శీర్షిక: "చరవాణి"
ఇది మాయా కాలంమనిషి ఆదమరిచి ఉన్నాడంటే
ఉనికిని మాయం చేసే కాలం
సర్వస్వాన్ని ఊడ్చేసి కాలం
ఆహ్లాదాన్ని అందిస్తూ
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ
జనుల మతిని పోగొడుతుండే
మంత్ర ముగ్ధులను చేస్తుండే
ఆనంత లోకాలకు తీసుకెలుతుండే
ప్రపంచీకరణతో
దేశం కుగ్రామ మాయే
సాంకేతిక పరిజ్ఞానం
విశ్వమంతా విస్తరించే
దేశ విదేశాల వ్యాపార
ఒప్పందాలతో
నియంత్రణ లేకుండా పోయే
కొత్త కొత్త యాపులు వచ్చే
యువత జీవితాలతో
చెలగాటమాడుతుండే
వాట్సాప్, టెలిగ్రాం, ట్విట్టర్
ఫేస్ బుక్, ఇనిష్టాగ్రాం,
స్కైప్, యూట్యూబ్ ఛానెల్స్
ఇలా యెన్నో మరెన్నో...
ప్రపంచాన్ని క్షణాలలో
అరచేతిలో చూపించే
అగ్గి పెట్టె అందుబాటులోకి
రావడం వలన
పుస్తక పఠనం మృగ్యమాయే
లైబ్రరీలు తగ్గుముఖం పట్టె
పుస్తక ప్రచురణలు తరుగుతుండే
పుస్తకాలు చదవడం వలన
పెరుగుతుంది జ్ఞానం
నిక్షిప్తమవుతాయి మదిలో అక్షరాలు
పెరుగుతాయి మంచి ఆలోచనలు
చరవాణి వలన తగ్గుతుంది
వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి , మానసిక శక్తి
ఆప్స్ లో మంచివెన్నో చెడువెన్నో
ఇవి రెండు వైపులా పదునున్న
కత్తి లాంటివి
ప్రతి మనిషిలో వివిధ కోణాలున్నట్లే
వీటిల్లోనూ ఉంటాయి మంచి చెడులు
కొక్కెర పాలను నీటిని వేరు చేసినటుల
మంచిని స్వీకరించవలె, చెడును త్యజించవలె
లేదంటే అవుతాయి జీవితాలు
అగమ్య గోచరం
చదువుసంధ్యలున్నా లేక పోయినా
స్కాములకు ఎగబడుతున్నారు
ఉచిత సంపదకు ఆశ పడుతున్నారు
క్షణాలలో లక్షలకు లక్షలు
దోచేస్తున్నారు
సంస్కారాలు మరిచి
విష సంస్కృతికి లోనవుతున్నారు
సాంకేతిక పరిజ్ఞానం
అవసరానికి , మంచికే వినియోగించాలి
లేదంటే విలువైన సమయం , డబ్బు
శ్రమ, వ్యక్తిత్వం, జీవితం
వ్యర్ధమవక తప్పదు
ఇక నేడు చరవాణితో
దోచుకునే తెలివి ఉన్నవారికి
దోచుకున్నంత
చాపకింద నీరులా
స్కాముల సంస్కృతి
విస్తరించే
అమాయక జనుల
బ్యాంకు బ్యాలెన్స్ లు
గల్లంతవుతుండే
ఏదైనా అది పుస్తకమైనా
చరవాణి అయినా
ఒక వ్యసనంగా మార కూడదు
అవసరాలకు వాడుకుంటే
మితంగా ఉపయోగిస్తె
అద్భుతాలను సృష్టించవచ్చు
No comments:
Post a Comment