Wednesday, December 11, 2024

విజయం

*ప్రక్రియ : * యాక్సెప్ట్ మై ఛాలెంజ్ *

 కవిత
  శీర్షిక: విజయం 

భయమెందుకు నీకు మిత్రమా
మిత్రమా కష్టసుఖాలు ఎవరికైనా సహజం
సహజమైన దాని గురించి చింతించ తగదు మిత్రమా
మిత్రమా , నీకు విద్య ఉంది వినయం, తెలివి ఉంది
తెలివితో పాటు  అన్నీ ఉన్నాయి

నీవే భగవంతుడివి కావాలి, ఎందుకంటే
ఎందుకంటే నీలో శక్తి ఉంది యుక్తిఉంది
యుక్తిఉండటమే కాదు దైవానుగ్రహం
దైవానుగ్రహంతో పాటు గ్రహ బలం
బలమంటే గుర్తుకు వచ్చింది ధృడంగా నున్నావు

అన్నీ తెలిసి అభాగ్యుడివిగా జీవించకు
జీవించడం మనేది ఒక కళ
కళలు అరువది నాలుగు అంటారు
అంటారు కాదు అది నిజమే

నిజాన్ని ఎప్పుడూ నీరు గార్చకు
కార్చావో ఇక నీవు ఏమి సాధించలేవు
సాధించడమనేది మనిషి జీవితంలో గొప్ప విజయం
విజయం వలననే అత్యంత తృప్తి కలుగుతుంది


నేనిచ్చే ఛాలెంజ్

జీవిత లక్ష్యం
సాధించలేనిది ఏమీ లేదు
పుట్టుకు అర్ధం ఉండాలి
ఈర్ష్య అసూయలు


Note :పై పదాలతో అంత్యానుప్రాస అలంకారం  కవిత రాయండి

పర్యాయ పదాలు:
జాలి: దయ, కరుణ
కన్నీరు: బాష్పము, అశృవు
ఇష్టం: మక్కువ, అభిరుచి
మానవుడు: మనిషి, నరుడు

No comments: