవాండ్లు అది గోటీ అని ఆడుకుంటారు
సంక్షేమ పథకాలు రూపొందించి
వాటి గురించి ప్రచారం లేకపోతే
నేతలు ,కార్య కర్తలే వాటిని అనుభవిస్తారు

ఎంతో మంది పేద ప్రజలు
సంక్షేమ పథకాలు తెలియక
వారి హక్కులు తెలియక
నాయకుల వద్ద బానిసలుగ
జీవితం వెళ్ళదీస్తున్నారు

ఓటుకు నోటు వంటి
ఊరక వచ్చే డబ్బుపై
ఆధారపడటం వలన
నగదు పథకాలు ప్రకటించి
వాటిని సొమ్ము చేసుకోవడానికి
అడుగడుగునా మద్యం షాపులను
తెరువడం వలన
యువత మద్యానికి బానిసలై
పనులపై అయిష్టత పెంచుకుంటున్నారు
ప్రశ్నించే శక్తి కోల్పోతున్నారు

యువతలో మార్పు రావాలి
లేని రాని ఉద్యోగాల కొరకు
చకోర పక్షుల్లా ఎదిరి చూడకుండా
తమ కాళ్ళపై తాము బ్రతుకాలన్న
దిశగా ఆలోచించాలి
పొందాల్సిన సంక్షేమ పథకాలను
సాధించుకోవాలి
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

No comments: