Thursday, December 26, 2024

దానం కాదది ' దౌర్బల్యాన్ని పెంచే యుక్తి

అంశం: చిత్ర కవిత


శీర్షిక: *దానం కాదది ,దౌర్బల్యాన్ని పెంచే యుక్తి*

*ఎడమచేతితో చేసిన దానం*
*కుడి చేయికి కూడా తెలియకూడదంటారు*

మహాభారతంలో, ఒక సారి కృష్ణుడు,
కర్ణుడు ఎడమ చేతి వైపు ముత్యాలు
పొదిగిన బంగారు గిన్నెలో నూనేతో
ఉంటే , కుడి చేతితో తలంటు కుంటుండగా
కృష్ణుడు వచ్చి, ఎడమ చేతి వైపున ఉన్న
బంగారు గిన్నెను ఇవ్వమని కోరుతాడు

"దానిదేమి భాగ్య మని", ఎడమ చేతితోనే
బంగారు గిన్నెను ఇచ్చేస్తాడు కర్ణుడు
"ఎడమచేతితో ఇవ్వడం తప్పుగదా" అంటే,
"తప్పేకావచ్చు,  కానీ ఎడమచేతినుండి కుడి
చేతిలోకీ తీసుకునే లోపే, ఏమైనాజరుగవచ్చు
నేను దానం చేయలేక పోవచ్చునీకు"
అంటాడు కర్ణుడు
దానానికి అంతటి గొప్ప తనం ఉండేది.

జనులను ఉచితాలకు బానీసలు చేయడం
ధూమ మద్యపానానికి అలవాటు చేయడం
యువతకు ఉపాధిని కల్పించలేకపోవడం
నాయకులలో స్వార్ధం పెరిగి పోవడం
ప్రజలను ఓటు బ్యాంకుగానే చూడటం
వంటి వాటి వలన
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా
పేదలు నిరుపేదలుగానూ
ధనికులు మరింత ధనికులుగా ఎదుగుతున్నారు

ఎవరితోనో వంట సామాగ్రిని పంపించి
పేదలకు ఇచ్చి నట్లు ఓ సెల్ఫీ తీసి
వాటిని నాయకులకు పంపడం
పేదలు , నాయకులను దేవుళ్ళుగా
మొక్కడం అనేది ఓ తంతుగా మారింది
ఓటు బ్యాంకు మద్దతు కొరకు 
నేతలు వేసే ఎత్తుగడ 
ఇది *దానం కాదది, దౌర్బల్యాన్ని పెంచే యుక్తి*

ఉచితంగా పంచే వస్తువులు డబ్బు ఏదైనా
ప్రజలు చెల్లించే పన్నులేనని తెలుసుకోవలె
చేతలుడిగిన వారికి మినహాయిస్తే,
ఉచితాలను అడ్డుకుని, ప్రశ్నించడం
మొదలు పెడుతూ, ఓటు హక్కును
సద్వినియోగం చేసుకుంటే
నాయకులు దారికి వస్తారు 
శ్రమశక్తి పెరిగి, ఉత్పాదకత పెరిగి
దేశం,  అభివృద్ధి చెందిన దేశంగా
పిలువబడుతుంది

   

No comments: