శీర్శిక: *నేను పుస్తకంలో అక్షరమైతే*
*పుస్తకం పూల తోటైతే *
*అక్షరాలు, గుణింతాలు,సున్న*
*విసర్గః లు , తోటలోని పుష్పాలు , పండ్లు*
నేను పుస్తకంలో అక్షరమైతే
అద్భుతాలను సృష్టిస్తా
నేను పుస్తకంలో అక్షరమైతే
అజ్ఞానాన్ని పారదోలుతా
నేను పుస్తకంలో అక్షరమైతే
అవినీతి నాయకుల తరిమి కొడుతా
అందుకే,
*నా అక్షరాలతో రచించబడ్డాను
ఎన్నికల సంస్కరణల దిక్సూచి*
తొణుకుల ప్రక్రియలో
నేను ఒక తెలుగు పుస్తకాన్ని !
నేను మనసున్న దానను
జనుల మనసెరిగిన దానను
స్వార్ధమేది లేదు నాలో
సగటు గుణమున్న దానను!
అవసరాలెరిగిన దానను
అవకాశాలున్న దానను
కులము మతము లేదు నాకు
ప్రాంత భేదమేది లేదు నాకు!
అవసరమైన వారికెల్ల
అందుబాటులో ఉంటాను
జ్ఞానాన్ని పంచడానికి సిద్దంగా ఉన్నాను
అరుగ దీయకు ,కరుగదీయకు నన్ను!
గుడిలోనూ ఉంటాను
బడిలోనూ ఉంటాను
అందరికి విజ్ఞానం అందిస్తాను
అందరి ఆధరణ పొందుతాను!
చిక్కు ముడులెన్నున్నా
టక్కున విప్పుతాను
పక్క పక్కనే ఉంటాను
చక్కగ నేనుంటాను!
విజ్ఞానం పెంచడానికి
టీచర్లను చేయడానికి
డాక్టర్లను చేయడానికి
ఇంజినీర్ల చేయడానికి!
నాయకులను చేయడానికి
సైనికులను చేయడానికి
నావికులను చేయడానికి
అధికారులను చేయడానికి!
లాయర్లను చేయడానికి
శాస్త్ర వేత్తలను చేయడానికి
మానవతా వాదులను చేయడానికి
ఆధ్యాత్మిక వాదులను చేయడానికి!
యోధులను చేయడానికి
యోగులను చేయడానికి
సమస్యల పరిష్కరించడానికి
నేను భగవద్గీత పుస్తకమైత
నింగి నేలను అనుసంధానం చేస్తా!
పుస్తకం హస్త భూషణం
చరిత్రలన్నీ పుస్తకాలలోనే నిక్షిప్తం
బావి తరాలకు పుత్తం ఆదర్శం
పుస్తకం సమస్త విజ్ఞాన భాండాగారం!
No comments:
Post a Comment