Thursday, December 26, 2024

నరుడా! ఓ నరుడా!

నరుడా ! ఓ నరుడా! 

********************
నరుడా ! ఓ నరుడా!  ఓ బావి భారత పౌరుడా !
నర నారాయణుడికైనా ,  మాత యేరా మూలం
నరులందరికీ , నొక్కడే  దేవుడు

బొడ్డు కోసిన నాడు , నూలు పోగు రాదు
జీవి వెళ్లిన నాడు , అంగ వస్త్రం  పోదు

తల్లి ఒడిలోనే ఎవరైనా , చనుబాలే త్రాగేరు
దృష్టి పడని నాటికి , కపటమంటూ యెరుగరు

నరుల నరాల్లోన, పారేదీ రుధిరమే
నాది నీదనే స్వార్ధం , దరి చేయ నీయకు

విద్యా బుద్దులు నేర్చి , వినయంబు పెంచు
మాటకారి తనంతో , మోసాలు చేయకు

అమాయక ప్రజలకు , టోపీలు వేయకు
ఉనికిని చాటుకొనుటకే, ఈ జగతిలోన యుద్దాలు

ఆశలు తగ్గిస్తే , సుఖ శాంతులు వెళ్లివిరిసేను
అహం  కాల రాస్తే  , గౌరవాలు పెరిగేను

నీవు నేర్చిన విద్యను , నలుగురికి పంచు
నిత్యం వృత్తులతోటి  , ఉత్పత్తులు పెంచు

నీవు పాటించని నీతులు , వల్లించ  బోకు
నీకు తెలియని వాటిని , పట్టించు కోకు

నిను కన్న తలి దండ్రుల , మరువ బోకు
ఆలు బిడ్డల నెల్ల , చల్లంగా చూడు  

శాశ్వతమంటూ ఏదీ లేదు , ధరణి లోన
నిండు మనసుతో నొక్క , మేలైన తలపెట్టు

నీ జన్మ భూమిని , నిర్భయముగా పొగుడు
నీ  మాతృ భూమికి, రక్షణగా నిలువు

నిత్య పురస్కారాలతో  , ప్రజలు నిను కొలిచెదరు
జగతిలో నీ కీర్తి , వర్ధిల్లు చుండు  
 

No comments: