Monday, December 9, 2024

గరిక పోచ

అంశం: తృణ పుష్పం:


శీర్శిక: గరిక పోచ

తృణమే కదా,
తృణ పుష్పమే కదా అని
తీసి పడేయకు

"గడ్డి పోచతో
గజాన్ని బంధించవచ్చు"

పనికిరానిదంటూ ఏదీలేదు
ఈ విశ్వంలో
ఉపయోగించుకునే వారిని బట్టి
వాటి అవసరాలను బట్టి
వాటి విలువ తెలుస్తుంది

చేయి కాలినపుడు తెలుస్తుంది
మసిగుడ్డ విలువ ఏమిటో
పేస్టు లేనపుడు తెలుస్తుంది
వేప పుల్ల విలువ ఏమిటో

గ్రహణం పెట్టినపుడు తెలుస్తుంది
గడ్డిపోచ విలువ ఏమిటో
హోమాలు, కళ్యానాలు చేసేటపుడు తెలుస్తుంది
దర్బకంకణాల విలువ ఏమిటో

ఇల్లు దుమ్ము పట్టి నపుడు తెలుస్తుంది
చీపిరి కట్ట విలువ ఏమిటో
గిన్నెలకు మసి పట్టినపుడు తెలుస్తుంది
స్క్రబ్బరు విలువ ఏమిటో

గడ్డి పోచలు జనులకు
గొప్ప సందేశాన్ని ఇస్తాయి
వరదలు వచ్చినప్పుడు
కాలువల్లో,వాగుల్లో, నదుల్లో
తలవంచుకుని ఉంటాయి
వరుదలు పోయాక నిటారుగా నిలుస్తాయి

మనిషికి కష్టాలు బాధలు వచ్చినపుడు
ఎదుటి వారి బలం అధికమైనపుడు
ఎదిరించ శక్తి లేనపుడు తలవంచుతే
ఆ తర్వాత తల ఎత్తుకుని బ్రతుకవచ్చని

జనులు జీవరాశులు తొక్కిన నడిచిన
జంతువులు ఆహారంగా తీసుకునినా,
జనులు ఆయుర్వేదంలో ఉపయోగించినా
మొక్కవోని పచ్చదనంతో
ఆహ్లాదాన్ని అందించే పచ్చగడ్డి
ఎందరికో ఆదర్శం

సూక్ష్మ జంతువైన ఉడుత భక్తి
ఎంతోమంది వానరులకు స్పూర్తి నిచ్చే
రామ సేతువు నిర్మాణంలో భాగమయ్యే
భావితరాలకు ఆదర్శమయ్యే

ఈ సృష్టిలో దేనిని
తేలికగా తీసిపారేయరాదు
అవి గరిక పోసలు గానీ
మహా వృక్షాలు గానీ
వాటిని రక్షించడం
తెలివిగా ఉపయోగించడం
తెలుసుకోవడమే మానవ ధర్మం 

No comments: